breaking news
moosi nala
-
తీవ్ర విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా చెరువులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ విషాదకర ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్లో నాలాలో పడిపోయి ఓ మహిళ గల్లంతయ్యింది. వివరాల ప్రకారం.. వర్షాల నేపథ్యంలో గాంధీనగర్ నాలాలో పడిపోయి మహిళ గల్లంతయ్యింది. సదరు మహిళను లక్ష్మిగా గుర్తించారు. దీంతో, రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన మహిళ కోసం గాలిస్తున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి మూసీ నదిలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ గాలింపు చర్యల్లో 100 మంది డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొని మూసీని జల్లెడ పడుతున్నారు. పది కిలోమీటర్ల మేర డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కూతురు మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం రెండు గంటల నుంచి మా అమ్మ కనిపించడం లేదు. వర్షం కారణంగానే నాలా ఉప్పొంగి ప్రవహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందన్నారు. నాలాను ఆనుకుని మేము గోడ కట్టుకుంటామని చెప్పినా అధికారులు అంగీకరించలేదన్నారు. తాము ఒక గోడ నిర్మించిన తర్వాతే.. మేము గోడ కట్టుకోవాలని సూచించినట్టు తెలిపారు. ఎన్నో రోజులుగా గోడ నిర్మిస్తామని చెప్పినా ఇప్పటి వరకు అది జరగలేదన్నారు. ఇది కూడా చదవండి: అనుమానాస్పద స్థితిలో ముంబై ఎయిర్ హోస్టెస్ మృతి -
పాతబస్తీలో మొసలి పిల్ల కలకలం
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో మొసలి పిల్ల కలకలం రేపింది. ఆజంపురాలోని మూసీ నాలా నుండి ఓ మొసలి ఒడ్డుకు చేరింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా మొసలిని బంధించి చాదర్ఘాట్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంబంధిత అధికారులకు విషయాన్ని తెలియజేశారు. జూ అధికారులు, సిబ్బందితో అక్కడికి చేరుకుని మొసలి పిల్లను జంతు పరిరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.