breaking news
mia
-
కొత్తరకం వినోదం
‘‘రెండు గంటలు కథ విన్న తర్వాతే ఈ చిత్రం చేయడానికి అంగీకరించా. స్క్రిప్ట్ మొత్తం పూర్తయిన తర్వాతే సెట్స్‌పైకి వెళుతున్నాం. ఈ చిత్రం నా కెరీర్లో పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని హీరో సునీల్ అన్నారు. సునీల్, మియా జంటగా యునెటైడ్ మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. దర్శకుడు మాట్లాడుతూ-‘‘ ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రమిది. మంచి కామెడీ చిత్రం చేయాలనే తపనతో చేస్తున్నా. ఈ కథకు సునీల్ అయితేనే కరెక్ట్‌గా యాప్ట్ అవుతాడనిపించింది. ఇప్పటి వరకూ వచ్చిన సునీల్ సినిమాల్లోని వినోదం కన్నా ఇందులో కొత్తగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్. -
మంచిపేరు తెచ్చుకోకపోయినా..
కేరళ కథానాయికలకు కేరాఫ్‌గా మారిందంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రస్తుతం కోలీవుడ్‌కు దిగుమతి అయిన కేరళ నటీమణుల హవానే కొనసాగుతోంది. నయనతార నుంచి లక్ష్మీమీనన్ వరకు కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్లుగా విరాజిల్లుతున్నారు. తాజాగా మియా ఎంటరింగ్ ఇచ్చింది. ఇక్కడ తొలి చిత్రం అమరకావ్యంతోనే ప్రశంసలు అందుకుంది. మంచి పేరు తెచ్చుకోకపోయినా పర్వాలేదంటున్న ఈ అమ్మడి సంగతేమిటో చూస్తే పోలా! పేరేంటి కొత్తగా ఉంది? నా అసలు పేరు జిమి జార్జ్. ఈ పేరు చాలామంది సరిగ్గా ఉచ్చరించలేపోతున్నారన్న విషయం నాకు తెలుసు. మలయాళంలో నేను నటించిన తొలి చిత్రం సెట్టాయిస్లో నా పాత్ర పేరు మియా. ఆ తరువాత ఆ పేరే నా పేరుగా మారింది. చిత్ర రంగ ప్రవేశం ఎలా జరిగింది? ప్రస్తుతం నేను కొట్టాయంలోని కళాశాలలో ఎంఏ ఇంగ్లిష్ లిటరేచర్ చదువుతున్నాను. షూటింగ్ ఉంటే కాలేజ్‌కు సెలవు పెట్టి నటిస్తున్నాను. చదువులో ఫస్ట్. అందుకే సినిమాల కంటే చదువుకే ప్రాముఖ్యతనిస్తాను. ఇక నటినెలా అయ్యానంటే 2011లో మిస్ కేరళ పోటీల్లో పాల్గొన్నాను. కేరళ ఫిట్నెస్ టైటిల్‌ను గెలుచుకున్నాను. భరతనాట్యం, కూచిపూడి, మోహిని అట్టం నృత్యాలు నేర్చుకున్నాను. చాలా స్టేజ్ ప్రోగ్రాంలు చేశాను. బహుమతులు గెలుచుకున్నాను. సినిమాల్లో కెళ్లు అంటూ స్నేహితులు ప్రోత్సహించారు. అలాంటి పరిస్థితుల్లో ఒక పత్రికలో ప్రచురితమైన నా ముఖ చిత్రం చూసి మలయాళ దర్శకుడు సెట్టాయిస్ అనే చిత్రంలో హీరోయిన్గా పరిచయం చేశారు. మీలో మంచి గాయని కూడా ఉన్నారట? నా కంఠం బాగుంటుంది. సంగీతం నేర్చుకున్నాను. మలయాళంలో నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటాను. తమిళంలో ప్రయత్నించలేదు. తమిళంలో అమరకావ్యం చిత్రంలో నటించిన అనుభవం? చాలామంచి అనుభవం. ఇక్కడ తొలి చిత్రంలోనే నటిగా ప్రతిభను చాటుకునే పాత్ర లభించింది. అదేవిధంగా మలయాళంలోనూ మోహన్‌లాల్, మమ్ముట్టి, సురేష్‌గోపి, జయరాం లాంటి ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశం లభించడం ఆనందంగా ఉంది. తమిళంలోను స్టార్ హీరోలతో నటించాలని ఆశిస్తున్నాను. డ్రీమ్ రోల్? మొదట ఎంఏ పూర్తి చేయాలన్నదే నా లక్ష్యం. ఇక నటిగా మంచి పాత్రలు ఎంపిక చేసుకుని నటించి అభిమానుల మనస్సుల్లో చోటు సంపాదించుకోవాలి. అధిక చిత్రాలు చేసే కన్నా ఒక్క చిత్రం చేసినా గుర్తింపు తెచ్చుకోవాలన్నదే నా భావన. నాకు నచ్చిన నటీనటులు మోహన్‌లాల్, మమ్ముట్టి, శోభన, రేవతిలా నేను వైవిధ్యభరిత పాత్రలు పోషించాలని ఆశిస్తున్నాను. ప్రేమ వ్యవహారం గురించి? చదువు, నటన ఈ రెండూ పూర్తి చేసిన తరువాతనే పెళ్లి గురించి మాట్లాడండని ఇంట్లో చెప్పేశాను. అందు వల్ల ప్రస్తుతం నా దృష్టి ప్రేమ వైపు సోకే అవకాశం లేదు.