breaking news
marri laxmanreddy Institute of Technology
-
సాక్షి ప్రీమియర్ లీగ్ 2022 విజేతగా ఎంఎల్ఆర్ఐటి
సాక్షి, హైదరాబద్: సాక్షి ప్రీమియర్ లీగ్ మూడవ ఎడిషన్ (2022) పోటీలు సందడిగా ముగిశాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో డిస్ట్రిక్ట్, రీజియన్, స్టేట్ లెవెల్స్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 649 జట్లు పాల్గొన్నాయి. తెలంగాణలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నిర్వహించిన ఈ టోర్నీలో (సీనియర్ విభాగం) మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటి), హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. స్థానిక ఎంఎల్ఆర్ఐటి క్రికెట్ గ్రౌండ్స్‌లో గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎంఎల్ఆర్ఐటి జట్టు వాగ్దేవి డిగ్రీ కళాశాల (మంచిర్యాల) జట్టుపై విజయం సాధించి సాక్షి ప్రీమియర్ లీగ్ 2022 టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. టైటిల్ విజేతకు ట్రోఫీతో పాటు 25000 నగదు బహుమతి లభించింది. ఇదే టోర్నీ జూనియర్ విభాగం విజేతగా గౌతమ్ జూనియర్ కళాశాల (ఈసీఐఎల్) జట్టు నిలిచింది. ఫైనల్లో గౌతమ్ జూనియర్ కాలేజీ జట్టు.. కేఎల్ఎన్ జూనియర్ కళాశాల (మిర్యాలగూడ) జట్టుపై విజయం సాధించింది. ఎస్పీఎల్ 2022 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎంఎల్ఆర్ఐటి సెక్రటరీ మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎంఎల్ఆర్ఐటి చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అవినాష్, సాక్షి సీజీయం కమల్ కిషోర్ రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. -
సంప్రదాయాల సందడి
దుండిగల్: విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సందడి చేశారు.. ర్యాంప్ వాక్‌తో ఆహుతులను ఉర్రూతలూగించారు..కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఎంఎల్ఆర్ఐటి) కళాశాలలో గురువారం ట్రెడిషనల్ డే ఘనంగా జరిగింది. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి మమతరెడ్డి, ప్రిన్సిపాల్ కె.భాస్కరారెడ్డి, రాధికదేవి, పరంకుశం, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు.