breaking news
Manyam Dheerudu Movie
-
6 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
ఈ వీకెండ్ లో పలు కొత్త సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. సరే వాటి సంగతి పక్కనబెడితే ఓ తెలుగు మూవీ.. పెద్దగా హడావుడి లేకుండానే దాదాపు ఆరు నెలల తర్వాత స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఏ మూవీ? ఎందులో ఉందనేది చూద్దాం.స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు కథతో ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. వాటిలో సూపర్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు(1974) ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. కొన్నిరోజుల క్రితం 'ఆర్ఆర్ఆర్'లోనూ రామ్ చరణ్ అల్లూరి గెటప్ లో కనిపించి అలరించాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)ఇక అల్లూరి జీవిత కథతో తీసిన ఓ తెలుగు సినిమా 'మన్యం ధీరుడు'. గతేడాది సెప్టెంబరులో ఇది థియేటర్లలో రిలీజైంది. కానీ ఈ చిత్రం ఒకటి ఉందని కూడా తెలియదు. అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ.. అల్లూరిగా నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఇప్పుడు 'మన్యం ధీరుడు' సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే అద్దె విధానంలో అందుబాటులో ఉంది. రెండు రోజుల క్రితం ఇలానే 'తల', 'జాతర' మూవీస్ ఇదే ఓటీటీలోకి వచ్చాయి.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి క్రేజీ మిస్టరీ థ్రిల్లర్.. కేవలం తెలుగులో) -
మన్యం ధీరుడు మూవీ.. ఆ పాటకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్!
మన్యం ధీరుడు సినిమాలోని "నమోస్తుతే నమోస్తుతే భారత మాతా" అనే దేశభక్తి గీతం ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యతను సొంతం చేసుకుంది. ఈ సినిమా కథానాయకుడైన ఆర్వీవీ సత్యనారాయణ స్వయంగా స్వరకల్పన చేసి పాడడమే కాకుండా హిమాలయాల్లో చిత్రీకరించారు. అందుకే ఈ పాట ప్రత్యేకతను సంతరించుకుంది.ఇటీవల ఈ సాంగ్‌ను థాయిలాండ్,మలేషియా, బ్యాంకాక్, మయన్మార్ లాంటి దేశాల్లోని ప్రవాస భారతీయులు ప్రశంసిస్తున్నారు. త్వరలోనే అమెరికాలో జరిగే తానా సభల్లో ఈ పాట పాడనున్నారు. ఆ తర్వాత జర్మనీలో కూడా ఈ సాంగ్ పాడబోతున్నట్లు విశాఖకు చెందిన శేఖర్ ముమ్మోజీ బృందం తెలిపారు. కాగా.. ఈ పాటకు తుంబలి శివాజీ సాహిత్యాన్నందించారు. మన దేశ ఔన్యత్యాన్ని చాటి చెప్పే ఈ అద్భుతమైన పాటకు మరింత ఆదరణ దక్కాలని ఆశిద్దాం. -
'మన్యం ధీరుడు' సినిమా రివ్యూ
బ్రిటీష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈయన జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా, వెండితెరపై చూసినా ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. అలాంటి పాత్రలో రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు. మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకున్నారో చూసేద్దాం..కథబ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన అల్లూరి సీతారామరాజు వారి తుపాకీ గుళ్లకు బలై నేలకొరిగారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి... బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందించారు? సీతారామరాజు వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజలను ఎలా మేలుకొల్పాడు? పేద ప్రజలకు ఉన్న మద్యం సేవించడం తదితర అలవాట్లను ఎలా మాన్పించి వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.విశ్లేషణటెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు విప్లవ వీరుల కథలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గతంలో అల్లూరి సీతారామరాజు జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులు పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం... వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ఆడియన్స్‌కు గూస్ బమ్స్ తెప్పిస్తాయి.అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదిరించడం, బ్రిటీష్ వారి మీద పోరాటం చేసే సన్నివేషాలు మాస్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. సత్యనారాయణ రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ స్పష్టంగా వుంది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా వున్నా... సెకెండాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా పరుగులు పెడుతుంది. జబర్దస్థ్ అప్పారావుతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేసినా... ఓ యువజంట ప్రేమాయణం గురించి కథకు అవసరం లేకున్నా బలవంతంగా చొప్పించారనిపిస్తుంది.మద్యపానం సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే స్వాతంత్రం భారతదేశానికి ఎంత అవసరమో... బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిన మనం దుక్కి దున్నితే... వాళ్లకు ఎందుకు పన్ను కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అంశాలను బాగా చూపించారు.రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం కూడా నేర్చుకుని నటించడం విశేషం. బ్రిటీష్ వారిని ఎదిరించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ చివరి దాకా బాగా నటించారు.జబర్దస్థ్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా... నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా వుంటుందో చాలా నేచురల్‌గా వేశారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రాంతాల అందాలను కెమెరాలో బంధించారు. అల్లూరి సీతారామరాజు ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. రెండుగంటలలోపే నిడివి వుండటం ఈ సినిమాకి ప్రధాన బలం. డైరెక్టర్ కథను బాగానే డీల్ చేశారు. -
‘మన్యం ధీరుడు’ వచ్చేస్తున్నాడు!
నరేష్ డెక్కల దర్శకత్వం వహించిన తాజా చిత్రం మన్యం ధీరుడు’. ఆర్ వి వి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించాడు. ఈ చిత్రం కోసం భారీ ఖర్చుతో ఒక ఊరినే నిర్మించి అక్కడ షూట్ చేస్తున్నారట. అల్లూరి సీతారామరాజు నిజ రూప చరిత్రను వెండి తెరపై అవిష్కరించడానికి నటులు ఆర్ వి వి సత్యనారాయణ గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు విద్యలో శిక్షణ తీసుకున్నారట. (చదవండి: తెలుగు ప్రేక్షకులకు ఇన్నాళ్లకు కాస్త గౌరవం)మన్యం ధీరుడు చిత్రంలో యదార్ధ సన్నివేశాలు, యదార్ధ సంఘటనలు ప్రజలకి అందించాలనే సంకల్పంతో ఆర్ వి వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. బానిస సంకెళ్ళు తెంచుకుని బ్రిటీష్ తెల్ల దొరల పాలనకు చరమగీతం పాడే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. పవన్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.