breaking news
Mother with two children suicide
-
మహిళ, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్య.. మూడు రోజులుగా..
సాక్షి, బెంగళూరు(బనశంకరి): బెళగావిలో ఒక వ్యాపార కుటుంబానికి చెందిన మహిళ, ఇద్దరు పిల్లలతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోగా, భర్త, అత్తమామలను అరెస్టు చేసేంతవరకు అంత్యక్రియలు చేయబోమని మహిళ కుటుంబీకులు భీష్మించుకున్నారు. ఆదివారం బెళగావి బిమ్స్ ఆసుపత్రి మార్చురీ వద్ద మృతురాలు క్రిషా కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. ఆమె భర్త మనీశ్, అతని కుటుంబమే ఆమెను హత్యచేశారని ఆరోపించారు. వారందరినీ అరెస్ట్ చేసే వరకు మృతదేహాలను తీసుకునేదిలేదంటూ ధర్నా నిర్వహించారు. దీంతో మూడురోజుల నుంచి బిమ్స్ ఆసుపత్రి మార్చురీలోనే తల్లీపిల్లల మృతదేహాలు ఉన్నాయి. ఈ నెల 11 తేదీన బెళగావి హిండలగా గణపతి ఆలయం చెరువులో క్రిషా కేశ్వానీ (36), పిల్లలు వీరేన్ (07), బావీర్ (04) మృతదేహాలు తేలాయి. ఇది తెలిసిన వెంటనే భర్త మనీష్, కుటుంబసభ్యులు పరారయ్యారు. కాగా, ఆదివారం మనీష్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ క్రిషాకు వేరొకరితో సంబంధం ఉందని, అదే ఆత్మహత్యలకు కారణమని అన్నారు. చదవండి: (పిన్నితో వివాహేతర సంబంధం.. బాబాయ్‌కి తెలిసి..) -
ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్య
జంగారెడ్డిగూడెం : పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం....సల్లవారిగూడెంలో దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. కుటుంబ కలహాల కారణంగానే గృహిణి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా వరంగల్ జిల్లాలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రఘునాధపల్లి మండలం ఖిలాశాపురంలో కుటుంబ కలహాల కారణంగా రమాదేవి అనే మహిళ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు.