breaking news
master plans
-
పట్టణ ప్రణాళికలు రెడీ!
సాక్షి, హైదరాబాద్: కొత్త పురపాలికలకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రణాళికలను రెడీ చేస్తోంది. ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరగడానికి దోహదపడే మాస్టర్ప్లాన్లకు తుదిరూపునిస్తోంది. నూతనంగా ఏర్పడ్డ 68 పురపాలికల్లో.. 23 మున్సిపాలిటీలకు మాస్టర్ప్లాన్లను తయారు చేస్తోంది. ఇందులో ఇప్పటికే పెద్దపల్లి పురపాలిక ముసాయిదా మాస్టర్ ప్లాన్‌కు సర్కారు ఆమోదముద్ర వేసింది. మరో ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన ముసాయిదాలను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పురపాలక శాఖ పంపింది. పట్టణీకరణ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రూపొందించే ఈ మాస్టర్ ప్లాన్‌లో భూ వినియోగంపై స్పష్టతనిస్తోంది. రహదారులకు పెద్దపీట! పట్టణాభివృద్ధికి దిక్సూచిగా చెప్పుకునే మాస్టర్‌ప్లాన్‌లో జోనల్ రెగ్యులైజేషన్‌ను విధిగా పాటించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టకుండా బ్రేక్ పడనుంది. నిర్దేశిత జోన్లో మాత్రమే నివాస భవనాలకు అనుమతులు జారీ చేయనున్నారు. రెసిడెన్షియల్ జోన్లో మాత్రమే ఈ కట్టడాలను అనుమతిస్తారు. అలాగే కమర్షియల్ జోన్లో వాణిజ్య కార్యకలాపాలను, రిక్రియేషన్/కన్జర్వేషన్ జోన్‌ను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. వీటితోపాటు మాస్టర్‌ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్‌తోపాటు ప్రజావసరాలు, మౌలిక వసతులు, రహదారుల విస్తరణపై కూడా స్పష్టత నివ్వనున్నారు. ఈ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగానే ఆయా మున్సిపాలిటీల్లో అనుమతులు జారీ చేయనున్నారు. ప్రభుత్వ పరిశీలనకు ఎనిమిది ఇప్పటికే పెద్దపల్లి మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఓకే చెప్పగా.. మహబూబాబాద్, భూపాలపల్లి, అందోల్–జోగిపేట్, దేవరకొండ, కొల్లాపూర్, నాగర్‌కర్నూలు, అచ్చంపేట పురపాలికల ముసాయిదా మాస్టర్ప్లాన్లు ప్రభుత్వ పరిశీలనకు వెళ్లాయి. ఇవిగాకుండా.. బాదేపల్లి, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక, కల్వకుర్తి, కోదాడ, హుజూర్నగర్, ఐజ, నర్సంపేట, పరకాల, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లెందు, బెల్లంపల్లి, మణుగూరు మున్సిపాలిటీల మాస్టర్ప్లాన్లను డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ) చకచకా రూపొందిస్తోంది. వీటన్నింటికి త్వరితగతిన ఆమోదముద్ర వేయించడం ద్వారా ఆగస్టు నుంచి మనుగడలోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇదిలావుండగా, ఇప్పటికే వివిధ నగరాభివృద్ధి సంస్థలు మాస్టర్ప్లాన్లను అమలు చేస్తున్నాయి. తాజాగా ఏర్పడ్డ మున్సిపాలిటీల్లో అధికశాతం వీటి పరిధిలోకి వస్తున్నందున అమలులో ఉన్న మాస్టర్ప్లాన్లే వీటికి వర్తించనున్నాయి. -
అమరావతి డిజైన్లపై పవన్ వ్యాఖ్యలు
-
మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాదు: పవన్
సాక్షి, అమరావతి : నవ్యాంధ్ర రాజధానిపై తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ ఫైనల్‌ది కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ఆదివారం ఉదయం ఉద్దండ్రాయుని పాలెం రైతులను కలిసిన పవన్.. ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మీడియాతో మాట్లాడారు. ‘ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే అషామాషీ వ్యవహారం కాదు. అందుకు రెండు దశాబ్దాలకు పైగానే సమయం పట్టొచ్చు. అన్ని పార్టీలు రాజధానిపై కూర్చుని మాట్లాడాలి. అమరావతి కోసం ఇప్పుడీ ప్రభుత్వం చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ తుదిదేం కాదు. అందుకోసం మరిన్ని చర్చలు, మార్పులు జరగాల్సి ఉంది. పార్టీలు, మేధావుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. రాత్రికి రాత్రే పెద్ద నగరం కట్టాలన్న ఆకాంక్ష ప్రభుత్వాలకు ఉంటే ఉండొచ్చు, కానీ, అందుకోసం ప్రజలను దీర్ఘకాలిక ఇబ్బందులకు గురి చేయటం సరికాదు’ అని పవన్ పేర్కొన్నారు. ఇక సింగపూర్ తరహా రాజధాని ఏర్పాటు అంటే.. పాలన కూడా అదే రీతిలో ఉంటేనే సాధ్యమౌతుందని పవన్ పేర్కొన్నారు. అమరావతిలో కుల గొడవలు ఎక్కువగా ఉన్నాయని.. విశ్వనగరం నిర్మించాలంటే అందుకు విశాలమైన మనసులు కావాలని, అప్పుడే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. రాజధాని రైతుల సమస్యలపై ఉన్నతస్థాయి విచారణ కమిటీగానీ.. జ్యుడీషియల్ విచారణగానీ జరగాలని కోరారు. ప్రభుత్వంపై పోరాటం తన అభిమతం కాదని... కేవలం పాలసీలకు వ్యతిరేకంగా తాను పోరాటం చేస్తానన్నారు. తన దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారాలు లేవని.. సమస్యలు ఏవైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని పవన్ స్పష్టత ఇచ్చారు. ఒకవేళ అప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోతే ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులను ప్రజల ముందు నిలదీస్తానని పవన్ చెప్పారు. -
మాస్టర్ ప్లాన్ల విషయంలో సర్కార్ సీరియస్
సింహాచలం, న్యూస్‌లైన్: ప్రధాన దేవాలయాల్లో జరిగే అభివృద్ధి పనులకు సంబంధించి చేసిన మాస్టర్ ప్లాన్లు దీర్ఘకాలం అప్రూవల్‌కి నోచుకోక పోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ చీఫ్ ఇంజినీర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని గురువారం ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. ప్రముఖ దేవాలయాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నా చాలా దేవాలయాల మాస్టర్ ప్లాన్లు అప్రూవల్ కాలేదన్నారు. ఇందులో దేవాలయాల అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. ఈనెల 20న ప్రధాన దేవాలయాల ఈఓలతో హైదరాబాద్‌లోని దేవాదాయాశాఖ కమిషనర్ కార్యాలయంలో దీనిపై చర్చ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాన్ లేకుండా పనులు చేపడుతుండడంతో ఖర్చు పెరుగుతోందని, ఈఓలు మారినప్పుడల్లా ప్లాన్ మారిపోతోందన్నారు. సింహగిరి దివ్యక్షేత్రం ప్లాన్ కూడా ఆమోదానికి నోచక పోవడంపై స్పందిస్తూ త్వరలోనే ఆమోదం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా సీఈ కోటి తులసి పూజల్లో పాల్గొన్నారు. ఏఈఓ ఆర్.వి.ఎస్.ప్రసాద్ ఆయనకు ప్రసాదం అందజేశారు. దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులు శ్రీనివాసరాజు, మల్లేశ్వరరావు, రాంబాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు.