breaking news
M.D ahmad
-
విజేతలు అహ్మద్, సవిత
జింఖానా, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా క్యారమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో ఎండీ అహ్మద్, మహిళల విభాగంలో సవితా దేవి విజేతలుగా నిలిచారు. ఖమ్మంలోని జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహించిన ఈ పోటీల్లో బుధవారం జరిగిన పురుషుల విభాగం ఫైనల్లో అహ్మద్ 22-15, 25-7, 27-13తో నవీన్‌పై విజయం సాధించాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్స్‌లో అహ్మద్ 25-20, 14-25, 25-4తో దినేష్ బాబుపై, నవీన్ 21-4, 10-25, 25-22తో వసీమ్‌పై గెలుపొందారు. మహిళల విభాగం ఫైనల్లో సవిత 18-20, 22-9, 25-15తో పద్మజపై నెగ్గి టైటిల్‌ని కైవసం చేసుకుంది. వెటరన్ విభాగంలో మార్టిన్ మెనెజెస్ 25-6, 25-17తో మోహన్ మురళిపై గెలిచి టైటిల్ సాధించాడు. విజేతలకు డీఎస్పీ పి. బాలకృష్ణా రావు ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూబ్లీ ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి ఎం. వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
సింగిల్స్ చాంప్ అహ్మద్
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా క్యారమ్స్ చాంపియన్‌షిప్‌లో ఎండీ అహ్మద్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అహ్మద్ 25-12, 11-25, 22-12తో వసీమ్‌పై నెగ్గాడు. నాలుగో బోర్డ్ చివరలో వసీమ్ 12-11తో ఆధిక్యంలో నిలవగా... అహ్మద్ చక్కటి ఆట తీరుతో ప్రత్యర్థిని నిలువరించాడు. తర్వాతి గేమ్‌లో అహ్మద్ 11-25తో ఓటమి చవిచూసినప్పకీ, మూడో గేమ్‌లో తిరిగి పుంజుకుని 22-12తో గెలుపు దక్కించుకున్నాడు. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో అహ్మద్ 18-10, 23-6తో సాయిబాబాను, వసీమ్ 25-5, 19-12తో రమేష్‌ను ఓడించారు. మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన పోటీలో రమేష్ 25-5, 25-17తో సాయిబాబాపై గెలుపొందాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో సవితాదేవి 25-0, 25-5తో శ్వేతపై గెలిచి టైటిల్‌ను సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో సవితాదేవి 25-0, 25-0తో శ్రీవాణిపై, శ్వేత 10-24, 25-0, 25-6తో మౌనికపై గెలిచారు. మూడో స్థానం కోసం జరిగిన పోరులో శ్రీవాణి 25-15, 25-10తో మౌనికపై విజయం సాధించింది.