breaking news
Manjuvarayar
-
అసురన్ మొదలెట్టాడు
ధనుష్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘అసురన్’. వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మంజు వారియర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శనివారం మొదలైంది. అలాగే ఈ సినిమా కొత్త లుక్స్‌ను కూడా విడుదల చేశారు చిత్రబృందం. ఇక్కడున్న తాజా పోస్టర్‌ను గమనిస్తే... బ్లాక్ అండ్ వైట్ కాలానికి తీసుకెళతారేమో అనిపిస్తోంది కదూ. సినిమాలో ఇది ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌గా వచ్చే అవకాశం ఉందని టాక్. ధనుష్–వెట్రిమారన్ కాంబినేషన్లో వస్తున్న ఈ నాలుగో చిత్రం ఇది. ఇంతకుముందు ‘ఆడుకాలమ్, పొల్లాదవన్, వడచెన్నై’ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంగతి ఇలా ఉంచితే... సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో ధనుష్ ఇటీవల రెండు సినిమాలు కమిట్ అయ్యారు. ఈ సినిమాలు కూడా ఈ ఏడాదే సెట్స్‌పైకి వెళ్తాయన్నది కోలీవుడ్ టాక్. -
కోలీవుడ్‌కు మంజువారియర్
తమిళసినిమా: ప్రముఖ మలయాళ నటి మంజువారియర్ కోలీవుడ్‌కు పరిచయం కానున్నారు. 1995లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ ప్రౌఢ వయసు నటి ఇన్నాళ్లకు తమిళ సినిమాలో నటించే అవకాశం పొందడం నిజంగా విశేషమే. మాలీవుడ్ నటుడు దిలీప్‌ను వివాహమాడి నటనకు దూరం అయిన మంజువారియర్‌కు ఒక కూతురు కూడా ఉంది. కాగా మనస్పర్ధల కారణంగా నటుడు దిలీప్ నుంచి విడాకులు పొందిన ఈమె మళ్లీ నటనపై దృష్టి సారించారు. హౌ ఓల్డ్ ఆర్యూ చిత్రంతో రీ ఎంట్రీ అయిన మంజువారియర్ మళ్లీ హిట్ జాబితా హీరోయిన్లలో చేరారు. నటి జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం హౌ ఓల్డ్ ఆర్యూ చిత్రానికి రీమేక్నేన్నది గమనార్హం. కాగా ఈరం చిత్రంతో దర్శకుడిగా మోగాఫోన్ పట్టిన అరివళగన్ ఆ తరువాత పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఆయన తెరకెక్కించిన కుట్రం–23 చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని అందించింది. ఆయన తాజా చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ సారి హీరోయిన్ ఇతివృత్తంతో కూడిన కథను హ్యాండిల్ చేయడానికి రెడీ అయ్యారు. సంచలన సన్నివేశాలతో కూడిన థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఇందులో నాయకిగా నటి నయనతారను నటింపజేయాలని ముందుగా భావించారట. అయితే ఆమె రూ.4 కోట్లు పారితోషికం డిమాండ్ చేయడం, అందకు ముందు నటించిన డోరా, తిరునాళ్, కాష్మోరా వంటి చిత్రాలు ఆశించిన విజయాలను సాధించక పోవడం వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మనసు మార్చుకున్నారని టాక్. కాగా తాజాగా తన చిత్ర నాయకి పాత్రకు మలయాళ సంచలన నటి మంజువారియర్ను ఎంపిక చేసుకున్నారని సమాచారం. చిత్ర షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్లో ప్రారంభం కానున్నట్లు తెలిసింది.