breaking news
Mistreating women
-
పీట్ హెగ్సెత్కు మహిళలంటే గౌరవం లేదు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకొనే పనిలో నిమగ్నమయ్యారు. కీలక శాఖలకు మంత్రులుగా ఇప్పటికే పలువురి పేర్లు ప్రకటించారు. అధ్యక్షుడిగా ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వీరంతా మంత్రులుగా మారబోతున్నారు. కానీ, ట్రంప్ ఎంపికల పట్ల విమర్శలు వస్తున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని, లైంగిక వేధింపుల కేసుల్లో ఇరుక్కున్నవారిని ట్రంప్ మంత్రులుగా ఎంపిక చేశారంటూ అసంతృప్త స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నా యి. ఆయన వినిపించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అమెరికా రక్షణ శాఖ మంత్రిగా ఎంపికైన పెటీ హెగ్సెత్(44)పై ఆయన సొంత తల్లి పెనెలోప్ హెగ్సెత్ ఆరోపణలు చేయడం సంచలనాత్మకంగా మారింది. తన కుమారుడికి మహిళలంటే ఏమాత్రం గౌరవం లేదని, చులకనగా చూస్తాడని ఆమె తప్పుపట్టారు. చాలాఏళ్లు మహిళలతో అతడు అభ్యంతకరంగా ప్రవర్తించాడని ఆక్షేపించారు. తన బిడ్డ ప్రవర్తన సరైంది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు 2018లో తన కుమారుడికి పెనెలోప్ పంపించిన ఈ–మెయిల్‌ను న్యూయార్క్ టైమ్స్ పత్రిక బహిర్గతం చేసింది. ‘‘నువ్వు(పీట్ హెత్సెత్) మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. వారిని చాలా చులకనగా చూడడం నీకు అలవాటు. ఆడవాళ్ల గురించి నోటికొచ్చినట్లు అబద్ధాలు చెప్తుంటావు. తప్పుడు ప్రచారం చేయడం నీకు ఇష్టం. అందుకే నిన్ను నేను ఎప్పటికీ గౌరవించలేను. ఒక తల్లిగా నీ ప్రవర్తన పట్ల మౌనంగా ఉండాలని ప్రయత్నించా. కానీ, నీ భార్యను ఘోరంగా వేధించావు. ఆమె చాలా మంచి అమ్మాయి. ఆమె అనుభవించిన బాధ ను తెలుసుకొని సహించలేకపోయాను. నీ ప్ర వర్తన పట్ల మేమంతా విసుగెత్తిపోయాం’’అని ఈ–మెయిల్లో పెనెలోప్ తన ఆవేదన వ్యక్తం చేశారు. హెగ్సెత్ రక్షణ శాఖ మంత్రిగా ఎంపిక కావడంతో ప్రస్తుతం ఈ అంశం అమెరికాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పెనెలోప్ స్పందించారు. కోపం, ఆవేశంతో అప్పట్లో తన కుమారుడిపై ఆగ్ర హం వ్యక్తం చేస్తూ ఈ–మెయిల్ పంపించానని, ఆ తర్వాత అతడికి క్షమాపణ చెప్పానని వెల్లడించారు. ఇదిలా ఉండగా, పీట్ హెగ్సెత్కు వివాహేతర సంభంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సంబంధంతో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చినట్లు సమాచారం. -
మగాళ్లూ.. రాక్షసులు కాకండి: సన్నీ లియోన్
మహిళలపై అకృత్యాలు హెచ్చుమీరుతుండటంపై బాలీవుడ్ నటి సన్నీలియోన్ తనదైన శైలిలో స్సందిచారు. ఆడవాళ్లను నీచంగా చూస్తూ, వేధింపులకు పాల్పడే మగవాళ్లు రాక్షసులుగా మారతారని వ్యాఖ్యానించారు. మహిళల రక్షణపై ఎంటీవీ రూపొందిస్తున్న 'ముక్తి' అనే కామియో టీవీ షోలో నటిస్తోన్న ఆమె.. శుక్రవారం మీడియాతో పలు అంశాలపై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. 'స్త్రీని చిన్నచూపు చూసే భారత్ లాంటి సమాజంలో ఇదివరకెప్పుడూ జీవించలేదు! నేను పుట్టి పెరిగిందంతా విదేశాల్లోనే! ఇక్కడి మగవాళ్లందరికీ నాదొక విన్నపం.. మీరు సిటీలో ఉండొచ్చు లేదా గ్రామాల్లో ఉండొచ్చు కానీ మగువల స్వేఛ్చను హరించాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఆ భావనే మిమ్మల్ని రాక్షసుడిగా మార్చేస్తుంది' అని హితవుపలికారు. తానేంటో నిరూపించాలనుకునే ప్రతి మహిళకు తనకు తానే ఆధారంగా ఉండాలని సన్నీ అన్నారు. ఆడవాళ్లతో ఎలా మెలాగాలన్నది తల్లిదండ్రుల పెంపకం నుంచే మొదలవుతుదని, మెరుగైన విద్యావిధానంతో మంచి ఫలితాలుంటాయన్న ఆమె.. తన సూచనల్ని ఆచరిస్తే యువతలో మార్పు తథ్యం అంటున్నారు.