breaking news
micheal clark
-
‘నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సృష్టికర్త లలిత్ మోదీపై భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్వార్థ ప్రయోజనాల కోసం మనుషులు ఎంతకైనా దిగజారుతారంటూ ఫైర్ అయ్యాడు. మనుషులు అన్నాక తప్పులు చేయడం సహజమని.. అయితే, అందుకు పశ్చాత్తాపపడిన తర్వాత కూడా పదే పదే అదే ఘటన గుర్తుచేయడం సరికాదన్నాడు.శ్రీశాంత్ చెంపపై కొట్టాడుఇంతకీ ఏం జరిగిందంటే.. ఐపీఎల్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది ‘స్లాప్‌గేట్’. అరంగేట్ర సీజన్లో అంటే.. 2008లో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) పేసర్ శ్రీశాంత్ (Sreesanth) మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో భజ్జీ.. శ్రీశాంత్ చెంపపై కొట్టాడు.క్షమాపణలు చెప్పిన భజ్జీఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ యాజమాన్యం.. భజ్జీ ఆ ఎడిషన్‌లో తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. అయితే, ఈ ఘటనపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన హర్భజన్ ఇప్పటికే శ్రీశాంత్‌కు వివిధ వేదికలపై క్షమాపణలు చెప్పాడు. ప్రస్తుతం వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలూ లేవు.కానీ లలిత్ మోదీ.. నాటి ఘటనకు సంబంధించిన వీడియోను తాజాగా విడుదల చేసి పాత గాయాన్ని మళ్లీ రేపాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో భజ్జీ.. శ్రీశాంత్‌పై చెంప దెబ్బ కొట్టిన వీడియోను లలిత్ మోదీ రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి.. ‘‘మీకసలు మానవత్వం ఉందా?’’ అంటూ తీవ్ర స్థాయిలో లలిత్ మోదీ, క్లార్క్‌లపై ఫైర్ అయ్యారు.నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడుతాజాగా హర్భజన్ సింగ్ కూడా లలిత్ మోదీ చర్యపై స్పందించాడు. ‘‘వీడియోను లీక్ చేసిన విధానం తప్పు. అసలు ఇలా జరిగి ఉండాల్సింది కాదు. దీని వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.పద్దెనిమిదేళ్ల క్రితం జరిగిన ఘటన. దాని గురించి అందరూ ఎప్పుడో మర్చిపోయారు. కానీ వీళ్లు మరోసారి ప్రజలకు దీనిని కావాలనే గుర్తుచేస్తున్నారు’’ అని భజ్జీ ఫైర్ అయ్యాడు. ‘నీ అంత స్వార్థపరుడు మరొకడు ఉండడు’ అన్నట్లుగా లలిత్ మోదీ తీరును తప్పుబట్టాడు.ఇప్పటికే ఎన్నోసార్లు ఒప్పుకొన్నాఅదే విధంగా.. ‘‘నాడు జరిగిన ఘటన నన్నెంతో వేదనకు గురిచేసింది. మ్యాచ్ ఆడే క్రమంలో ఆటగాళ్లు భావోద్వేగాలకు లోనవుతారు. తప్పులు జరగడం సహజం. అందుకు సిగ్గుపడాలి. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. అదో దురదృష్టకర ఘటన. నేను ఆరోజు తప్పుచేశానని ఇప్పటికే ఎన్నోసార్లు ఒప్పుకొన్నాను. ఇంకోసారి తప్పు చేయనని.. ఒకవేళ తప్పు చేస్తే దానిని సరిదిద్దుకునేలా చేయమని ఆ గణేశుడిని ప్రార్థిస్తున్నా’’ అని హర్భజన్ సింగ్ ఉద్వేగానికి లోనయ్యాడు.చదవండి: తొలి మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు.. చరిత్ర సృష్టించిన భారత యువ స్పిన్నర్ -
ఛీ.. ఇదేం పద్ధతి?: టీమిండియా మాజీ క్రికెటర్ భార్య ఆగ్రహం
ఐపీఎల్-2008 (IPL 2008) నాటి వీడియో తాజాగా విడుదల చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సతీమణి భువనేశ్వరి కుమారి (Bhuvaneshwari Kumari) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీకు అసలు మానవత్వం ఉందా?’ అంటూ ఐపీఎల్ తొలి చైర్మన్ లలిత్ మోదీ (Lalit Modi), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌పై మండిపడ్డారు.ఛీ.. ఇదేం పద్ధతి?ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా భువనేశ్వరి కుమారి సుదీర్ఘ పోస్టు పెట్టారు. ‘‘లలిత్ మోదీ, మైకేల్ క్లార్క్.. మీరు చేసిన పనికి సిగ్గు పడండి. 2008లొ జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోను ప్రదర్శిస్తూ వ్యూస్ కోసం చీప్‌గా ప్రవర్తించారు.దీని కారణంగా మీరు కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే టార్గెట్ చేసినట్లు కాదు.. వారి కుటుంబాలు, పిల్లలపై కూడా దీని ప్రభావం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. శ్రీశాంత్, హర్భజన్ సింగ్ ఇద్దరూ ఎప్పుడో ఆ ఘటన గురించి మర్చిపోయారు.వారిప్పుడు కేవలం ఆటగాళ్లు కాదు.. తండ్రులయ్యారు. వారికి స్కూల్‌కు వెళ్లే వయసున్న పిల్లలు ఉన్నారు. కానీ మీరు మాత్రం ఆ పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. ఛీ.. ఇదేం పద్ధతి? మీకసలు హృదయం ఉందా? మానవత్వం అన్నది మచ్చుకైనా మీలో ఉందా?మీరు కాస్తైనా ఊహించగలరా?శ్రీశాంత్ ఎంతగానో శ్రమించి మళ్లీ తన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. చేదు అనుభవాలను అధిగమించి తనను తాను నిరూపించుకున్నాడు. అతడి భార్యగా.. అతడి పిల్లల తల్లిగా.. ఈ పాత వీడియో చూడటం ద్వారా నా మనసు ఎంత బాధపడుతుందో మీరు కాస్తైనా ఊహించగలరా?ఇరు కుటుంబాలను ట్రామాలోకి నెట్టేసిన ఆ ఘటన గురించి మళ్లీ ఇప్పుడెందుకు? మీకు వ్యూస్ మాత్రమే ముఖ్యమా? చిన్నారి పిల్లల మనసులపై గతం తాలుకు మచ్చలు పడేలా చేయాలనుకుంటున్నారా? మీకు కాస్తైనా సిగ్గుందా?.. చేయని తప్పులకు వారు శిక్ష అనుభవించాలా?మానవత్వం లేని పనులుఇలాంటి చెత్త, మానవత్వం లేని పనులు చేసినందుకు మీపై దావా వేయాలి. శ్రీశాంత్ పట్టుదల, మానసిక దృఢత్వం ఉన్న వ్యక్తి. ఇలాంటి చెత్త వీడియోలు అతడి హుందాతనాన్ని ఏమాత్రం తగ్గించలేవు. మీ స్వార్థం కోసం ఇతరుల కుటుంబాలను, వారి పిల్లల మనసులను బాధపెట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అంటూ భువనేశ్వరి కుమారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అసలేం జరిగిందంటే..2008లో ఐపీఎల్ మొదలైన విషయం తెలిసిందే. అరంగేట్ర సీజన్లో భారత క్రికెటర్లు హర్భజన్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు.. శ్రీశాంత్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ఆడారు. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్లు ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో శ్రీశాంత్‌ను భజ్జీ చెంపదెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో తదుపరి మ్యాచ్‌లు ఆడకుండా భజ్జీపై నిషేధం పడింది.పెద్ద తప్పు చేశాఈ ఘటన గురించి ఇటీవల హర్భజన్ సింగ్ మాట్లాడుతూ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. తాను పెద్ద తప్పు చేశానని.. ఇప్పటికే 200 సార్లు శ్రీశాంత్‌కు క్షమాపణ చెప్పి ఉంటానని పేర్కొన్నాడు. అయితే, శ్రీశాంత్ కుమార్తెతో మాట్లాడుతున్న సమయంలో.. ఆమె తనను తన తండ్రిని కొట్టిన వ్యక్తిగా గుర్తించడాన్ని తట్టుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. చిన్నారి మనసులో తనపై ఇలాంటి ముద్ర పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. ఆరోజు అలా చేయకుండా ఉండాల్సింది అని మరోసారి తన తప్పును ఒప్పుకొన్నాడు.వీడియో చూపించిన లలిత్ మోదీఅయితే, ఇటీవల క్లార్క్ ఇంటర్వ్యూకు హాజరైన లలిత్ మోదీ.. భజ్జీ శ్రీశాంత్‌ను చెంపదెబ్బ కొట్టిన వీడియోను లైవ్‌లో చూపించాడు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో కేరళ మాజీ పేసర్ శ్రీశాంత్ భార్య భువనేశ్వరి కుమారి పైవిధంగా ఘాటుగా స్పందించారు.చదవండి: ‘టీమిండియా బెస్ట్ కెప్టెన్ అతడే.. సాధారణ జట్టుతో అద్భుత విజయాలు’ View this post on Instagram A post shared by Beyond23 Cricket Podcast (@beyond23cricketpod) -
ఒకడే ఒక్కడు మొనగాడు
ఆస్ట్రేలియాతో భారత్ మ్యాచ్ ఎప్పుడూ రసవత్తరంగా సాగుతుంది. అదీ నాకౌట్ దశలో ఆడే మ్యాచ్ మరింత క్లిష్టతరంగా ఉంటుంది. ఇందుకు చివరివరకూ పోరాడే ఆస్ట్రేలియా నైజం, వారి పోరాట తత్త్వం ప్రధాన కారణాలు. సాధారణముగా ఈ విషయం లో భారత్‌పై ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా దే పైచేయిగా నిలిచింది. ముఖ్యంగా భారత్‌లో జరిగిన 2023 వరల్డ్ కప్ ఫైనల్ , అదే సంవత్సరం ఇంగ్లండ్‌లో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఒక నిదర్శనం. ఈ రెండిటిని లోనూ ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ ప్రధాన భూమిక వహించాడు.కోహ్లీ విభిన్నమైన ఇన్నింగ్స్అయితే, మంగళవారం దుబాయ్ వేదిక పై జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఇందుకు భిన్నమైనిది. అందుకు ప్రధాన కారణం 36 ఏళ్ల భారత్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీ ఆడిన తీరు భారత్ క్రికెట్ అభిమానులకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కోహ్లీ లో అసాధారణ పరిణతి కనిపించింది. ఎక్కడా తడబాటు లేదు. పెద్ద షాట్లు కొట్టి ఆస్ట్రేలియా వాళ్లకి అవకాశం ఇవ్వకూడదనే దృఢ సంకల్పంతో సింగిల్స్ కోసం చిన్నపిల్లల వాడిలాగా పరిగెడుతూనే ఉన్నాడు.ఎక్కడా అలసట లేదు. అలసత్వం లేదు. ఇక్కడ ముఖ్యంగా గమినించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అందులో ప్రధానమైనది కోహ్లీ వయ్యస్సు. కోహ్లీ దుబాయ్ ఎండలో మధ్యానమంతా ఫీల్డింగ్ చేసాడు. ఇక కోహ్లీ ఫీల్డ్ లో ఎలా ఉంటాడో చెప్పనవసరం లేదు. ఒక మెరుపు తీగలాగా, పాదరసం లాగా మైదానమంతా కళయదిరగడం, తోటి ఆటగాళ్ళని ఉత్సహాబారచడం కోహ్లీ కి అలవాటు.కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ కీలక భాగస్వామ్యం265 పరుగుల విజయ లక్ష్యం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కొద్దిగా దూకుడుగా ఆడినా కెప్టెన్ రోహిత్ శర్మ మరియు శుభ్‌మాన్ గిల్ త్వరితగతిన ఔటవ్వడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి భారత్ 55/2తో ఉంది. ఆ దశలో జత కలిసిన కోహ్లీ మరియు శ్రేయాస్ అయ్యర్ 91 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చాలా పరిణతితో ఆడారు. ఎక్కడా ఆస్ట్రేలియా బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా ఫీల్డ్ ప్లేసిమెంట్లను జల్లెడ పట్టారు. గాప్స్ లో కొడుతూ ప్రధానంగా సింగిల్స్ పైనే దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా బౌలర్లకు ఎలాంటి అవకాశం రాలేదు. బ్యాటర్ తప్పిదాలు చేస్తేనే కదా ప్రత్యర్థికి అవకాశం.అలాంటిది షాట్లు కొట్టకుండా నిబ్బరంగా ఆడుతుంటే ఆస్ట్రేలియా బౌలర్లకు ఒక దశలో ఏమి చేయాలో తెలియకుండా పోయింది. భారత్ మాత్రం విజయం దశగా పరుగు తీసింది. ఈ మ్యాచ్ కోహ్లీ మాస్టర్ స్ట్రోక్ కి మచ్చు తునక గా నిలిచిపోతుంది.సచిన్ టెండూల్కర్ రికార్డుబ్రేక్అవసరమైన పక్షంలో విజృన్భించి ఆడగల బ్యాటర్ జట్టులో ఉన్నందునే కోహ్లీకి ఈ అవకాశం దక్కిందండంలో సందేహం లేదు. తెలివైన స్ట్రైక్ రొటేషన్ మరియు సకాలంలో బౌండరీలతో కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ భారత్ ఇన్నింగ్స్‌ను స్థిరపరిచారు. 25వ ఓవర్లో కోహ్లీ తన అర్ధ సెంచరీని సాధించాడు. విరాట్ కోహ్లీ, 98 బంతుల్లో 84 పరుగులు చేసి ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ఇప్పుడు కోహ్లీ ఖాతాలో 24 అర్థసెంచరీలు ఉండగా, సచిన్ సాధించిన 23 అర్థసెంచరీల మైలురాయి ని అధిగమించాడు.కోహ్లీ క్రూయిజ్ మోడ్ బ్యాటింగ్కోహ్లీ ఇన్నింగ్స్ ఒక విషయాన్నీ స్పష్టం చేసింది. వన్డే ఫార్మాట్లో అతని నైపుణ్యం ఒక దశకు చేరుకుంది. కోహ్లీ ఇప్పుడు ఎటువంటి అనవసరమైన ఒత్తిడి లేకుండా హైవే పై పరుగు తీసే క్రూయిజ్ మోడ్ లో ఉండే కారు లాగా సునాయాసంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. "నేను ఎక్కడా తొందరపడలేదు. చాల ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాను. ఒక్క సింగిల్స్ తో ఇన్నింగ్స్ ని అలా నిర్మించడం నాకు చాలా సంతోషకరంగా ఉంది" అని కోహ్లీ వ్యాఖ్యానించాడు. కోహ్లీ ఇప్పుడు 106 ఇన్నింగ్స్‌లలో 5999 పరుగులు చేసి భారత్ విజయలక్ష్య సాధన లో పరుగులు సాధించిన బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ విరాట్ కోహ్లీ పై ప్రశంసలు కురిపించాడు. " కోహ్లీ మరో సారి తన ప్రతిభని చాటి చెప్పాడు. పరిస్థితులను అద్భుతంగా అంచనా వేశాడు. ఒక క్లాస్ ప్లేయర్ అయిన అతనికి తన జట్టుకు ఏమి అవసరమో మరియు మ్యాచ్ ని గెలవడానికి సరిగ్గా ఎలా ఆడాలో దిశా నిర్దేశం చేసాడు. ముందుండి జట్టుని నడిపించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ సాధించిన సెంచరీ తో ఈ విషయం స్పష్టమైంది. మళ్ళీ కోహ్లీ అదే ఇన్నింగ్స్ ని పునరావృతం చేసాడు. వన్డేలలో మొనగాడని మరోసారి నిరూపించుకున్నాడు’’ అని క్లార్క్ విరాట్ కోహ్లీని ప్రశంసించాడు.చదవండి: కోహ్లి పైపైకి.. పడిపోయిన రోహిత్ శర్మ ర్యాంకు -
World Cancer Day: క్యాన్సర్‌ను జయించిన క్రికెట్ యోధులు
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం (World Cancer Day) (ఫిబ్రవరి 4) నాడు ఈ ప్రాణాంతక వ్యాధితో పోరాడి గెలిచిన ఐదురుగు స్టార్ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. క్రికెటర్లకు సంబంధించి క్యాన్సర్ (Cancer) పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు యువరాజ్ సింగ్(Yuvraj SIngh). ఈ టీమిండియా మాజీ క్రికెటర్ 2011 వన్డే ప్రపంచకప్ సమయంలో క్యాన్సర్‌తో బాధ పడ్డాడు.ఆ సమయంలో యువరాజ్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ మొక్కవోని ధైర్యంతో బరిలోకి దిగి భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఆ టోర్నీలో యువీ 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును గెలుచుకున్నాడు.ప్రపంచ కప్ గెలిచిన వెంటనే యువరాజ్‌కు ఊపిరితిత్తులలో అరుదైన జెర్మ్ సెల్ కణితి (క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అతను అమెరికాలో కీమోథెరపీ చేయించుకున్నాడు. ఆ సమయంలో యువీ నెలల తరబడి తీవ్రమైన నొప్పి మరియు మానసిక సంఘర్షణలను ఎదుర్కొన్నాడు. 2012లో అతను క్యాన్సర్‌ను జయించి యోధుడిలా తిరిగి భారత జట్టులో చేరాడు. యువీ ప్రయాణం క్రికెట్ యొక్క గొప్ప పునరాగమన కథలలో ఒకటిగా మిగిలిపోయింది.మైఖేల్ క్లార్క్: 43 ఏళ్ల ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ చర్మ క్యాన్సర్‌పై విజయం సాధించాడు. ఆస్ట్రేలియా గొప్ప కెప్టెన్లలో ఒకరైన క్లార్క్‌కు 2006లో క్యాన్సర్ బయటపడింది. వైద్యులు అతని ముఖం, ఛాతీ, నుదిటిపై క్యాన్సర్ మచ్చలను గుర్తించారు. వీటిని తొలగించేందుకు క్లార్క్ అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు. క్లార్క్ కెరీర్ ఆరంభంలోనే క్యాన్సర్‌పై విజయం సాధించి విజయవంతంగా తన కెరీర్‌ను కొనసాగించాడు. క్లార్క్ ఆసీస్ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడి 17000 పైచిలుకు పరుగులు చేశాడు.మార్టిన్ క్రో: ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ యుక్త వయసులో ఉండగానే క్యాన్సర్‌తో పోరాడాడు. అతనికి లింఫోమా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. క్యాన్సర్ నుంచి బయట్ట పడ్డాక క్రో తిరిగి ప్రజా జీవితంలోకి వచ్చాడు. అయితే అతనికి రెండోసారి క్యాన్సర్ వచ్చింది. అప్పుడు కూడా అతను ప్రాణాంతక వ్యాధితో పోరాడే ప్రయత్నం చేశాడు. అయితే 2016లో అతను విషాదకర రీతిలో మరణించాడు. మార్టిన్ క్రోకు క్లాసికల్ బ్యాటర్‌గా గుర్తింపు ఉంది. క్రో 1982-95 మధ్యలో న్యూజిలాండ్ తరఫున 77 టెస్ట్‌లు, 143 వన్డేలు ఆడి 10000 పైచిలుకు పరుగులు చేశాడు.గ్రేమ్ పొల్లాక్: ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్‌కు ఆ దేశ క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాటర్‌గా పేరుంది. గ్రేమ్ పొల్లాక్ 1963-70 మధ్యలో ప్రపంచంలోనే మేటి బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దక్షిణాఫ్రికా తరఫున 23 టెస్ట్‌లు ఆడిన పొల్లాక్ 7 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీల సాయంతో 2256 పరుగులు చేశాడు. 2013లో పొల్లాక్కు కొలొరెక్టల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆ సమయంలో అతను క్యాన్సర్‌తో పోరాడి గెలిచాడు. ప్రస్తుతం పొల్లాక్ 80 ఏళ్ల వయసులో జీవనం కొనసాగిస్తున్నాడు.జెఫ్రీ బాయ్‌కాట్: ఇంగ్లండ్ ఆల్‌టైమ్ గ్రేట్ ఓపెనర్.. 1990, 2000 దశకాల్లో ప్రముఖ వ్యాఖ్యాత అయిన జెఫ్రీ బాయ్‌కాట్ గొంతు క్యాన్సర్‌పై విజయం సాధించాడు. అతను 35 కఠినమైన రేడియోథెరపీ సెషన్లు చేయించుకున్నాడు. రేడియోథెరపీ సమయంలో బాయ్‌కాట్ తీవ్రమైన నొప్పిని ఎదుర్కొన్నాడు. క్యాన్సర్‌ను జయించాక బాయ్‌కాట్ తిరిగి వ్యాఖ్యానం మొదలుపెట్టాడు. ప్రస్తుతం బాయ్‌కాట్ వయసు 84 ఏళ్లు. -
DC Vs KKR: రిషభ్ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ తీరును ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ తప్పుబట్టాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి అనంతరం అతడు చేసిన వ్యాఖ్యలను విమర్శించాడు. ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై పరుగులు రాబట్టడంలో విఫలమైన తరుణంలో పంత్ తన నిర్ణయాన్ని సమర్థించుకోవడం ఏమీ బాలేదన్నాడు.పవర్‌ప్లే ముగిసేసరికిఐపీఎల్-2024లో సోమవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ కేకేఆర్‌ను ఢీకొట్టింది. టాస్ గెలిచిన పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో 3 ఫోర్లతో మొదలు పెట్టినా... పృథ్వీ షా (13) ఎక్కువసేపు నిలవలేదు.స్టార్క్ తర్వాతి ఓవర్లోనే వరుసగా 6, 4 కొట్టిన జేక్ ఫ్రేజర్ (12) తర్వాతి బంతికి వెనుదిరగడంతో ఢిల్లీకి ఆశించిన ఆరంభం లభించలేదు. షై హోప్ (6) విఫలం కాగా... హర్షిత్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అభిషేక్ పొరేల్ (18) కూడా జోరు కొనసాగించలేకపోయాడు. దీంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 67 పరుగులకు చేరింది.కెప్టెన్ రిషభ్ పంత్ (20 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా తనదైన శైలిలో ఆడలేకపోవడంతో క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో ఎలాంటి మెరుపులు కనిపించలేదు. 18 పరుగుల వద్ద తాను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హర్షిత్ వదిలేయడంతో బతికిపోయిన పంత్ దానిని వాడుకోలేకపోయాడు.కుల్దీప్ చక్కటి షాట్లుఎనిమిది పరుగుల వ్యవధిలో పంత్, స్టబ్స్ (4), అక్షర్ (15) వెనుదిరగ్గా... 101/7 వద్ద ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసేలా కనిపించింది. అయితే కుల్దీప్ కొన్ని చక్కటి షాట్ల(26 బంతుల్లో 35)తో చివరి వరకు నిలబడటంతో క్యాపిటల్స్ 150 పరుగులు దాటగలిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్.. కేవలం మూడు వికెట్లు నష్టపోయి 16.3 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీని మట్టికరిపించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సారథి పంత్ మాట్లాడుతూ.. ‘‘తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడం మంచి ఆప్షనే. కాకపోతే మా బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.రిషభ్ పంత్‌దే తప్పు.. అతడి వల్లే ఓటమి!ఇక్కడ 180 -210 పరుగులు స్కోరు చేయవచ్చు. కాకపోతే ఈరోజు మాత్రం కాస్త పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకొన్ని పరుగులు చేసి ఉంటే బాగుండేది’’ అని పేర్కొన్నాడు.ఈ మేరకు పంత్ చేసిన వ్యాఖ్యలపై మైకేల్ క్లార్క్ స్పందిస్తూ.. ‘‘ఓటమి తర్వాత పంత్ మాట్లాడిన తీరుతో నేను ఏకీభవించను. ఒకవేళ గెలిచి ఉంటే ఆ నిర్ణయం(టాస్) సరైందిగా ఉండేది.ఓడిపోయారు కాబట్టి తప్పును అంగీకరించాల్సిందే. ఇలాంటి పిచ్‌పై పంత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని కచ్చితంగా తప్పు చేశాడనే నా అభిప్రాయం. వాళ్లు కేవలం పది పరుగులు కాదు.. తక్కువలో తక్కువ యాభై పరుగులు వెనుకబడి ఉన్నారు.ఎందుకంటే లక్ష్య ఛేదనలో కేకేఆర్‌కు ఇంకా 3.3 ఓవర్లు మిగిలే ఉన్నాయన్న విషయం మరవొద్దు. చేతిలో ఏడు వికెట్లు కూడా ఉన్నాయి. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కనీసం 200 పరుగులు చేయాల్సింది’’ అని అభిప్రాయపడ్డాడు. A clinical bowling performance followed by a solid chase 💪KS Bharat rounds up @KKRiders' sixth win of the season 💜👌#TATAIPL | #KKRvDC | @KonaBharat pic.twitter.com/4iras2D9XB— IndianPremierLeague (@IPL) April 30, 2024 -
ఐపీఎల్ సొమ్ము పాపిష్టిది.. అదే మా రిలేషన్‌ను చెడగొట్టింది..!
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఎందరో క్రికెటర్లకు పేరు, హోదాతో పాటు ఆర్ధిక స్థిరత్వాన్ని అందించిన క్యాష్ రిచ్ లీగ్‌పై ఈ వివాదాస్పద ఆటగాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో లభించిన సొమ్ము పాపిష్టిదని, దాని వల్లే తన ఆప్తమిత్రుడు, ఆసీస్ మాజీ సారధి మైఖేల్ క్లార్క్ తనకు దూరమయ్యాడని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ (2008)లో డెక్కన్ ఛార్జర్స్ తనను రూ.5.4 కోట్లకు కొనుగోలు చేసిందని, అదే క్లార్క్‌తో తన స్నేహం శత్రుత్వంగా మారడానికి కారణమయ్యిందని వ్యాఖ్యానించాడు. ఇదే సందర్భంగా సైమండ్స్ మరో బాంబు పేల్చాడు. ఐపీఎల్లో తనకు భారీ ధర పలకడం చూసి క్లార్క్ ఈర్ష్య (జెలసీ) పడ్డాడని, అందుకే నేనంటే అతనికి నచ్చేది కాదని, ఈ విషయాన్ని మాథ్యూ హేడెన్ తనతో చెప్పాడని పేర్కొన్నాడు. ఆప్తమిత్రులుగా ఉన్న తమ మధ్య ఐపీఎల్ డబ్బే చిచ్చు పెట్టిందని, మొత్తంగా మా రిలేషన్ దెబ్బ తినడానికి ఐపీఎలే కారణమైందని అన్నాడు. ఇప్పటికీ క్లార్క్ అంటే నాకు గౌరవం ఉందని, అందుకే అన్ని విషయాలు బయటపెట్టలేకపోతున్నానని బ్రెట్ లీ పోడ్కాస్ట్తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఆసీస్ 2007 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ఆండ్రూ సైమండ్స్, నాటి ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలకపాత్ర పోషించారు. వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉండి ఆసీస్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. అయితే, 2008లో ఓ వన్డే మ్యాచ్‌కి సైమండ్స్ తాగేసి వచ్చాడని క్లార్క్ ఆరోపించడంతో వీరిద్దరి మధ్య రగడ మొదలైంది. ఇందుకు కౌంటర్‌గా సైమండ్స్ సైతం పోటాపోటీ ప్రెస్మీట్లు పెట్టి క్లార్క్ కెప్టెన్సీపై దుమ్మెత్తిపోశాడు. ఈ ఇద్దరి మధ్య విభేదాలు అప్పట్లో సంచలనం క్రియేట్ చేశాయి. ఇదిలా ఉంటే, నిత్యం వివాదాలతో కెరీర్‌ను కొనసాగించిన సైమండ్స్.. ఆస్ట్రేలియా తరఫున 26 టెస్ట్‌లు, 198 వన్డేలు ఆడాడు. ఐపీఎల్లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: IPL 2022: నిర్లక్ష్యపు షాట్లు.. అదే మా కొంప ముంచింది: రోహిత్ శర్మ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ దిగ్గజ ఆటగాడు గ్రౌండ్లోకి వచ్చే ముందు సిగరెట్ కాల్చేవాడు..
మెల్ బోర్న్: స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ గురించి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ సంచలన విషయాలు వెల్లడించాడు. వార్న్‌కు మైదానంలోకి అడుగుపెట్టే ముందు సిగరెట్ కాల్చే అలవాటు ఉండేదని బహిర్గతం చేశాడు. కెరీర్ మొత్తంలో వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన స్పిన్ మాంత్రికుడు.. అఫ్ ద ఫీల్డ్ విషయాల గురించి ఉపశమనం పొందేందుకే ఆ విధంగా చేసేవాడని చెప్పుకొచ్చాడు. వార్న్‌కు మానసిక స్థైర్యం ఎక్కువని, అదే అతని బలమని పేర్కొన్నాడు. వార్న్.. ఆన్ ఫీల్డ్‌లో ఏరకంగా రెచ్చిపోయేవాడో, అఫ్ ద ఫీల్డ్ కూడా అదే రకంగా ప్రవర్తించి వివాదాలను కొని తెచ్చుకునేవాడని కుండ బద్దలు కొట్టాడు. దీంతో అతను మీడియా నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించేందుకు సిగరెట్ కాల్చేవాడని, తన వ్యక్తిగత విషయాలు ఆటపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతోనే అతను అలా చేసే వాడని వివరించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అల్ టైమ్ గ్రేట్ స్పిన్నర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వార్న్.. తన హయాంలో ఆస్ట్రేలియాను జగజ్జేతగా నిలిపాడని కొనియాడాడు. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన సందర్భాల్లో మీడియా వార్న్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేసేదని, దానికి అతడు గ్రౌండ్‌లోనే బదులిచ్చేవాడని చెప్పుకొచ్చాడు. మైదానం వెలుపల అతని ప్రవర్తన ఎలా ఉన్నా, దాని తాలూకా ప్రభావాన్ని మాత్రం ఆన్ ఫీల్డ్ ఎప్పుడూ చూపించేవాడు కాదని వార్న్‌ను వెనకేసుకొచ్చాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న వార్న్.. 145 మ్యాచ్‌ల్లో 708 వికెట్లు సాధించాడు. -
బాల్ టాంపరింగ్ వివాదంలో మరికొందరి ప్రమేయం..
మెల్బోర్న్: మూడేళ్ల కిందట జరిగిన బాల్ టాంపరింగ్ వివాదంలో రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తుంది. ఆ వివాదంలో ప్రధాన సూత్రధారి అయిన బాన్‌క్రాఫ్ట్ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించగా, తాజాగా ఆసీస్ దిగ్గజ ఆటగాడు గిల్‌క్రిస్ట్, డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్, ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌లు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రక్తి కట్టించాయి. ఈ విషయమై తొలుత బాన్‌క్రాఫ్ట్ మాట్లాడుతూ.. 2018లో సఫారీలతో జరిగిన మూడో టెస్ట్‌లో తాను సాండ్ పేపర్ వాడిన విషయం తమ బౌలర్లకు ముందే తెలుసని బాంబు పేల్చగా, తాజాగా ఆసీస్ లెజండరీ ఆటగాడు గిల్లీ మాట్లాడుతూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం బాన్‌క్రాఫ్ట్‌తో పాటు మరికొంత మందికి ముందే తెలుసని, ఆ పేర్లను బయటపెట్టేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపునకు లోను చేసిన ఈ ఉదంతంపై వార్నర్ మేనేజర్ జేమ్స్ మాట్లాడుతూ.. నాడు జరిగిన విచారణ ఏకపక్షంగా సాగిందని, ఈ విషయమై నిషేదానికి గరైన ఆటగాళ్లు కోర్టును ఆశ్రయించి ఉంటే తప్పక కేసు గెలిచే వాళ్లని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఆసీస్ మాజీ కెప్టెన్ క్లార్క్ స్పందిస్తూ.. బాల్ టాంపరింగ్ జరిగిన విషయం ఆ ముగ్గురితో పాటు ఇంకా ఎవరికైనా ముందే తెలిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నాడు. కాగా, ఈ వివాదంలో బాన్‌క్రాఫ్ట్‌తోపాటు నాటి జట్టు కెప్టెన్ స్టీవ్‌స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది పాటు నిషేదానికి గురైన సంగతి తెలిసిందే. చదవండి: భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా జరుగనుంది.. -
బంగ్లాతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడిన క్లార్క్
బ్రిస్బేన్: కాలి పిక్క కండరాల గాయంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్... బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. సీఏ ఇన్విటేషన్ ఎలెవన్ తరఫున ఆడిన క్లార్క్ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేశాడు. రెండు ఓవర్లు స్పిన్ వేయడంతో పాటు చాలాసేపు స్లిప్‌లో ఫీల్డింగ్ చేశాడు. 47 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి 36 బంతుల్లో 34 పరుగులు సాధించాడు. క్లార్క్ ఫిట్నెస్ను సెలక్టర్ రోడ్నీ మార్ష్, కోచ్ లీమన్లు పర్యవేక్షించారు. తన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన కెప్టెన్ వరల్డ్‌కప్‌కు అవసరమైన ఫిట్‌నెస్‌కు ఇంకా దూరంలో ఉన్నానని చెప్పాడు. క్లార్క్.. శుక్రవారం అడిలైడ్‌లో ఆసీస్ జట్టుతో కలవనున్నాడు. -
ఇక నేను ఆడలేనేమో: క్లార్క్
గాయం కారణంగా సిరీస్‌కు దూరం అడిలైడ్: భారత్‌తో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ దూరమయ్యాడు. తొలి టెస్టు చివరి రోజు భారత్ రెండో ఇన్నింగ్స్ 44వ ఓవర్లో కుడి మోకాలి కండరాలు పట్టేయడంతో క్లార్క్ మైదానం నుంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత స్కానింగ్ కోసం అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తన కుడి కండర ంలో చీలిక వచ్చినట్టు తేలింది. ఆ తర్వాత మైదానంలో కనిపించినప్పటికీ కుంటుతూనే నడిచాడు. దీంతో మిగిలిన టెస్టు సిరీస్‌కు దూరమవుతున్నట్టు ప్రకటించాడు. క్లార్క్ స్థానంలో నాయకత్వ బాధ్యతలను వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్‌కు అప్పగించే అవకాశం ఉంది. రెండో టెస్టుకు మార్ష్: క్లార్క్ సిరీస్‌కు దూరం కావడంతో రెండో టెస్టుకు షాన్ మార్ష్ జట్టులోకి రానున్నాడు. ఈనెల 17 నుంచి బ్రిస్బేన్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. మార్ష్‌తో పాటు పేసర్ మిచెల్ స్టార్క్‌ను కూడా ఎంపిక చేశారు. ‘వైద్య నిపుణులు నా గాయానికి సంబంధించిన స్కాన్లను పరిశీలిస్తున్నారు. ఎంతకాలం ఆటకు దూరంగా ఉంటానో నాకు తెలీదు. వన్డే ప్రపంచకప్ గురించి ఆలోచిస్తున్నాను. మా తొలి ప్రాక్టీస్ గేమ్‌కు ఇంకా ఎనిమిది వారాల సమయం ఉంది. ముక్కోణపు సిరీస్‌లో ఆడాలని ఆశిస్తున్నాను. కానీ ఇక ముందు ఎప్పటికీ ఆడలేనేమో.. అలా జరక్కూడదనే అనుకుంటున్నాను. నా శక్తిమేరా తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను. అలా అని వాస్తవ పరిస్థితిని విస్మరించలేం కదా. ఆసీస్ తరఫున ఒక్క మ్యాచ్‌కు దూరమైనా అది నా హృదయాన్ని బద్దలు చేస్తుంది. ఇంకా నాలో క్రికెట్ మిగిలే ఉంది. ఇక భారత్‌పై తొలి టెస్టు విజ యం మాకు చాలా ‘ప్రత్యేకమైంది’. మా కెరీర్ మొత్తం ఈ మ్యాచ్ గుర్తుండిపోతుంది. నా జీవితంలోనే అత్యంత ముఖ్యమైన టెస్టు ఇది’ - మైకేల్ క్లార్క్ (ఆసీస్ కెప్టెన్)