breaking news
mind reading device
-
మైండ్ రీడింగ్, ఎయిర్ టాక్సీ కంపెనీల్లో పెట్టుబడి
భారతీయ స్టార్టప్ విభాగంలో జొమాటో సహ-వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ వ్యాపార ప్రయాణం ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశంలో ఆహార డెలివరీ రంగాన్ని శాసించిన ఆయన ఇటీవల జొమాటో సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకుని భవిష్యత్తును మార్చగల అత్యాధునిక సాంకేతిక (డీప్ టెక్) రంగాలపై దృష్టి పెట్టారు. ప్రధానంగా హెల్త్-టెక్ (ఆరోగ్య సాంకేతికత), ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ (వైమానిక, రక్షణ) రంగాలలో ఆయన చేస్తున్న భారీ పెట్టుబడులు ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.మెదడు పనితీరును అంచనా వేసే ‘టెంపుల్’హెల్త్-టెక్ రంగంలో దీపిందర్ గోయల్ ‘టెంపుల్’ అనే వేరబుల్ టెక్నాలజీ (ధరించగలిగే పరికరం) స్టార్టప్‌ను ప్రారంభించారు. కేవలం ఆలోచనల స్థాయిలోనే ఈ స్టార్టప్ ‘ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ’ ఫండింగ్ రౌండ్ ద్వారా సుమారు 54 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.450 కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. దీనితో ఈ కంపెనీ మార్కెట్ విలువ 190 మిలియన్ డాలర్లకు చేరింది.సాధారణ స్మార్ట్‌వాచ్‌లు లేదా ఫిట్నెస్ రింగ్లలా కాకుండా ఈ ‘టెంపుల్’ పరికరాన్ని నుదుటి భాగాన ధరించాల్సి ఉంటుంది. ఇది మెదడులోని రక్త ప్రసరణను నిరంతరం పర్యవేక్షిస్తూ ‘ఎంట్రోపీ’ అనే సరికొత్త బయోమార్కర్ ఆధారంగా మానసిక ఒత్తిడి, ఏకాగ్రత, నిద్ర, అలసట వంటి మెటబాలిక్ మార్పులను రియల్ టైమ్‌లో లెక్కిస్తుంది. అథ్లెట్లు, వ్యాపార దిగ్గజాలు, హై-పర్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని దాదాపు 1,000 డాలర్ల ధరతో దీనిని మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనితో పాటు మానవ ఆయుష్షును పెంచే పరిశోధనలు చేసే ‘కంటిన్యూ రీసెర్చ్’ సంస్థలోనూ ఆయన గతంలోనే 25 మిలియన్ డాలర్ల సొంత పెట్టుబడి పెట్టడం విశేషం.ఆకాశ మార్గంలో ‘లాట్ ఏరోస్పేస్’భారతీయ విమానయాన రంగాన్ని కూడా గోయల్ విప్లవాత్మకంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. జొమాటో మాజీ సీఓఓ సురభి దాస్‌తో కలిసి ఆయన ‘లాట్ ఏరోస్పేస్’ అనే సంస్థను స్థాపించి అందులో 20 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టారు. సాధారణ ఎయిర్ టాక్సీలలా కాకుండా చిన్న నగరాలను అనుసంధానించేందుకు కేవలం 24 మంది ప్రయాణించగల తక్కువ రన్‌వేతో ల్యాండింగ్, టేకాఫ్ కాగల ‘స్టొల్’ (Short Takeoff and Landing) విమానాలను ఈ సంస్థ తయారు చేస్తోంది.ఈ ప్రస్థానంలో భాగంగా ‘లాట్ ఏరోస్పేస్’ ఇటీవల గురుగ్రామ్‌కు చెందిన రక్షణ రంగ రోబోటిక్స్ స్టార్టప్ ‘షరంగ్ శక్తి’ని కొనుగోలు చేసింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం, అలాగే తదుపరి తరం పౌర విమానయాన సాంకేతికతను భారత్‌లోనే అభివృద్ధి చేయడం ఈ కొనుగోలు ముఖ్య ఉద్దేశమని గోయల్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: కోట్లు ఉన్నా కొరత భావనేనా? -
థాట్ రీడింగ్ మెషీన్ గురించి విన్నారా? ఇది నిజమేనా?
డాక్టర్ గారూ... మా ఊర్లో ఇటీవల థాట్ రీడింగ్ మెషీన్స్ వచ్చాయి. కొందరు వాటిని నా మీద ప్రయోగించి, నా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలుసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దీనివల్ల బతికుండగానే నరకం అనుభవిస్తున్నాను. ఒకసారి ఆత్యహత్యా ప్రయత్నం కూడా చేశాను. నేను ఈ బాధలు తట్టుకోలేక డైరెక్టుగా వారిని కలిసి అడిగితే, మాకేం తెలియదని బుకాయిస్తున్నారు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను. వారు దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏం చేయాలో మీరైనా సలహా ఇవ్వగలరు – రఘురామ్, గుంతకల్లుమీ మానసిక వేదన అర్థమైంది. ప్రపంచంలో ఇంతవరకు మీరు చెప్పిన లాంటి థాట్ రీడింగ్ మెషీన్ ఎక్కడా రాలేదు. అది జరగని విషయమే. కేవలం ఒక మెషిన్ ద్వారా ఒకరి ఆలోచనలను ఇంకొకరు తెలుసుకోగలిగితే, ప్రపంచంలో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యేవి. అదేవిధంగా మరికొన్ని కొత్త సమస్యలు కూడా పుట్టుకొచ్చి ఉండేవి. నిజంగా మీరు చెప్పిన మెషీన్లు గనక వస్తే, మనుషుల మధ్య స్పర్ధలు, అ΄ోహలు, గొడవలే కాకుండా సమాజంలో కూడా అశాంతి, అలజడి చెలరేగే ప్రమాదం ఉంది. అలాంటి మెషీన్స్ కేవలం రచయితల కల్పనలే. అవి సినిమాలకు, నవలలకు మాత్రమే పరిమితం. కానీ వాస్తవం కానే కాదు. పారనాయిడ్ సైకోసిస్ అనే మానసిక వ్యాధికి గురైన వ్యక్తులు, ఒక్కోసారి ఇలాంటి భ్రమలు– భ్రాంతులకు లోనయ్యే అవకాశముంది. లేనివి ఉన్నట్లుగా భావించి, నిజమని నమ్మి, తాము మనోవేదనకు గురి కావడమే కాకుండా ఇతరులను కూడా ఇబ్బంది పెడతారు. (‘అమ్మ’కు సుస్తీ చేస్తే? అమ్మ పనులు చేయడం వచ్చా? )ఎంత తార్కికంగా వీరికి నచ్చజెప్పచూసినా, వీరు ఆ మూఢ నమ్మకాలనుంచి బయట పడలేరు. ఇలాంటి భావనలను హెల్యూజన్స్ ఆఫ్ పర్‌సెక్యూషన్ అని అంటారు. ఎవరో వైర్లెస్ ద్వారా, కంప్యూటర్స్ ద్వారా తమ మైండ్‌ను కంట్రోల్ చేస్తున్నారనే కొందరి భావనలు కూడా ఈ కోవకు చెందినవే! మెదడులోని డోపమైన్ అనే ఒక ప్రత్యేక రసాయనిక పదార్థంలోని సమతుల్యతలో తేడాలొచ్చినప్పుడు కొందరికి ఇలాంటి భ్రమలు– భ్రాంతులు కలుగుతాయి. మీకు నేనిలా సలహా చెబుతున్నానని అన్యధా భావించక వెంటనే మీకు దగ్గరలోని సైకియాట్రిస్టును సంప్రదించి, మీకున్న ఈ ఇబ్బందికి తగిన చికిత్స తీసుకుంటే మీకొచ్చిన ఇలాంటి భ్రమలు, ఆలోచనలు పటాపంచలై మీరు వీటిలోనుంచి పూర్తిగా బయట పడి, మనశ్శాంతిగా ఉండగలరు. ఆల్ ది బెస్ట్! -
సంచలనాలకు సిద్ధమైన ఫేస్బుక్!
వాషింగ్టన్: సామాజిక మాధ్యమం ఫేస్బుక్ మరో సంచలనానికి తెరలేపనుంది. త్వరలోనే నాలుగు కొత్త ఉత్పత్తులను వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇందులో ముఖ్యంగా ఓ ప్రొడక్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎందుకంటే.. వ్యక్తి ఆలోచనను పసిగట్టే పరికరాన్ని(మైండ్ రీడింగ్ డివైజ్) మార్కెట్లోకి తెస్తామని ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇటీవల ప్రకటించారు. వచ్చే నెలలోనే ఈ సస్పెన్స్‌కు తెర పడనుంది. ఫేస్బుక్ సంస్థ గతేడాది 'బిల్డింగ్ 8' అనే పేరుతో ఓ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే మనిషి మెదడు ఏం ఆలోచిస్తుంది, ఆ ఆలోచనలను, వాటి భావాలను పసిగట్టగలిగే 'మైండ్ రీడింగ్' డివైజ్ రూపకల్పనలో ఇంజినీర్లు బిజీగా ఉన్నారు. ఆలోచనను పసిగట్టిన డివైజ్ ఆ వివరాలను ఫోన్ ద్వారా ఇతరులకు చెప్పేస్తుంది. మిలియన్ల కొద్ది డివైస్‌లను ప్రపంచ వ్యాప్తంగా విక్రయించాలని కొన్ని కంపెనీలు ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నాయి.


