breaking news
medical bulletin
-
విషమంగా విజయకాంత్ ఆరోగ్యం
సాక్షి, చైన్నె: డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ ఆరోగ్యంపై ఆ పార్టీ వర్గాలలో ఆందోళన నెలకొంది. ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు బుధవారం బులెటిన్ విడుదలైంది. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు అందులో వైద్యులు వెల్లడించారు. వివరాలు.. డీఎండీకే అధినేత విజయకాంత్ ఈనెల 18వ తేదీ రాత్రి అనారోగ్యం బారిన పడ్డ విషయం తెలిసిందే. ఆయన్ని మనపాక్కంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, ఆయన అవయవాల పరిస్థితిపై వైద్యులు పరిశోధించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తుండటం, తరచూ శ్వాస సమస్య తలెత్తినట్టుగా, కృత్రిమ శ్వాసను అందిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయన ఆరోగ్యంపై వదంతులు రావడంతో దేరడంతో వాటిని నమ్మవద్దని డీఎండీకే కార్యాలయం ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో బుధవారం వెలువడ్డ బులిటెన్ డీఎండీకే వర్గాలలో ఆందోళన రెకెత్తించాయి. విజయకాంత్ ఆరోగ్యం సరిగ్గా లేదని, ఆయనకు ఊపిరితిత్తులకు సంబంధించిన చికిత్స అవశ్యమైనట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన చికిత్స కొనసాగుతోందని, ఆయన మరో రెండు వారాలు ఆస్పత్రిలో ఉండాల్సి ఉంటుందని ఆ బులిటెన్‌లో పేర్కొనడం డీఎండీకే వర్గాలను కలవరంలో పడేశాయి. గతంలో విజయకాంత్‌కు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగినట్టు తెలిసింది. ఆ తర్వాత ఆయన ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటూ వచ్చాయి. తాజాగా ఆయనకు మరోమారు ఊపిరితిత్తుల సమస్య తలెత్తడం గమనార్హం. -
ఎన్సీఏలో ఐదుగురు క్రికెటర్లు.. బీసీసీఐ మెడికల్ బులెటిన్ విడుదల
బెంగళూరు: గాయాలకు గురై జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్న ఐదుగురు భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి బీసీసీఐ మెడికల్ బులెటిన్‌ను విడుదల చేసింది. వేర్వేరు కారణాలతో ఎన్సీఏలో కోలుకుంటున్న వీరందరి ఫిట్నెస్ స్థాయి ప్రస్తుతం మెరుగ్గా ఉందని బోర్డు వెల్లడించింది. బోర్డు చెప్పిన వివరాల ప్రకారం... పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ రీహాబిలిటేషన్ చివరి దశలో ఉన్నారు. నెట్స్‌లో పూర్తి స్థాయిలో బౌలింగ్ కూడా చేస్తున్నారు. ఎన్సీఏ నిర్వహించే ప్రాక్టీస్ మ్యాచ్‌లలో వీరిద్దరు ఆడతారు. ప్రాక్టీస్ గేమ్‌లను పరిశీలించిన తర్వాత వీరిద్దరిపై తుది నిర్ణయం తీసుకుంటారు. బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం స్ట్రెంత్, ఫిట్నెస్ డ్రిల్స్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ డ్రిల్స్ తీవ్రత పెంచి వారి పరిస్థితిని అంచనా వేస్తారు. కారు ప్రమాదానికి గురై కోలుకుంటున్న వికెట్ కీపర్ రిషభ్ పంత్ రీహాబిలిటేషన్ చాలా వేగంగా సాగుతోంది. నెట్స్‌లో బ్యాటింగ్ సాధనతో పాటు వికెట్ కీపింగ్ కూడా పంత్ మొదలు పెట్టాడు. స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ, రన్నింగ్‌కు సంబంధించి అతని కోసమే ప్రత్యేకంగా రూపొందించిన ఫిట్నెస్ కార్యక్రమాన్ని పంత్ అనుసరిస్తున్నాడు. -
అమ్మ ఆరోగ్యం మరింత మెరుగు
-
ఊరట
అమ్మ ఆరోగ్యం మరింత మెరుగు అపోలో ఆసుపత్రి వర్గాల వెల్లడి అభిమానుల ఆనందోత్సాహాలు త్వరలో డిశ్చార్జ : పార్టీ వెల్లడి యథావిధిగా మంత్రుల రాక 40 మందిపై పోలీసు కేసులు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంపై కొందరు ఇంకా ఉత్కంఠను ఎదుర్కొంటుండగా మరికొందరు ఆమె ఆరోగ్యం కుదుటపడిందని నమ్ముతూ ఊరట చెందుతున్నారు. కాగా, అమ్మ ఆరోగ్యం మరింత మెరుగుపడిందని పేర్కొంటూ అపోలో ఆసుపత్రి ఆదివారం రాత్రి ఒక బులెటిన్‌ను విడుదల చేసింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత అకస్మాత్తుగా అనారోగ్యానికి గురై అపోలో ఆసుపత్రిలో చేరి ఆదివారానికి పదిరోజులైంది. కేవలం రెండు, మూడు రోజుల్లో అమ్మ డిశ్చార్జ్ అవుతారని ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, అభిమానులు రోజులు గడిచిపోతున్న కొద్దీ లోలోన నిరాశకు లోనయ్యారు. అయితే అపోలో ఆసుపత్రి వారు, పార్టీ అధికార ప్రతినిధులు మాత్రం అమ్మ వేగంగా కోలుకుంటున్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని ఎప్పటికప్పుడు ధీమాను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా జయలలిత ఆరోగ్యంపై కొందరు వ్యక్తులు గత నెల 30వ తేదీన వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ సాంఘిక మాధ్యమాల ద్వారా అవాంఛనీయమైన వదంతులు పుట్టించారు. ఈ వదంతులు అనేక రాష్ట్రాల్లో హల్చల్ చేయడంతో అపోలో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ప్రాం తీయ, జాతీయ మీడియాకు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో అపోలో ఆసుపత్రి ముందు శనివారం ఉదయానికి వాలిపోయారు. ఇదిగో ప్రకటిస్తారు...అదిగో ప్రకటిస్తారని హడావిడి చేసి మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పారు. ఇంతలో తమిళనాడు గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు శనివారం రాత్రి అపోలో ఆసుపత్రికి చేరుకుని చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి సహా ఇతర వైద్య బృందాన్ని కలవడం, సీఎం క్షేమంగా ఉన్నారంటూ గవర్నర్ ప్రకటించడంతో 48 గంటల ఉత్కంఠకు తెరపడింది. అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మీడియా వారు మాత్రం ఇంకా చెన్నైలోనే ఉన్నారు. పూజలు...సంబరాలు: ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రి వద్ద ఆదివారం ప్రశాంత వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు యథావిధిగా అపోలోకు చేరుకుని తిరిగి వెళ్లారు. అమ్మ ఆరోగ్యం మరింత మెరుగుపడుతున్నట్లు అధికారికంగా సమాచారం రావడంతో అన్నాడీఎంకే శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అపోలో ఆసుపత్రి ముందు మహిళా కార్యకర్తలు గుమ్మడికాయ దిష్టితీసి పూజలు చేశారు. మరికొందరు కార్యకర్తలు అమ్మ ఫొటోకు హారతులు ఇస్తూ నాట్యాలు చేశారు. కర్ణాటక నుంచి వచ్చిన జయ అభిమానులు అపోలో ముందు కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు సృష్టించేందుకు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి అవాకులు చవాకులు పేలుతున్నారని మాజీ మంత్రి వలర్మతి ఆరోపించారు. అమ్మ కోలుకుంటున్నారు, త్వరలో డిశ్చార్జ్ అవుతారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధులు సీఎస్ సరస్వతి, పొన్నయ్యన్ తెలిపారు. వదంతి బాబులపై 40 కేసులు: సీఎం జయలలిత ఆరోగ్యంపై అనధికార సమాచారంతో వదంతులు పుట్టించిన 40 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమ్మ ఆరోగ్యం విషయంలో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునేలా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ల ద్వారా ప్రచారం చేశారు. దీంతో తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమ్మ ఆరోగ్యం ఉన్నట్లు తెలుసుకుని ఊరట చెందిన అభిమానులు దుష్ర్పచారం చేసిన వారిపై ఆగ్రహోద్రులైనారు. మొత్తం 40 పోస్టింగులపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల విభాగం అదనపు పోలీస్ కమిషనర్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ, వదంతులు ప్రచారం చేసిన వారిపై అందిన ఫిర్యాదుల మేరకు 40 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఆయా మాధ్యమాల సర్వర్ యూఎస్‌లో ఉన్నందున నిందితులను వెంటనే గుర్తించడంలో కొంత జాప్యం జరుగుతుందని అన్నారు. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ నిందితులపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
వైఎస్ జగన్ ఆరోగ్యం విషమం
-
వైఎస్ జగన్ ఆరోగ్యం విషమం: 3+కు చేరుకున్న కీటోన్స్ స్థాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆరు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం మరింత విషమించింది. కీటోన్స్ 3+ స్థాయికి చేరుకున్నాయి. కుమారుడి ఆరోగ్యం మరింత క్షీణించటంతో వైఎస్ విజయమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హుటాహుటిన సోమవారం సాయంత్రం గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఆరోగ్యంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా దీక్షాస్థలి వద్దే ఉన్నారు. ఇక వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా బెంగళూరు నుంచి గుంటూరు బయల్దేరారు. కాగా వైఎస్ జగన్ కు సోమవారం ఉదయం రెండుసార్లుగా నిర్వహించిన వైద్య పరీక్షలలో కీటోన్స్ 3+ స్థాయికి చేరిందని, కీటోన్ బాడీస్ పాజిటివ్ అంటేనే ప్రమాదకరం అని, ఇక 3+ అంటే మరింత విషమం అని వైద్యులు తెలిపారు. శరీరంలో మొత్తం అన్ని వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని అన్నారు. ఆయన కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, గుండె, కిడ్నీలు, మెదడు మీద ప్రభావం పడుతుందని చెప్పారు. కీటోన్ బాడీస్ అనేవి అసలు శరీరంలో ఉండకూడదని, కానీ ప్రస్తుతం అవి వైఎస్ జగన్ శరీరంలో 3+ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. గంటగంటకూ ఆయన ఆరోగ్యం విషమిస్తోందని, దీక్ష విరమించడమే మంచిదని సూచించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దీక్ష విరమించాలని వైఎస్ జగన్‌ను కోరారు. అయితే ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించిన ప్రకటన వస్తే తప్ప దీక్ష విరమించేది లేదంటున్నారు. వైద్య పరీక్షల వివరాలను గుంటూరు ప్రభుత్వాస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ రమేశ్ ఉదయం తెలిపారు. ఆయన పల్స్ రేటు 68, బీపీ 130/80, బరువు 72.9, బ్లడ్ షుగర్ 84, కీటోన్స్ 3+ అని డాక్టర్ రమేష్ వివరించారు. ఆదివారం మధ్యాహ్నం గానీ, రాత్రి గానీ కీటోన్ బాడీస్ పరీక్ష చేయలేదని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం జీజీహెచ్ వైద్యులు మరోసారి మీడియా సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో దీక్ష విరమిస్తే మంచిదని వైద్యులు తెలిపారు. అయితే ఎలాంటి హెల్త్ బులిటెన్ విడుదల చేయలేదు. కాగా ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ - 61; బ్లడ్ యూరియా - 26; సీరమ్ క్రియాటిన్ -1; టోటల్ బైలురూబిన్ - .6, ఎస్జీఓటీ- 44; ఎస్‌జీపీటీ - 20; ఆల్కలైన్ - 75; సోడియం - 150; పొటాషియం - 5.1; క్లోరైడ్స్ - 106; బైకార్బనేట్స్ - 13 చొప్పున ఉన్నాయి. అంతకుముందు తీసుకున్న ర్యాండమ్ బ్లడ్ సుగర్ విలువలు సరిగా రావని, అందుకే ఫాస్టింగ్ బ్లడ్ సుగర్ పరీక్ష చేశామని డాక్టర్ రమేశ్ వివరించారు.