breaking news
Musical director
-
సంగీత దర్శకురాలు శ్రీలేఖతో చిట్‌చాట్
-
స్త్రీల గీతానికి 'శ్రుతి'
మహిళా దినోత్సవం స్పెషల్ శ్రుతీహాసన్ మల్టీ ట్యాలెంటెడ్. ఆమెలో మంచి నటి, గాయని, సంగీత దర్శకురాలు, రచయిత్రి ఉన్నారు. రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరిలో చైతన్యం నింపే విధంగా ఆమె ‘మై డే ఇన్ ది సన్...’ అనే పాట రాశారు. ప్రతి స్త్రీ ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థయిర్యంతో ఉండాలని ఈ పాట ద్వారా చెప్పడమే తన ప్రధానోద్దేశమని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పాటను విడుదల చేయనున్నారు. పాట రాయడం, పాడటంతో పాటు సంగీత దర్శకులు ఎహ్సాన్-లాయ్ జంటతో కలిసి ట్యూన్ తయారు చేయడానికి కూడా కృషి చేశారామె. ‘‘ఇది మన (మహిళలను ఉద్దేశించి) టైమ్. మనం ఎదగాలి. మానసికంగా బలంగా ఉండాలి. ఆత్మన్యూనతా భావంతో, అభద్రాతాభావంతో తమను తాము ఎదగనివ్వ కుండా చేసుకుంటున్న మహిళలకు స్ఫూర్తిగా నిలవాలి. ఈ పాట అలానే ఉంటుంది. ఇది మనసుతో పాడుకోదగ్గ పాట. ఎహ్సాన్-లాయ్ వంటి ప్రతిభావంతులతో కలిసి ఈ పాట చేయడం ఆనందంగా ఉంది. వాళ్ల పాటలు వింటూ పెరిగినదాన్ని నేను’’ అని శ్రుతి చెప్పారు. ఆడియో విడుదల చేసి, ఆ తర్వాత కొన్ని నెలలకు వీడియోను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు. -
మూగబోయిన సంగీత ఝరి
చెన్నైలో ఎంఎస్ విశ్వనాథన్ మృతి సినీ పరిశ్రమ అశ్రు నివాళి తన అసమాన ప్రతిభతో సంగీత కళామతల్లిని ఓలలాడించిన ముద్దుబిడ్డ ఎంఎస్ విశ్వనాథన్ తనను వదలి తిరిగిరాని లోకాలకు వెల్లడంతో ఆ సంగీత కళామతల్లి కంటతడి పెట్టింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చెన్నై అడయారులోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. 87 ఏళ్ల ఈ కురువృద్ధుడు మరణానికి సినీలోకం అశువులు బాసింది. నెల రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ విశ్వనాథన్ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. భారతీయ సినిమా అపర సంగీత చాణుక్యుడు ఎం ఎస్ విశ్వనాథన్. ఎం అంటే మహా ఎస్ అంటే సంగీతం. విశ్వనాథన్ సొంతం. 70 వసంతాలకు పైగా సంగీత కళామతల్లి ఒడిలో ఓలలాడుతూ సరిగమలతో జతులుకడుతూ తాను ఎదుగుతూ సంగీత మాధుర్యాన్ని ఇతరులకు పంచుతూ సంగీత కుటుంబాన్ని పెంచుతూ సంగీత రారాజుగా మన్ననలను అందుకున్న ఎం ఎస్ విశ్వనాథన్‌ను అమరజీవి అయ్యారు. అయినా సంగీత పిపాసి చిరంజీవినే. తమిళ సినిమా సంగీత చక్రవర్తి అంటూ సాక్షాత్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే 2012లో బిరుదుతో సత్కరించి 60 బంగారు నాణేలతో పాటు కారును బహూకరించారు. బాల్యం : మెల్లిసై మన్నర్ (ది కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్) బిరుదాంకితుడైన ఎం ఎస్ విశ్వనాథన్ 1928 జూన్ 24న కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపంలోని ఎలపుల్లి గ్రామంలో జన్మించారు. మనయాంగల్ సుబ్రమణియన్, నారాయణి కుట్టి తల్లిదండ్రులు. నాలుగేళ్ల వయసులోనే ఎంఎస్‌కు పితృయోగం కలిగింది. దీంతో విరక్తి చెందిన తల్లి ఎంఎస్‌ను చంపి తన జీవితాన్ని చాలించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంఎస్ తాత సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఎంఎస్‌కు చదువుల తల్లి దగ్గరవ్వలేదు. సంగీతంపై ఆసక్తి కనబరచడంతో నీలకంఠం భాగవతార్ వద్దకు పంపారు. ఆయన వద్ద మూడేళ్లు సంగీతంలో సాధన చేశారు. అలా 13 ఏళ్ల వయసులోనే నిర్విరామ సంగీత కచేరి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎంఎస్‌కు నటనపైనా మక్కువే. తాత జైలు వార్డెన్ కావడంతో జైలు రోజున ఖైదీలతో హరిచంద్రనాటకం వేయించారు. అందులో ఎం ఎస్ లోహితుడిగా నటించి అదరగొట్టేశారు. మద్రాస్ పయనం: అది 1941వ సంవత్సరం విజయదశమి పర్వదినం మేనమామ సహాయంతో ఎం ఎస్ విశ్వనాథన్ మద్రాస్ మహానగరంలో కాలు మోపారు. జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎం.సుందరం శెట్టియార్, మొహిద్దీన్ చిత్రం నిర్మించ తలపెట్టారు. అందులో ఒక పాత్ర కోసం ఎం ఎస్‌కు మేకప్ టెస్ట్ చేశారు. అయితే ఆయన ఆ పాత్రకు నప్పకపోవడంతో తరువాత చూద్దాం అంటూ చేతులు దులిపేశారు. పరిస్థితి పాలుపోని ఎంఎస్ వారిని బ్రతిమలాడుకుని వారి కార్యాలయంలోనే బాయ్‌గా చేరారు. ఆ తరువాత ఆ సంస్థ నిర్మించిన కుబేర కుశలుఅనే చిత్రంలో సైనికుడిగా నటించారు. అయితే నటుడిగా తాను పనికి రానని గ్రహించి సంగీత రంగంపై దృష్టి సారించారు. సేలం మోడ్రన్ థియేటర్స్ సంస్థలు సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఉన్నారని తెలిసి ఆయన్ని కలిశారు. ఎంఎస్ విశ్వనాథన్‌తో ఒక పాట పాడించుకున్న మహదేవన్ ఆయనలోని ప్రతిభను గ్రహించి సెంట్రల్ స్టూడియోకు వెళ్లు పని దొరుకుతుందని చెప్పారు. ఎంఎస్ నేరుగా సెంట్రల్ స్టూడియోలో సంగీత దర్శకుడు ఎస్ఎం సుబ్బయ్య నాయుడిని కలిశారు. అంతే ఆయన ట్రూప్‌లో హార్మోనిస్టుగా చేరారు. ఆ తరువాత సీఆర్ సుబ్బరాయన్ సంగీత ట్రూప్‌లో చేరారు. అక్కడ టీకేరామమూర్తితో పరిచయం ఏర్పడింది. 1952లో సీఆర్ సుబ్బరాయన్ మరణించడంతో ఆయన సంగీతాన్ని అందిస్తున్న దేవదాస్, చండీరాణి చిత్రాలను పూర్తి చేసే బాధ్యతలను ఎం ఎస్ విశ్వనాథన్, రామమూర్తి నిర్వహించారు. అలా ఆ చిత్రాల విజయాలతో ఎం ఎస్ విశ్వనాథన్ జెనోవా చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్ర కథా నాయకుడు ఎంజీఆర్ కావడం విశేషం. రామమూర్తి విశ్వనాథన్‌ల ద్వయం : ఆ తరువాత నిర్మాత టీకే కల్యాణం తన చిత్రం పణంకు రామమూర్తి విశ్వనాథన్‌లను కలిపి సంగీతం అందించమని చెప్పారు. అలా మొదలైన ఆ సంగీత ద్వయం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ 700 చిత్రాల వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. మొత్తం 1200 చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘనత ఎం ఎస్ది. ఎం ఎస్ విశ్వనాథన్ భార్య పేరు జానకి అమ్మన్. వీరికి గోపికృష్ణ, మురళీధరన్, ప్రకాష్, హరిదాస్ అనే నలుగురు కొడుకులు. లతా మోహన్, మధు ప్రసాద్, శాంతికుమార్ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. చెన్నై శాంతోం రోడ్డులో నివసిస్తున్న ఎంఎస్ విశ్వనాథన్ కుటుంబం నివశిస్తోంది. ఎం ఎస్ విశ్వనాథన్ భౌతిక కాయానికి బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నేడు ఎంఎస్ అంత్యక్రియల కారణంగా సినిమా షూటింగ్‌లు రద్దయ్యాయి. సీఎంల చిత్రాలకు సంగీతం : ముఖ్యమంత్రులుగా తమిళ, తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన, పాలిస్తున్న ముఖ్యమంత్రులు ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నటించిన పలు చిత్రాలకు ఎం ఎస్ విశ్వనాథన్ సంగీతం పక్క బలాన్నిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితోను ఎంఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. గాయకులకు పేరు ప్రఖ్యాతులు : ఎం ఎస్ విశ్వనాథన్ చాలామంది గాయనీ గాయకులకు పేరు ప్రఖ్యాతులు అందించారు. నేటి ప్రఖ్యాత గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్ఆర్ ఈశ్వరి, టీఎం సౌందరరాజన్, కేజే ఏసుదాస్ మొదలగు వారందరూ ఎం ఎస్ సంగీతంలో ఆలపించి ప్రశంసలందుకున్న వారే. నటుడు, గాయకుడు కూడా: ఎం ఎస్ గొప్ప సంగీత దర్శకుడే కాదు. గాయకుడు, నటుడు కూడా. ఆయన తన చిత్రాలతో పాటు ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లోనూ పాడారు. మొత్తం 500లకు పైగా పాటలను పాడారు. ఇక చిన్నతనంలో నటుడవ్వాలన్న కోరికను ప్రముఖ సంగీత దర్శకుడైన తరువాత తీర్చుకున్నారు. కాదల్‌మన్నన్ చిత్రంలో ఎంఎస్ తొలిసారిగా హాస్యపాత్రలో అలరించారు. ఆ తరువాత కాదలా కాదలా తదితర 10 చిత్రాల్లో నటించారు. జాతీయ అవార్డులు లేవు కాని.... ఎం ఎస్ విశ్వనాథన్ జాతీయ అవార్డులకు అలంకారం అయ్యే అవకాశాన్ని పొందలేదు గాని ఆయనికి అంతకం టే గొప్ప అవార్డులే వరించాయి. 1963 జూలై 16న గీత రచయిత కన్నదాసన్, దర్శకుడు శ్రీధర్, నటుడు జెమినీ గణేశన్, చంద్రబాబు చిత్రాలయ గోపుల సమక్షంలో శి వాజీ గణేశన్ రామమూర్తి, విశ్వనాథన్‌లకు మెల్లిసై మ న్నన్ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. కలైమామణి, ఫిలింఫేర్ లాంటి పలు బిరుదులు ఎం ఎస్‌ను వరించా యి. అన్నింటికంటే పెద్ద బిరుదు సంగీత ప్రియులు ఎం ఎస్‌ను గుండెల్లో స్థిరస్థాయిగా నింపుకున్నారు. సంగీతం ఉన్నంత కాలం ఎంఎస్ విశ్వనాథన్ చిరంజీవినే. -
నేనూ ఖమ్మం కుర్రాణ్నే
‘మన కుర్రాళ్లు’ మ్యూజిక్ డెరైక్టర్ భీమ్స్ ఖమ్మం : ‘విప్లవాల పురటి గడ్డ, కవులు, గాయకులు, కళాకారులకు జన్మనిచ్చిన ఖమ్మంలో పుట్టినందుకు గర్వపడుతున్నా’ అంటున్నారు ‘మన కుర్రాళ్లు’ చిత్రం సంగీత దర్శకుడు, సినీ పాటల రచయిత భీమ్స్. తానూ ఖమ్మం కుర్రాణ్నేనని తెలిపారు. నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరుగుతున్న ఇంప్యాక్ట్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బయ్యారం మండల కేంద్రానికి చెందిన తానకు చిన్నతనం నుంచే పాటలు పాడటం, రాయడం ఇష్టమన్నారు. ఇదే తనను కళాకారులు, సాహితీవేత్తలకు దగ్గర చేసిందని తెలిపారు. హాస్టల్ వార్డెన్ సీతారాములు ప్రోత్సాహంతో పాటలు రాయడం మొదలెట్టానన్నారు. ‘శ్రావణ మాసం’ చిత్రంలో ‘నీ కంచెర జుంపాలు చూసి సైదులు....’ ‘ఆయుధం’లో ‘ఓయ్ రాజూ..’ ‘సీమ టపాకాయలు’లో ‘దీరే ధీరే.. దిల్లే..’ పాటలు మంచి గుర్తింపునిచ్చాయని అన్నారు. త్వరలో విడుదల కానున్న సినిమాలు ‘మన కుర్రాళ్లు’, ‘అలా..ఎలా..?’ సినిమాలకు పాటలు రాసి మ్యూజిక్ డెరైక్టర్‌గా పనిచేశానని అన్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన ఆయుధం సినిమా డెరైక్టర్ శంకర్, కరెంట్ తీగల డెరైక్టర్ నాగేశ్వరరెడ్డి, మన కుర్రాళ్ళు డెరైక్టర్ వీరశంకర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. -
సంగీతంలో రాణిస్తా
ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ప్రతిభ చాటుకుంటారు. కొందరు మాత్రం పలురంగాల్లో సత్తా చాటాలని ఆశిస్తుంటారు. ఈ రెండో కోవకు చెందింది ఆండ్రియా. నటిగా ఈ సుందరి ప్రతిభ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బోల్డ్ గర్ల్‌లో మంచి గాయని కూడా దాగి ఉన్న విషయం తెలిసిందే. ఆయిరత్తిల్ ఒరువన్ లాంటి పలు చిత్రాల్లో ఈ బ్యూటీ పాడిన గీతాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఇలా నటిగా, గాయనిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్న ఆండ్రియా ఇప్పుడు తనలోని మూడో ముఖాన్ని చూపించాలని తపిస్తున్నారు. సంగీత దర్శకురాలిగా రాణిస్తానని చెబుతున్నారు. తన కోరిక కూడా అదేనని స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఆండ్రియా యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని, అయితే అది మరో రకంగా విమర్శలకు తావిచ్చిందనే టాక్ కూడా ఉంది. ఏదేమయినా ఆ ప్రయత్నం బెడిసికొట్టినా ఆండ్రియా సంగీత దర్శకురాలవ్వాలనే లక్ష్యంగా సాగిపోతున్నారు. ఆ మధ్య తను నటించిన తరమణి చిత్రం కోసం ఒక పాటను ఆంగ్లంలో రాసి తానే ట్యూన్ కట్టారు. రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఆండ్రియా ఆసక్తిని గ్రహించి ట్యూన్లు కూడా బాగుండడంతో ఆ చిత్రంలో పొందుపరచడానికి యువన్ శంకర్ రాజా అంగీకరించారట. ఇప్పుడీ పాటనే దర్శకుడు రామ్ తన చిత్ర ప్రమోషన్ కోసం వాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. షోల్ అప్ తరణి.... అనే ఆ పాటను నటుడు కమల్ హాసన్ విడుదల చేశారు. పనిలో పనిగా ఆండ్రియా ట్యూన్స బాగున్నాయనే కితాబు కూడా ఇచ్చారు. అలా ఆయన ప్రోత్సహించడంతో ఆండ్రియా ఖాళీ సమయాల్లో తన సెల్ఫోన్లోనే మరిన్ని ట్యూన్స్ కట్టి రికార్డ్ చేసుకున్నారట. ఈ పాటల ఆల్బమ్‌ను పలువురు సినీ ప్రముఖులకు అందించారట. అలా అందుకున్న వారిలో దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా ఉన్నారట. ఆయనకు ఆండ్రియా ట్యూన్ తెగనచ్చేయడంతో ఆమెను సంగీత దర్శకురాలిగా పరిచయం చేసే పనిలో ఉన్నారని సమాచారం.