breaking news
munagapaka
-
పండంటి కుటుంబం.. క్షణాల్లో ఛిన్నాభిన్నం
సాక్షి, మునగపాక: ఇన్నాళ్లూ ఆనందమే గానీ విషాదం తెలీని కుటుంబం వారిది.. భార్యాభర్తలు, వారికి ముద్దులొలికే ఇద్దరు పిల్లలు.. అంతా సవ్యంగా సాగిపోతున్న పండంటి జీవితం.. క్షణాల్లో ఛిన్నాభిన్నమైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా మిగిలిన ముగ్గురు కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. మరో గంటలో భవాని మాలలు ధరించి దుర్గాదేవి నవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ కుటుంబానికి లారీ రూపంలో విషాదం ఎదురైంది. వివరాలు.. మునగపాక గ్రామానికి చెందిన దొడ్డి శంకర్ గణేష్ బ్రాండిక్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి దుర్గాదేవి మాలలు ధరించడంలో భాగంగా స్నానమాచరించేందుకు ద్విచక్ర వాహనంపై అచ్యుతాపురం మండలం పూడిమడకకు గురువారం తెల్లవారుజామున బయలుదేరారు. తిమ్మరాజుపేట మరిడిమాంబ గుడి సమీపంలో అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వైపునకు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వారిని బలంగా ఢీకొంది. ఆందోళనకారులతో మాట్లాడుతున్న అనకాపల్లి డీఎస్పీ సునీల్ ఈ సంఘటనలో బైక్‌పై వెళుతున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శంకర్ గణేష్‌కు కాళ్లు, చేతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భార్య ఉషకు, కుమారుడు హర్షకు తీవ్ర గాయాలయ్యాయి. కూతురు యోతికి కూడా గాయాలు కావడంతో స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. మార్గం మధ్యలో హర్ష (5) మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు క్షతగాత్రులను కేజీహెచ్‌లో చేర్పించారు. శంకర్‌గణేష్, అతని భార్య ఉష పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. చదవండి: (ఘోర ప్రమాదం.. 15 మంది దుర్మరణం) స్థానికుల ఆందోళన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ పూడిమడక రోడ్డులో మునగపాక వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ లారీ యజమాని వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన కొనసాగిస్తామని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆందోళన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఏపీ గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, సర్పంచ్ దిమ్మల అప్పారావు, సీపీఎం నేత మహేష్ తదితరులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. అనకాపల్లి సీఐ శ్రీనివాసరావు పరిస్థితిని అదుపు చేయడానికి శ్రమించారు. ఈ విషయం తెలిసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ వచ్చి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆందోళన విరమించారు. ఈ మార్గం మీదుగా అనుమతులు లేకుండా భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. ప్రమాదాల నివారణకు ఇకపై నిత్యం పోలీసు గస్తీ ఉంటుందన్నారు. చదవండి: (అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థిని మృతి) -
చంద్రబాబు ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు?
-
రబీకి ‘అకాల నష్టం
- 60 ఎకరాల్లో మునిగిన వరి - లబోదిబోమంటున్న రైతాంగం మునగపాక, న్యూస్‌లైన్ : మండల వ్యాప్తంగా శుక్రవారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో రబీ వరిపంటకు తీవ్రనష్టం వాటిల్లింది. రబీలో నాటిన వరిపంట చేతికి అందివస్తున్న తరుణంలో వర్షాలు తీరని నష్టాలకు గురి చేసిందంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్‌లో దెబ్బతిన్న రైతాంగం ఈసారి రబీపైనే ఆధారపడి పెద్దమొత్తంలో వరి సాగు చేపట్టింది. రబీలో వరి సాధారణ విస్తీర్ణం 48 హెక్టార్లు కాగా ఈ ఏడాది 110 హెక్టార్లకు పైగా సాగు చేసినట్లు అధికారులు చెప్పారు. ఖరీఫ్‌లో వరి చేతికి అందుతుందనుకున్న తరుణంలో తుపాన్లు కొంపముంచడం తెలిసిందే. రబీలో అయినా ఫలితాలు సాధించాలనుకుంటే అకాల వర్షం దెబ్బ తీసిందంటూ రైతులు వాపోతున్నారు. మునగపాక పరిధిలో సుమారు 60 ఎకరాలకు పైగా వరి తడిసిపోయింది. ఆవ ప్రాంతంలో నాటిన పొలాలు దాదాపు నీట మునిగిపోయాయని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో వేలాది రూపాయలు నష్టపోయామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదిరోజుల్లో చేతికి అందుతుందనుకున్న వరి ఒక్కసారిగా వర్షానికి దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోయామంటూ పీలా అప్పారావు అనే రైతు వాపోయాడు. శుక్రవారం అర్ధరాత్రి 50.10 మిల్టీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ వర్షం రైతులకు అంత లాభసాటిగా ఉండదని వ్యవసాయాధికారి కె.నీలాధరరావు అభిప్రాయపడ్డారు.