breaking news
Motor Men
-
పాపం మోటార్‌మెన్ 150 మంది ఓటుకు దూరం
సాక్షి, ముంబై: ఓటు ఎంతో విలువైందని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని స్వయంగా ప్రభుత్వమే టీవీ, దినపత్రికలు, ఎఫ్.ఎం.రేడియోలలో ప్రకటనలతోపాటు రహదారులపై ప్లెక్సీలు, బ్యానర్ల ద్వారా కోరుతోంది. ఇదే విషయమై ఎన్నికల కమిషన్ దేశంలోని అనేక ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఎంతో బాగా ప్రచారంచేసినా 75 లక్షల మంది ముంబైకర్లకు సేవలందిస్తున్న లోకల్ రైళ్ల మోటర్మెన్లలో 150 మందికి ఆ అవకాశం చేజారిపోనుంది. ఇందుకు కారణం ఆ రోజు కూడా వారు విధి నిర్వహణలో ఉండాల్సి రావడమే. రాష్ట్రంలో ఈ నెల 24న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. సెంట్రల్ రైల్వే పరిధిలో 600, పశ్చిమ రైల్వేమార్గంలో 410 మోటర్మెన్లు విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఎన్నికల రోజునకూడా వారిలో కొందరు విధి నిర్వహణలో ఉండకతప్పడం లేదు. ఈ కారణంగా దాదాపు 150 మంది తమ ఓటు హక్కుకు దూరం కానున్నారు. సెంట్ర ల్ రైల్వే మార్గంలో లోకల్ ైరె ళ్లు ప్రతిరోజూ సుమారు 1,600, పశ్చిమ మార్గంలో దాదాపు 1,100పైగా ట్రిప్పులు తిరుగుతాయి. లోక్‌సభ ఎన్నికల రోజున మోటార్మెన్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా టైమ్‌టేబుల్ రూపొందించేందుకు సంబంధిత అధికారులు ఎంతగానో ప్రయత్నించారు. అయితే అది ఆచరణ సాధ్యం కాలేదు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగిచుకునేలా షెడ్యూల్లో మార్పులుచేస్తే రైళ్ల ట్రిప్పులను తగ్గించాల్సి ఉంటుంది. అయితే అది ఆచరణ సాధ్యం కాదని తేలిపోయింది. ఇదే పరిస్థితి శాసనసభ ఎన్నికల సమయంలో కూడా ఎదురుకానుంది. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరుపుతున్నారు. వారు ఓటు హక్కు వినియోగించుకునేవిధంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిందిగా డిమాండ్ చేయనున్నారు. ప్రస్తుతం ఎన్నికల పనులకు దూరప్రాంతాలకు వెళ్లిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఉంది. అయితే లోకల్ రైళ్ల మోటర్మెన్లకు ఈ సౌకర్యం లేకపోవడంతో ఇక ఓటుపై ఆశ వదులుకోవల్సిందేనా అనే సందేహం వ్యక్తమవుతోంది. -
విడిపోయిన లోకల్రైలు బోగీలు
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి కల్యాణ్ బయలుదేరిన లోకల్ రైలు మధ్య కప్లింగ్ ఊడి బోగీలు విడిపోయాయి. అయితే మోటార్‌మెన్ (డ్రైవర్) అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం దీవా-కోపర్ స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. దీనివల్ల దాదాపు గంటకుపైగా లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాయంత్రం విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అనేకమంది రైలు దిగి కాలినడకన వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో దీవా స్టేషన్ నుంచి లోకల్ రైలు కల్యాణ్ దిశగా బయలుదేరింది. కొంత దూరం వెళ్లగానే ఏడో బోగీ, ఎనిమిదో బోగీ మధ్యనున్న కప్లింగ్ ఊడింది. అప్పటికీ రైలు వేగం పుంజుకోలేదు. ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లిపోయింది. వెనకా ఉన్న ఐదు బోగీలు కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. చీకటి కారణంగా రైలులో ఉన్న ప్రయాణికులకు అసలేం జరిగిందో తెలియలేదు. బయటకు తొంగి చూడగా కప్లింగ్ ఊడిపోవడంతో ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లినట్లు గుర్తించారు. ఐదు బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు కిందికి దిగేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మోటార్‌మెన్ వెంటనే రైలును ఆపాడు. తర్వాత విడిపోయిన ఐదు బోగీలను కారుషెడ్డుకు తరలించారు. అప్పటికే వెనకాల వచ్చిన రైళ్లన్నీ ట్రాక్‌పై నిలిచిపోయాయి. కొన్ని లోకల్ రైళ్లను వీలున్న చోట దారి మళ్లించి ఫాస్ట్ ట్రాక్ మీదుగా నడిపారు. రైళ్లను పునరుద్ధరించడానికి అధికారులు కష్టపడ్డారు. రాత్రి 10 గంటల తర్వాత రైళ్లన్నీ షెడ్యూల్ ప్రకారం నడిచాయి.