breaking news
Milch cattle
-
జాతి కొద్ది పాలు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పాలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. దానికి అనుగుణంగా పాడిపరిశ్రమ పెట్టుకునే వారికి ప్రభుత్వం ప్రోత్సహాన్ని ఇస్తుంది. అయితే డెయిరీ పెట్టే రైతులు ఎలాంటి పశువులు కొనాలి.. ఏం చూడాలి..ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో డ్వామా సహాయ సంచాలకులు మధుసూదనరావు వివరిస్తున్నారు. కృత్రిమ పాల దిగుబడితో ఎందరో అనారోగ్యానికి గురవుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన పాల విక్రయం ద్వారా మంచి లాభాలు అర్జించవచ్చు. ఇందుకోసం ఆరోగ్యవంతమైన పశువులను ఎంచుకోవాలి. ‘పిండి కొద్ది రొట్టే.. జాతి కొద్ది పాలు’ అన్నారు. మేలుజాతి పశువులతోనే మంచి పాల దిగుబడి వస్తుంది. తద్వారా పాడి పరిశ్రమ లాభసాటిగా సాగుతుంది. కొనే ముందు జాగ్రత్తలివి.. పశువును కొనుగోలు చేసే ముం దు శరీర లక్షణాలు, వాటి పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టి పాడిపశువుల ఎంపిక చేసుకోవాలి వీలైనంత వరకూ ఏ ప్రాంతంలో డెయిరీఫాం పెట్టాలనుకుంటున్నారో, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న డెయిరీఫారంలో అమ్మకానికి ఉంటే అట్టి పాడి పశువులను కొనడం మంచిది. ఎందుకనగా, ఇతర రాష్ట్రాలు హర్యానా, పంజాబ్, కేరళ నుంచి తెచ్చిన పాడిపశువులు మంచివే. కానీ ఆ పశువులు అక్కడి మేతకు అలవాటు పడి ఉంటాయి. వాటికి అనుగుణంగా దాణా, నిర్వహణ లేకుంటే దూడలు చనిపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోతాయి. కొన్ని రోజుల వరకు అక్కడ అలవాటు పడిన మేతతోపాటు మనకు అందుబాటులో ఉన్న దాణా కూడా అందించాలి. ఇవి గమనించాలి దూర ప్రాంతాల పశువలను కొనే ముందు వాటి, జాతి రికార్డులు చూడడం మంచిది పాడిపశువులు నిండుగా చురుకగా ఉండాలి {తికోణాకారంలో ఉండి, చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి మెడ పొట్టిగా, డొక్కులు నిండుగా పొదుగు విస్తరించి ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లు. నాలుగు చనుకట్లు సమానంగా ఉండాలి, కాళ్లు , కాలిగిట్టలు ధ్రుడంగా కనిపించాలి. బెదరకుండా ఎవరు పాలు పితికినా ఇచ్చేలా ఉండాలి నవంబర్, డిసెంబర్ నెలల్లో పాడిపశువులు కొనుగోలు చేసేందుకు అనువైన సమయం. కొనుగోలు చేసే ముందు ఎన్నో ఈతనో గమనించి 4 ఈతల లోపు పశువులే కొనాలి. పాడిపశువు కొనాలనుకుంటే రెండు మూడురోజులు దగ్గర ఉండి పాల ఉ త్పత్తిని రెండుపూటల గమనించాలి. ముందు నుంచే గడ్డి పెంచుకోవాలి డెయిరీ ఫాం పెట్టే ముం దు 3 నెలల ముందు నుంచే పశుగ్రాసం పెంపకం చేపట్టాలి. తృణజాతి, గడ్డిజాతి గ్రాసాలు సిద్ధం చేసుకొన్న తర్వాతే పశువులు తెచ్చుకోవాలి. సంకరజాతి ఆవు రోజు కు 8 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తుంది. ముర్ర జాతి గేదె అయితే 8 నుం చి 10 లీటర్ల పాలిస్తాయి. ఈనిన గేదె, ఆవు దూడ తో కొనడం మంచిది. పశువు కొనేందుకు వెళ్లినప్పుడు ఆ పాడిపశువు నిర్వహణ ఎలా ఉంది అనేది గమనించాలి. అదే పద్ధతి కొనసాగించడం పాల ఉత్పత్తి నిలకడగా ఉండడానికి దోహద పడుతుంది. వాహనంలో తీసుకువచ్చేటప్పుడు జాగ్రత్తలివి.. దూర ప్రాంతం నుంచి తీసుకువచ్చేటప్పుడు రవాణా సమయంలో వాహనాన్ని ఆపి, పశువులను దించి కొంత దూరం నడిపించాలి నీరు, దాణా పెట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల కాళ్ల మధ్య వాహనంలో వరిగడ్డి మందంగా పరిచి వాహనంలోపలి అంచులకు గడ్డితో నింపిన సంచులను వేలాడదీయాలి. {పయాణంలో రాపిడివల్ల గాయాలు కాకుండా చూడాలి. పశువుల మధ్యలో వెదురుకర్రలు కట్టి తలభాగంపైన ఉండేలా చూడాలి. వేసవిలో అయితే రాత్రి ప్రయాణం చేయ డం మంచిది.రవాణా బీమా చేయించాలి. మంచిపాడి పశువు కొనుగోలు ఎంతముఖ్యమో కొన్న పశువును క్షేమంగా ఇంటికి చేర్చడం కూడా అంతే ముఖ్యం. పాడిపశువుల కొనుగోలు, రవాణాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాడిపశువు, డెయిరీఫాంలో కాసుల కురిపించే కనక మహాలక్ష్మీ కాగలదనడం నిర్వివాదాంశం. -
పశువులు ఈనే సమయంలో జాగ్రత్త అవసరం
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో చాలా మంది రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పోషిస్తున్నారు. పశువులు ఈనే ముందు, ఈనిన తర్వాత జాగ్రత్తల విషయంలో నిర్లక్ష్యంతో కొన్ని సార్లు పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఈ సమయంలో పశుపోషకుడు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధక శాఖ ఒంగోలు ఏడీఏ మురళీకృష్ణ తెలిపారు. ఇందుకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పశువులు ఈనే ముందు.. చూడిపశువు ఎక్కువ నీరు తాగకుండా చూడాలి. మందతో బయటకు పంపకూడదు. ఎత్తు ప్రదేశాలకు వెళ్లకుండా చూసుకోవాలి. పరుగెత్తనీయకూడదు. బెదరగొట్టడం, దున్నపోతులు, ఆంబోతులు పొడవకుండా, దాటకుండా చూడాలి. చూడి పశువులను విడిగా ఉంచాలి. కొన్ని పశువుల్లో ఈనడానికి పది రోజుల ముందు పొదుగు భాగంలో నీరు దిగి వాపు వస్తుంది. ఇది సహజంగా వస్తుంది. దీనిని వ్యాధిగా భావించనవసరం లేదు. పశువు ఈనే సమయంలో.. పశువును, కొష్టాన్ని శుభ్రపరచాలి. ఈనడానికి రెండు గంటల ముందు జొన్నలు, రాగులు, సజ్జలు మొదలైన చిరుధాన్యాలను ఉడికించి పెట్టాలి. పచ్చిగడ్డి కూడా కొద్దిగా వేయాలి. ఈనే ముందు పచ్చిగడ్డి సరిగా తినవు. పారుకుంటూ ఉంటాయి. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈనే సమయం దగ్గర పడినప్పుడు బొడ్డు కింద నీరు చేరుతుంది. ముర్రుపాలు కనపడతాయి. ఆరోగ్యవంతమైన పశువు ఈనే ముందు ఇబ్బందిపడుతూ అరగంట నుంచి ఆరు గంటల్లోనే ఈనుతాయి. ఆరు గంటలు మించితే వైద్యుడి సహాయం తీసుకోవాలి. ఈనే ముందు సాధారణంగా లేగదూడ ముందరికాళ్లు, ముట్టె ముందు బయటకు వస్తాయి. సాధ్యమైనంతవరకు పశువు దానంతట అదే ఈనేందుకు ప్రయత్నించాలి. ఈనిన తర్వాత.. వేడినీళ్లతో శరీరాన్ని శుభ్రం చేయాలి. వరిగడ్డితో బెడ్డింగ్ ఏర్పాటు చేయాలి. నీరసం తగ్గడానికి బెల్లం కలిపిన గోరువెచ్చని తాగునీరు ఇవ్వాలి. పశువులకు కొన్ని రోజుల వరకు కొద్దిగా దాణా అందిస్తూ రెండు వారాల్లో పూర్తిగా దాణా ఇవ్వాలి. ఈనిన రెండు నుంచి ఎనిమిది గంటల్లో మాయ వేస్తాయి. అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే పశువైద్యుడి సహాయం తీసుకోవాలి. మాయని అశాస్త్రీయ పద్ధతిలో లాగితే గర్భకోశం చిట్లి రక్తస్రావం జరుగుతుంది. కొన్ని సార్లు పశువు మరణించే అవకాశం ఉంది. అధిక పాలిచ్చే పశువులకు ఈనిన తర్వాత పాలజ్వరం రాకుండా కాల్షియం ఇంజక్షన్ వేయించాలి. ఈనే వారం రోజుల ముందు, తర్వాత వారం రోజులు పశువుకు విటమిన్-డి ఇవ్వాలి.