breaking news
Mr India 2
-
మా వంటబ్బాయి చెప్పిన కథ విని ఆశ్చర్యపోయా: దర్శకుడు శేఖర్ కపూర్
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్’ (వేవ్స్)– 2025’ ని ఈ నెల 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. నాలుగురోజుల పాటు జరిగిన ఈ సమ్మిట్ ఆదివారంతో ముగిసింది. ‘వేవ్స్’ సమ్మిట్‌కి హాజరైన ప్రముఖ దర్శకుడు, ‘మిస్టర్ ఇండియా’ చిత్రం ఫేమ్ శేఖర్ కపూర్(Shekhar Kapur ) మాట్లాడుతూ–‘‘నా దృష్టిలో ఏఐ అనేది పెద్ద డెమొక్రటిక్ టూల్. వినోదరంగ పురోగతి కోసం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలన్నది చూడాలి కానీ, అతిగా భయపడడం అనవసరం. ఉదాహరణకు, నా ‘మిస్టర్ ఇండియా–2’(Mr India 2 ) కోసం కథ ఆలోచిస్తూ ఉంటే, ఒకరోజు మా వంటబ్బాయి అద్భుతమైన కథ చెప్పాడు. ఏ అనుభవం లేని అతనికి ఆ ఆలోచన ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతూ అడిగా. ‘చాట్ జీపీటీలో అడిగితే చెప్పింద’ని మా కుక్ జవాబు ఇచ్చేసరికి ఆశ్చర్యపోవడం నా వంతు అయింది’’ అని తన వ్యక్తిగత అనుభవం పంచుకున్నారు. ‘‘అయితే ఏఐ, చాట్ జీపీటీలు ఎంత గొప్పవైనా, మనం వాటి మీద అతిగా ఆధారపడితే బద్ధకం పెరుగుతుంది. ఎందుకూ కొరగాకుండా పోతాం. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా మానవ మేధనూ, ఒరిజినాలిటీనీ అవి అధిగమించలేవు’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అన్ని రంగాలనూ కృత్రిమ మేధ (ఏఐ) ప్రభావితం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో వెండితెరపై కథ, కథనం ఎలా మారనుంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నకు శేఖర్ కపూర్ దగ్గర ఉన్న జవాబు ఏంటి? ‘వేవ్స్’కు హాజరైన ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ–‘‘ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని అందిపుచ్చుకోవాలి. లేదంటే మనం వెనకబడిపోతాం’’ అన్నారు. ‘‘మారుతున్న కాలంతో పాటు వస్తున్న అనేక కొత్త టెక్నాలజీలు, మాధ్యమాలు తమవైన ఆడియన్స్‌ను సృష్టించుకుంటాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వెండితెరపై వినోదం చూడడం తక్కువ అవుతోంది. మహా అయితే 2 శాతం ఉంటుందేమో! ఇతరేతర మాధ్యమాల్లో చూస్తున్నారు, వినోదం పొందుతున్నారు. ఇది గమనించి దానికి తగ్గట్టుగా మనమూ మారాలి’’ అని అభిప్రాపడ్డారు. ఇంకా ఆయన మాట్లాడుతూ–‘‘ఏఐ అనేది అప్పటికే అందుబాటులో ఉన్న అపరిమిత సమాచారం ఆధారంగా నడుస్తుంది. కానీ మానవ జీవితం రేపు ఎలా ఉంటుందో ముందే తెలియకుండా మిస్టరీగా అనునిత్యం ముందుకు సాగుతుంది. జీవితంలోని విశేషం అదే’’ అని అంతర్జాతీయంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌కు సైతం నామినేటైన ఈ దర్శకుడు విశ్లేషించారు. – సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?'
మిస్టర్ ఇండియా సినిమాకు బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1987లో రిలీజైన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథను సలీమ్-జావేద్ అక్తర్‌లు అందించారు. తాజాగా ఈ సినిమాను మిస్టర్ ఇండియా 2గా తీయాలని 'టైగర్ జిందా హై' ఫేమ్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రీమేక్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అబ్బాస్ తన ట్విటర్లో వెల్లడిస్తూ.. ' మిస్టర్ ఇండియా సినిమా కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలందుకున్న ఐకానిక్ పాత్రలను మరోసారి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నా.. నటీనటులు ఎవరనేది ఇంకా ఏం నిర్ణయించలేదు' అని పేర్కొన్నారు. (‘అమృతగా తాప్సీ నన్ను ఆకట్టుకుంది’) అయితే మిస్టర్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన అనిల్ కపూర్, చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్‌ను సంప్రదించకుండా రీమేక్ ఎలా తీస్తారంటూ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. వారి అనుమతి లేకుండా సినిమాను తీస్తే వారిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ ట్విటర్లో స్పందించారు.' మిస్టర్ ఇండియా సినిమా గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా... నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. మిస్టర్ ఇండియా సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా నాకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాపై నాకు హక్కులు ఉండవా ?' అంటూ పేర్కొన్నారు. Shekhar saheb the story the situations the scenes the characters the dialogue the lyrics even the title none of these were yours .I gave it all to you . Yes you execute it very well but how can your claim on the film be more than mine . It wasn’t you idea . It wasn’t your dream — Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020 దీనిపై జావేద్ అక్తర్ శేఖర్ కపూర్‌ను తప్పుబడుతూ రీట్వీట్ చేశారు.' మిస్టర్ ఇండియా కథ, పాటలు, డైలాగ్‌లు, సన్నివేశాలు, కనీసం చిత్రం టైటిల్ కూడా మీకు సొంతం కాదు. వాటిన్నంటిని నేను సలీమ్ కలిసి మీకు అందించాం అన్న విషయాన్ని మరిచిపోయారు. నిజమే.. మీరు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ సినిమా మీద మొత్తం హక్కులు నీకే ఉన్నాయనడం ఏం బాగాలేదు. అసలు ఈ సినిమా మీ ఆలోచన కాదు, అది మీ కల కూడా కాదు' అంటూ జావేద్ మండిపడ్డారు. -
కార్పొరేట్ ‘రాక్‌స్టార్’
-
శ్రీదేవి నెక్స్ట్ సినిమా.. భారీ ప్రాజెక్టు?
అలనాటి అందాల అతిలోక సుందరి శ్రీదేవికి ఇప్పటికీ తిరుగులేని స్టార్డమ్ ఉంది. ఒకప్పుడు భారీ స్టార్డమ్తో, వరుస సినిమాలతో బాలీవుడ్‌ను ఏలిన ఈ సుందరిమణి.. ఇటీవల వచ్చిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాతో తన హిందీచిత్రసీమలో తనకు తిరుగులేదని మరోసారి చాటుకుంది. ఇప్పటికే ఆమె నటించిన తాజా సినిమా ‘మామ్’ విడుదలకు ముందే పాజిటివ్ సమీక్షలు వచ్చాయి. ఈ సినిమా శ్రీదేవి కెరీర్లో మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని చెప్తుండగా.. ఆమె తదుపరి చిత్రం కోసం భర్త బోనీ కపూర్ అప్పుడే సన్నాహాలు ప్రారంభించారు. ఎంతోకాలంగా వెయిట్‌చేస్తున్న ప్రతిష్టాత్మక ‘మిస్టర్ ఇండియా 2’ ప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెస్తున్నాడు బోనీ కపూర్. ఈ సీక్వెల్లో శ్రీదేవి, అనిల్ కపూర్ తమ ఒరిజినల్ పాత్రలు పోషించనుండగా.. మరో యువజంట కీలకమైన పాత్రల్లో నటించనుందని సమాచారం. ‘మిస్టర్ ఇండియా 2’ కోసం ఇప్పటికే కట్టుదిట్టమైన స్క్రిప్ట్ సిద్ధమైందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘మిస్టర్ ఇండియా’లో శ్రీదేవి, అనిల్ కపూర్ జోడీ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. వారు అదే మ్యాజిక్‌ను ఈ సీక్వెల్‌ను చూపించబోతున్నారట. అయితే, మిస్టర్ ఇండియా-2ను తెరకెక్కించేందుకు ప్రఖ్యాత దర్శకుడు శేఖర్ కపూర్ నిరాకరించారని సమాచారం. ఈ నేపథ్యంలో కొత్త దర్శకుడి కోసం వేట సాగుతోంది. రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా, మామ్ దర్శకుడు రవి ఉద్యవర్ ఈ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది.