breaking news
marrigage invitation
-
పెళ్లికి రండి.. ఎన్నికల ఫలితాలు చూడండి
గుత్తికొండ (పిడుగురాళ్ల రూరల్): తన పెళ్లి చిరకాలం గుర్తుండిపోవాలని భావించిన ఓ యువకుడు ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆరోజు తమ అభిమాన నాయకుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపొందబోయే రోజు అని, ఆరోజు అయితే ఈ జన్మలో మరచిపోలేని తీపి జ్ఞాపకంగా ఉండిపోతుందని భావించి అదేరోజు వివాహం ఖరారు చేసుకున్నాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన చినసుబ్బారావు, రావమ్మల కుమారుడు రామకోటయ్యకు మాదల గ్రామానికి చెందిన మాదగిరి శ్రీనివాసరావు, తులసి దంపతుల కుమార్తె వెనీలాతో 23న వివాహం నిశ్చయించారు. అదేరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనుండటంతో వివాహ వేడుకలో టీవీలు ఏర్పాటుచేసి ఫలితాలు అందరికీ కనిపించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. అదే విషయాన్ని బంధువులకు పెళ్లి కార్డులు ఇస్తూ కుటుంబసభ్యులు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. పెళ్లికి రండి.. ఎన్నికల ఫలితాలు కూడా అక్కడే టీవీల్లో చూసేలా ఏర్పాటు చేస్తున్నాం.. అంటూ చెబుతున్నారు. దీంతో పెళ్లికి వెళ్లినట్లు ఉంటుంది. ఫలితాలు చూసినట్లు ఉంటుందని భావించిన బంధువులు తప్పకుండా పెళ్లికి వస్తామని చెబుతున్నట్లు పెళ్లికొడుకు తండ్రి చిన సుబ్బారావు చెబుతున్నారు. -
‘నా పెళ్లికి వచ్చేవారు మోదీకి ఓటు వేయండి’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నాయకులపై తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యక్తంచేస్తూ ఉంటారు. ప్రధాని నరేంద్ర మోదీకి వీరాభిమాని అయిన ఓ నవ వరుడు మాత్రం వినూత్న రీతిలో తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ‘‘ఫిబ్రవరి 21న నా వివాహం. వివాహానికి వచ్చే వారు ఎలాంటి బహుమతులను తీసుకురావద్దు. వాటికి బదులుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటు వేసి.. నరేంద్ర మోదీని ప్రధానిగా మరోసారి గెలిపించండి అంతే చాలు’’ అంటూ తన వివాహ పత్రికపై అచ్చువేయించాడు. ఓట్ ఫర్ మోదీ అని బీజేపీ ఎన్నికల చిహ్నమైన కమళం గుర్తును సైతం పత్రికపై ముద్రించాడు. దీన్ని చూసిన వారంతా ఒక్కింత ఆశ్చర్యానికి గురైయ్యారు. తనకు మోదీ అంటే ఎంతో అభిమానమని, గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టారని 27 ఏళ్ల ముఖేష్ రావు చెప్పుకొస్తున్నారు. మోదీ స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్న ఆఫీసులో ప్రతి నెల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మరోసారి మోదీ అధికారంలోని రావాలని తాను కోరుకుంటున్నాననీ, ఆయన విజయానికి తన వంతుగా ఈవిధంగా కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. మోదీ నాయకత్వలోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. శంషాబాద్‌కు చెందిన ముఖేష్ రావు టీఎస్ జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్కు మద్దుతుగా నిలవడం విశేషం. ఇటీవల గుజరాత్లో కూడా ఓట్ ఫర్ మోదీ అంటూ ఓ జంట వివాహ పత్రికపై ముద్రించి మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. -
ఇదే.. మా ఆహ్వానం
నిన్నటి ఆనందం... నేటి కల... రేపటి జీవితం....పెళ్లి. విడి విడిగా పుట్టి, విడి విడిగా పెరిగి ఒకటిగా మారాలనుకుంటున్న రెండు జీవితాలు ఆ శుభవేళకు బంధుమిత్రులు రావాలని కోరుకుంటున్నాయి. ఆ క్రమంలో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలను సమర్పిస్తున్నాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్ తయారీ కోసం ఇంకా కార్డులు, బోర్డులు వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో ఇన్వైట్లు గురించి మీరు తెలుసుకోవాల్సిందే. - ఓ మధు ‘ఇలా జరుగుతుంది అనుకోలేదు.. కానీ జరిగింది. పలకరింపు నుంచి గంటలతరబడి మాటలు.. అలా మాట్లాడుతూ... ప్రేమలో ఎప్పుడు పడిపోయామో తెలియనేలేదు. షాపింగ్‌లు, కోపాలు, బుజ్జగింపులు, ప్రపోజ్ చేసుకోవటం జరిగిపోయింది. ఫలాన తేదీన మా పెళ్లికి రండి’ అంటూ ఇద్దరూ ఒక్కటిగా పలికే ఆహ్వానం.. (ఒకటిన్నర నిమిషాల్లో ఒక్క మాట కూడా చెప్పకుండా తమ పెళ్లికి దారిచూపిన ప్రేమను పరిచయం చేస్తూ పెళ్లికి ఆహ్వానం పలికే వీడియో) ‘అందమైన రంగులతో మా జీవితాన్ని కలర్‌ఫుల్ చేసుకోవాలని ఆశిస్తున్నాం... ఈ నెల ఫలానా తేదీ తప్పుకుండా రండి.. ఇదే మా పెళ్లికి ఆహ్వానం’ (1 నిమిషం నిడివితో క్రియేటివ్ వీడియో ఇన్విటేషన్). మచ్చుకు ఇవి కొన్నే.. ఇంతకన్నా కనువిందు చేసే వీడియో వెడ్డింగ్ ఇన్వైట్లు సిటీలో సందడి చేస్తున్నాయి. తమ పెళ్లికి బంధుమిత్రులను సాదాసీదాగా ఆహ్వానించడం కాదు... వారిలో తమ జంటపై క్యూరియాసిటీ పెంచి తప్పనిసరిగా పెళ్లికి వచ్చేలా చేయడానికి కూడా ఈ వీడియోలను వధూవరులు ఉపయోగించుకుంటున్నారు. ‘చిత్ర’ పత్రం... ఆసక్తికరం... వధూవరులు ప్రాధాన్యమివ్వాలనుకున్న అంశం ఆధారంగా ఈ వీడియో థీం ఎంచుకుంటారు. ఉదాహరణకు ప్రేమ వివాహం అయితే మొదటిసారి కలుసుకున్న చోటు నుంచి, వారి ప్రేమ జర్నీలో ముఖ్యమైన సంఘటనలు జరిగిన ప్రాంతాలు ఈ వీడియో తియ్యడానికి అనువైన ప్రదేశాలు ఎంచుకుంటుంటారు. అలా కుదరకపోతే, అందమైన చోటుకి వెళ్లి వారి కథను అందంగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఇలా రూపుదిద్దుకుంటాయి... అయితే ఈ వీడియోలు అన్నీ ప్లాన్ చేసి, స్క్రిప్ట్ ప్రకారం కాకుండా కపుల్‌కి కావలసిన ప్రైవసీ ఇచ్చి, కొంత సర్ప్రైజ్తో వీటిని రూపొందిస్తారు. అలా ఈ ఇన్వైట్ వీడియో మొదటిసారి చూసుకున్నప్పుడు కపుల్స్ ముందుగా థ్రిల్ అవుతుంటారు. ఇక షేర్ చేసుకున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అయితే వీడియో చూసిన నెక్ట్స్ మూమెంట్ నుంచే వారిని బ్లెస్ చేయటం మొదలు పెట్టేస్తారు. కపుల్ ఎలాంటి రిలేషన్ షేర్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో ముఖ్యమైన ఎలిమెంట్. ఎవరూ లేనప్పుడు ఆ కపుల్ షేర్ చేసుకునే హ్యాపీ మూమెంట్స్ ఈ వీడియోకి మూలం. దాని చుట్టూ చిన్న కథతో ఈ వీడియోలు రూపొందిస్తారు. వారి ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ నేచురల్‌గా అందిపుచ్చుకుంటారు. ఇక ఈ వెడ్ ఇన్వైట్ వీడియోలను వెడ్డింగ్ కవర్ చేసే వాళ్లతోనే చేయించుకుంటుంటారు, లేదా విడిగా కూడా చేయించుకోవచ్చు. లైటింగ్ ముఖ్యం... ఇప్పుడు చాలా మంది కపుల్స్ వీడియో ఇన్వైట్లను ప్రిఫర్ చేస్తున్నారు. వీటిని షూట్ చేసేందుకు చక్కటి ప్లేస్‌తో పాటు, అనుకూలమైన వాతావరణం, లైటింగ్ చాలా ముఖ్యం. అందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఉండే లైట్ ప్లెజెంట్‌గా, పర్ఫెక్ట్గా ఉంటుంది. - శ్రీనివాస్, వెడ్డింగ్ వీడియోగ్రాఫర్ చక్కటి అనుభూతి... ఫస్ట్‌టైం ఇలాంటి వెడ్డింగ్ వీడియో చూసినప్పుడు చాలా కొత్తగా, ఇన్నోవేటివ్‌గా అనిపించింది. ఎనిమిదేళ్ల లవ్ స్టోరీని ఒకటిన్నర నిమిషాల్లో స్టాప్ మోషన్లో చూసుకోవటం, అది ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవటాన్ని బాగా ఎంజాయ్ చేశాం. అచ్చం అలాగే నా పెళ్లికి కూడా వీడియో ఇన్వైట్ తప్పకుండా చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. - అంజలి, బుల్లితెర నటి