breaking news
misbehaved with fan
-
వీడియో : ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించిన ధావన్
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అభిమానులతో దురుసుగా ప్రవర్తించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడిపోగా.. అసహనానికి గురైన ధావన్ వారిని తోసేశాడు. శ్రీలంకతో మూడో టెస్ట్ కోసం ధావన్ తిరిగి ఎంపికయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ధావన్ హాజరయ్యాడు. ఆ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అతని ముందున్న వ్యక్తిని శిఖర్ ధావన్ తోసేశాడు. ఈ దృశ్యం మీడియాకు చిక్కింది. ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితిలోనే అలా చేశాడని పలువురు చెబుతున్నప్పటికీ.. ధావన్ తీరుపై మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించే ధావన్ ఇలా ఆగ్రహంతో కనిపించటం అభిమానులకు సైతం మింగుడుపడటం లేదు. శనివారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. -
ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించిన ధావన్
-
ఆ వార్తలపై ఫైర్ అయిన హృతిక్
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మరోసారి తనపై వస్తున్న రూమర్స్ పై ఫైర్ అయ్యాడు. కొద్ది రోజులు హృతిక్ తన ఫ్యాన్ పట్ల దురుసుగా ప్రవర్తించాడన్న వార్త మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. హృతిక్ జిమ్ లో ఉండగా ఓ లేడీ ఫ్యాన్ తన మొబైల్ లో ఫోటోలు తీసిందట. అయితే ఆ ఫోటోలు డిలీట్ చేయాలని హృతిక్ కోరినా ఆమె అందుకు అంగీకరించకపోవటంతో హృతిక్ తన ఫోన్ తీసుకొని మొత్తం డాటా ఫార్మట్ చేశాడని పలు మీడియాలో వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ ట్రెండ్ అయ్యింది. అయితే ఈ వార్తలను ప్రచురించిన ఓ పత్రికపై హృతిక్ రోషన్ సెటైర్ వేశాడు. మీ ఫాంటసీ రచనలు బాగున్నాయి. మీరు ఆ ఊహాలోకం నుంచి తిరిగొచ్చాక కలుద్దాం అంటూ ట్వీట్ చేశాడు. గతంలోనూ రోగ్ సినిమాలో నటించిన ఏంజెలా క్రిస్ లిన్ స్కీ, హృతిక్ తనకు మెంటర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా హృతిక్ ఘాటుగా స్పందించాడు. ఇటీవల రిలీజ్ అయిన కాబిల్ సినిమాతో మంచి విజయం సాధించిన హృతిక్ రోషన్, త్వరలో క్రిష్ 4ను స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. Hey Deccan, U are really great at writing chronicles of fantasia. Let's meet up whenever u are back from la la land. Cheers pic.twitter.com/0ECNrQ1LOW — Hrithik Roshan (@iHrithik) 5 June 2017