ఆకిబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఇంటర్ స్కూల్ క్రికెట్ లీగ్‌లో భవన్స్ హైస్కూల్ ఆటగాడు మొహమ్మద్ ఆకిబ్ (137, 3/18) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. మొదట బ్యాటింగ్‌లో సెంచరీతో చెలరేగిన ఆకిబ్, తర్వాత బౌలింగ్‌లోనూ విజృంభించాడు. దీంతో మోజెస్ హైస్కూల్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భవన్స్ హైస్కూల్ జట్టు 173 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భవన్స్ హైస్కూల్ 45 ఓవర్లలో 8 వికెట్లకు 283 పరుగులు సాధించింది.
ఆకిబ్ (128 బంతుల్లో 137; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. కార్తికేయన్ (34) రాణించాడు. అనంతరం 284 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన మోజెస్ హైస్కూల్ 45 ఓవర్లలో 9 వికెట్లకు 110 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఎం. కౌశిక్ (23 నాటౌట్) మినహా ఏ ఒక్కరూ రాణించలేకపోయారు. భవన్స్ బౌలర్లలో అకీబ్ 3, అమన్ మిశ్రా, అనంత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఇతర మ్యాచ్‌ల వివరాలు
చిరెక్ పబ్లిక్ స్కూల్: 125 (కార్తీక్ గుప్తా 44, సమర్థ్ 48; ఎస్. నిఖిల్ 5/24, కె. సాహిల్ 3/19), కాల్ పబ్లిక్ స్కూల్: 126 (సాత్విక్ 38 నాటౌట్, గౌరంగ్ 77 నాటౌట్).
బాయ్స్టౌన్: 118 (మొహమ్మద్ జైబ్ 42; శశి కుమార్ 3/29, ఎస్. ఈశ్వర్ 3/7), సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్: 90 (మొహమ్మద్ జైబ్ 3/10, మొహమ్మద్ ఫరీస్ షరీఫ్ 2/19, అజయ్ 2/20).
వెస్లీ జూనియర్ కాలేజ్: 125 (హరిసింగ్ 44; ఫైజాన్ 5/30), సీడీఆర్ జూనియర్ కాలేజ్: 127/7 (ఆర్య 4/12).
హెచ్‌పీఎస్: 92 (28.3 ఓవర్లలో), భవన్స్ ఎస్ఏ: 93/9 (28.1 ఓవర్లలో).
జాన్సన్ గ్రామర్ స్కూల్: 121 (కుషాల్ దేశాయ్ 4/13), లయోలా జూనియర్ కాలేజ్: 124/2 (అభిషేక్ లింగం 77 నాటౌట్).
సుల్తాన్ ఉలూమ్: 72 (గోవింద్ 5/26), డాన్‌బాస్కో హైస్కూల్: 74/2 (17.4 ఓవర్లలో).
సెయింట్ జోసెఫ్ హైస్కూల్: 94 (సాకేత్ 4/23), నీలకంఠ విద్యాపీఠ్: 97/3 (17.2 ఓవర్లలో).
గౌతమ్ మోడల్ స్కూల్: 165 (అజీజుద్దీన్ 48; అయాన్ 3/20), మెరిడియన్ హైస్కూల్: 71 (హర్ష సంకల్ప్ 3/12).
హైదరాబాద్ వాండరర్స్: 179(ఒబేద్ 43; హర్షిత్ 3/34, శ్రీకాంత్ 3/28), లక్కీ ఎలెవన్: 181(ధీరజ్ 84 నాటౌట్).