breaking news
Massive violence erupts
-
‘కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారు’
-
‘కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టారు’
న్యూఢిల్లీ : కావేరి జలవివాదంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ స్పందించారు. కన్నడిగులను తమిళులే రెచ్చగొట్టరాని ఆయన మంగళవారమిక్కడ అన్నారు. కన్నడిగులు, వారి ఆస్తులపై తమిళులు దాడులు చేశారన్నారు. అయితే ప్రతి ఒక్కరూ శాంతి, సమన్వయం పాటించాలని సదానంద సూచించారు. తమకే నీళ్లు లేవని, ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. హింసతో సమస్య పరిష్కారం కాదని, ఇరు రాష్ట్రాలు సమన్వయం పాటించాలన్నారు. కావేరిలో ఈసారి వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందుకే తమిళనాడుకు కర్నాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయడం లేదని సదానంద గౌడ అన్నారు. 40 శాతం తక్కువ వర్ష పాతంతో కేవలం రెండు, మూడు రిజర్వాయర్లలోనే తాగు నీటి లభ్యత వుందని ఆయన గుర్తు చేశారు. గతంలో ఎక్కువ వర్షాలు కురిసినపుడు ఈ పరిస్థితి లేదన్నారు. కేంద్రం ట్రిబ్యునల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని సదానంద అన్నారు. కాగా కావేరి నదీ జలాల పంపిణీపై కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం మరింతగా ముదిరిపోయి హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. సోమవారం ఇరు రాష్ట్రాల్లోనూ.. అవతలి రాష్ట్రానికి చెందిన ఆస్తులు, పౌరులు లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. -
బెంగళూరులో కొనసాగుతున్న 144 సెక్షన్..
బెంగళూరు : కావేరి జల వివాదంపై అట్టుడుకుతున్న కర్ణాటకలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు మోహరించాయి. ముందు జాగ్రత్త చర్యగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్లతో పాటు అదనంగా 15వేలమంది పోలీసులు, అధికారులు విధుల్లో నిమగ్నమయ్యారు. బెంగళూరుతో పాటు మండ్యా, మైసూరు నగరాలతో పాటు.. కర్ణాటకలో కావేరి నదిపై గల 4 జలాశయాల చుట్టుపక్కల 144 సెక్షన్ కింద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. అలాగే మండ్యాలో ఈ నెల 17వరకూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. మరోవైపు బెంగళూరులో మెట్రో సర్వీసులను నిలిపివేశారు. కాగా ఆందోళనకారులు నిన్న 270 వాహనాలను తగులబెట్టారు. అల్లర్లలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఇక తాజా పరిణామాలపై చర్చించేందుకు కర్ణాటక మంత్రివర్గం మంగళవారం అత్యవసరంగా సమావేశం కానుంది.