breaking news
Maulana abulkalam Azad birthday
-
మౌలానా అబుల్ కలామ్‌కు వైఎస్ జగన్ నివాళులు
సాక్షి, హైదరాబాద్ : స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి (నవంబర్ 11) సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఘన నివాళులు అర్పించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, పాత్రికేయుడిగా మౌలానా కనబర్చిన జాతీయవాద స్ఫూర్తి ఎంతో గొప్పదని జగన్ కీర్తించారు. మౌలానా జయంతి అయిన నవంబర్ 11ను ‘నేషనల్ ఎడ్యుకేషన్ డే’ గా జరుపుకొంటున్న సంగతిని గుర్తుచూస్తూ.. ఆ మహానుభావుడి ఆదర్శాలను నేటి సమాజమంతా అనుసరించాల్సిన అవసరం ఉందని జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన చేశారు. ఆజాద్ ఆయన కలం పేరు : మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1988, నవంబర్ 11న మక్కాలో జన్మించారు. తల్లిదండ్రులు ఖైరుద్దీన్ అహమ్మద్, ఆలియా బేగమ్‌లు హజ్ యాత్రలో ఉండగా ఆజాద్ పుట్టారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో ఆజాద్ తన తాతగారి(అమ్మవాళ్ల నాన్న) ఇంట్లో(ఢిల్లీ) పెరిగారు. స్వాతంత్ర్య సమరంలో చురుకుగా పాల్గొన్న ఆయన.. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. దాదాపు 10 సంవత్సరాలపాటు జైలుశిక్షను కూడా అనుభవించారు. భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రిగా 11 ఏళ్లపాటు పనిచేశారు. విద్యారంగానికి మౌలానా చేసిన సేవలకు గుర్తుగా ఆయన జయంతి అయిన నవంబర్ 11ను ‘నేషనల్ ఎడ్యుకేషన్ డే’గా జరుపుతాం. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలుపేరు 'మొహియుద్దీన్ అహ్మద్'. 'అబుల్ కలాం' అనేది ఆయన బిరుదు. ఇక 'ఆజాద్' ఆయన కలం పేరు. 1958 ఫిబ్రవరి 22 న మౌలానా పరమపదించారు. -
పడో ఔర్ ఆగే బడో : ఎంపీ
నల్లగొండ రూరల్ : పడో ఔర్ ఆగే బడో(చదువుకోండి.. ముందుకు దూసుకెళ్లండి) అని భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్ ముస్లింమైనార్టీలకు సూచిం చారు. మంగళవారం నల్లగొండలోని స్టార్‌ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన మౌలానా అబుల్‌కలాం ఆజాద్ జయంతి సభలో ఆయన మాట్లాడారు. బాగా చదువుకుంటే కలెక్టర్, ఇంజినీర్, డాక్టర్లు కావచ్చని.. బాగా ఆడితే సానియా మీర్జాలా మంచి క్రీడాకారులుగా ఎదగవచ్చన్నారు. అమ్మాయి చదివితే ఇంటికి వెలుగని, అబ్బాయి చదివితే ఒక్కరికే వెలుగన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ప్రభుత్వం ముస్లింల సంక్షేమం కోసం 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తుందన్నారు. వక్ఫ్‌భూముల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మౌలనా అబుల్ కలాం ఆజాద్ స్వేచ్ఛా స్వాతంత్య్రం కోసం పనిచేశారన్నారు. కలెక్టర్ టి. చిరంజీవులు మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మక్కాలో జన్మించినా భారత స్వాతంత్య్ర పోరాటంలో పనిచేశారన్నారు. మతపరంగా భారత్‌ను విడదీయం ఇష్టపడని వ్యక్తి అని పేర్కొన్నారు. అతని మరణానంతరం కూడా ప్రభుత్వం భారత రత్న ఇచ్చిందని తెలిపారు. ముస్లిం మైనార్టీల కోసం ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులు, పలువురు ముస్లిం మైనార్టీలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్రీరాములు, ఏడీ సిరాజుల్లా, ఆర్డీఓ జహీర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, దుబ్బాక నర్సింహారెడ్డి, ఫయీజ్‌ఖాన్, అఫాన్‌అలీ, మొయినుద్దీన్, ఫరీద్, ఖాజా ఖుత్బుద్దీన్, అహ్మద్ కలీం, డీఈఓ విశ్వనాథరావు, జమాల్, జియాఉద్దీన్, సలీం, ముంతాజ్ అలీ, తదితరులు పాల్గొన్నారు.