breaking news
MLA JOGI Ramesh
-
ఓడిపోతారని తెలిసే టికెట్ ఇచ్చారు: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ విమర్శించారు. టీడీపీలో నామినేషన్ వేసే వారు లేరు, బీఫార్మ్ తీసుకునేవారు లేరని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెఎస్సార్ సీపీ నామినేషన్లు అడ్డుకుంటున్నారని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీని 23 సీట్లకు పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ది రాలేదని విమర్శించారు. చంద్రబాబు నాయకత్వంపై టీడీపీ నేతలకు నమ్మకం పోయిందన్నారు. జగన్ సంక్షేమ పాలన చూసే టీడీపీ ముఖ్య నేతలు తమ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. గతంలో చంద్రబాబు దళితులకు రాజ్యసభ టిక్కెట్లు ఇవ్వలేదని.. ఇప్పుడు ఓడిపోతారని తెలిసే వర్ల రామయ్యకు టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. వర్ల రామయ్యను బలిపశువును చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును టీడీపీ దళిత నేతలు నిలదీయాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లలో అన్ని వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని.. ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. అందుకే వైయస్ జగన్‌ను ప్రజలు గెలిపించారని, మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న ఏకైక సీఎం జగన్ అని.. తొమ్మిది నెలల జగన్ పాలన చూసి నేతలు క్యూ కడుతున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. -
చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: స్పీకర్ గౌరవ మర్యాదలను టీడీపీ నేతలు మంట గలుపుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు స్పీకర్ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బలహీన వర్గాలంటే చంద్రబాబు, లోకేష్‌కు ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. బీసీ వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ వెబ్సైట్ ఈ-పేపర్లో స్పీకర్‌ను కించపరుస్తూ వాడిన భాష సభ్య సమాజం తల దించుకొనేలా ఉందని జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ స్పీకర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెప్పాలని..చెప్పకపోతే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ వ్యవస్థను కించపరిచిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. స్పీకర్‌పై ఎందుకు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ సమాధానం చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. సభాపతి తమ్మినేని సీతారాం అసెంబ్లీని హుందాగా నడుపుతున్నారని జోగి రమేష్ తెలిపారు. -
రైతుల అభ్యున్నతికి పాటు పడాలి: జోగి రమేశ్
సాక్షి, గూడూరు: రైతుల అభ్యున్నతికి సహకార సంఘాలు పని చేయాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణా జిల్లా గూడూరు పీఏసీఎస్ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.. రైతును రాజును చేస్తే, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతును రారాజును చేయడానికి రైతు భరోసా పథకం ప్రవేశపెట్టారని తెలిపారు. రైతులకు ఎరువులు పూర్తిస్థాయిలో అందించాలని అధికారులకు సుచించారు. రుణాలు సకాలంలో చెల్లించి వడ్డీ మాఫీ రుణాలు రైతులకు అందెలా చూడాలని కోరారు. పంటల బీమా సౌకర్యం ప్రతి రైతుకు అందేలా సహకార బ్యాంకులు పని చేయాలని కోరారు. -
దీక్షా సమరం
సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావం వెల్లువెత్తుతోంది. ఆయనకు బాసటగా ఆమరణ దీక్ష చేస్తున్నవారి సంఖ్య 31కి చేరగా, ఆరోగ్యం క్షీణించడంతో ఇద్దరి దీక్షలు భగ్నం చేశారు. బుధవారం రాత్రికి ఆమరణ దీక్షలో ఉన్నవారి సంఖ్య 29గా ఉంది. పెడన మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, మైలవరం యువజన నేత జ్యేష్ఠ శ్రీనాథ్ చేపట్టిన దీక్షలు నాలుగో రోజుకు చేరుకోగా, పెడన సమన్వయకర్త ఉప్పాల రాము, నందిగామకు చెందిన గంజి సుందరరావు, విజయవాడ మాజీ కార్పొరేటర్ జవ్వాది రుద్రయ్యల దీక్ష మూడో రోజుకు చేరింది. తిరువూరులో మల్లేల సర్పంచి కలికొండ రవికుమార్‌తోపాటు మరో నలుగురు, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి, గుడివాడ టౌన్ కన్వీనర్ మరీదు కృష్ణమూర్తి, నూజివీడులో లాకా వెంగళరావు యాదవ్, పెనుగంచిప్రోలులో ఊట్ల నాగేశ్వరరావు చేపట్టిన దీక్షలు రెండో రోజుకు చేరాయి. దీక్షలో ‘వాకా’ పెడన నియోజకవర్గ సమన్వయకర్త వాకా వాసుదేవరావుతోపాటు మరొకరు ఆమరణ దీక్ష ప్రారంభించగా, నందిగామలో పదిమంది, విజయవాడ తూర్పులో నలుగురు, పెనుగంచిప్రోలులో వేల్పుల పద్మకుమారి ఆమరణ దీక్షకు దిగారు. వీరిలో పలువురి ఆరోగ్యం క్షీణిస్తోంది. బీపీ, సుగర్ లెవల్స్ పడిపోవడంతో బెజవాడలో మాజీ కార్పొరేటర్ జవ్వాది రుద్రయ్య దీక్షను పోలీసులు భగ్నం చేశారు. గంజి సుందరరావు ఆరోగ్యం క్షీణించడంతో స్థానికులు నచ్చచెప్పి దీక్ష విరమింపచేశారు. పెడన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వాకా వాసుదేవరావు పార్టీ కార్యాలయంలో బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనతో పాటు రాష్ట్ర బీసీ సంఘం మాజీ కార్యదర్శి, వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అడ్హాక్ కమిటీ సభ్యుడు గూడవల్లి వెంకట కేదారేశ్వరరావు కూడా ఆమరణ నిరాహార దీక్ష లో కూర్చున్నారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఆమరణ నిరాహారదీక్షలో పార్టీ నాయకులు వై.కాశిరెడ్డి, తంగిరాల రామిరెడ్డి, జి.జయరాజు, ఉప్పులేటి అనిత పాల్గొన్నారు. దీక్షలను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ప్రారంభించారు. నందిగామ గాంధీ సెంటర్లో 10 మంది నాయకులు, అభిమానులు ఆమరణ దీక్షలు చేపట్టారు. కుక్కల సత్యనారాయణప్రసాద్, నెలకుర్తి సత్యనారాయణ, నాదెండ్ల రాజన్, వినుకొండ రామారావు, మార్కపూడి ప్రసాదరావు, షేక్ ఇస్మాయిల్, షేక్ ఖాజాపీరా, విశ్వనాథపల్లి కృపారావు, మొండితోక నారాయణరావు, వంకాయలపాటి సుధాకర్‌లు ఆమరణ దీక్షలో కూర్చున్నారు. వీరి దీక్షలను నందిగామ నియోజకవర్గ సమన్వయకర్త మొండితోక జగన్మోహనరావు ప్రారంభించారు. పెడనలో నిరాహార దీక్ష చేస్తున్న ఆ పార్టీ సమన్వయకర్త ఉప్పాల రమేష్ (రాము)కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. రాముకు పెడన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కటకం ప్రసాద్ కూడా మద్దతు తెలిపారు. విజయవాడలో పార్టీ నగర కన్వీనర్ జలీల్‌ఖాన్ వన్‌టౌన్ మెయిన్ పోస్టాఫీసుకు తాళాలు వేసి నిరసన తెలుపగా, సెంట్రల్ సమన్వయకర్త పి.గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీనగర్ పోస్టాఫీసుకు తాళాలు వేసి నిరసన తెలిపారు. లెనిన్ సెంటర్లో గౌతమ్‌రెడ్డి నేతృత్వంలో రిలేదీక్షలు జరిగాయి. వైఎస్సార్ సీపీ మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జ్యేష్ఠ రమేష్‌బాబు ఆధ్వర్యంలో రహదారులు దిగ్బంధించారు. వందలాది వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. మండవల్లి మండలం కొర్లపాడు గ్రామానికి చెందిన 30 మంది రిలే దీక్షల్లో కూర్చున్నారు. మైలవరం మండలం పుల్లూరు గ్రామం నుండి జగన్ అండ్ అప్పిడి యూత్ అధ్వర్యంలో జగన్ దీక్షకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించి మైలవరంలోని డాక్టర్ హనిమిరెడ్డి ప్రభుత్వ హైస్కూల్ వద్ద వంతెనపై బైఠాయించి నిరసన తెలిపారు. నూజివీడులో జగన్ దీక్షకు మద్దతుగా నిర్వహిస్తున్న రిలేదీక్షలు రెండో రోజుకు చేరాయి. ఈ దీక్షలలో భాగంగా నూజివీడులో 16మంది, చాట్రాయిలో 21మంది పాల్గొన్నారు. నూజివీడులో రెండోరోజు దీక్షలను పార్టీ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్‌అప్పారావు ప్రారంభించారు. మొవ్వ మండలంలో మూడో రోజు రిలే దీక్షలు కొనసాగాయి. చాట్రాయి రామాలయ ఆవరణలో వైఎస్సార్ సీపీకి చెందిన 25 మంది కార్యకర్తలు రిలే నిరాహారదీక్షలు చేశారు. విస్సన్నపేటకు చెందిన నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. ఇబ్రహీంపట్నం ఫెర్రిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు జలదీక్ష నిర్వహించారు. పార్టీ కొండపల్లి గ్రామ కన్వీనర్ ఎంఏ బేగ్ ఆధ్వర్యంలో యువకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. రెడ్డిగూడెం నుంచి మైలవరం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.