breaking news
manaiah
-
కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడని.. భర్తను చంపిన భార్య
సంగారెడ్డి: కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన భర్తను భార్య గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్‌లో బుధవారం అర్థరాత్రి చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌కు చెందిన మన్నే మాణయ్య (45), ఇందిర దంపతులకు కూతురు సుకన్య ఉంది. ఏడాది కిందట సుకన్య భర్త చనిపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మద్యానికి బానిసైన మాణయ్య ఇంట్లో ఉంటున్న కూతురిపై కన్నేశాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. బుధవారం అర్ధరాత్రి అతిగా మద్యం సేవించి భార్య, కూతురితో గొడవకు దిగాడు. గొడ్డలితో బెదిరిస్తూ కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. భార్య అడ్డుకున్నా వినలేదు. దీంతో మాణయ్య చేతిలో ఉన్న గొడ్డలిని లాక్కొని ఇందిర భర్తను నరికి చంపింది.ఘటన విషయం తెలుసుకున్న జోగిపేట సీఐ అనిల్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తల్లీకూతురు ఇద్దరూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. -
మంత్రి కడియం క్షమాపణ చెప్పాలి
ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాణయ్య హత్నూర: మహిళా ఉపాధ్యాయుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన దౌల్తాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయురాలని చూడకుండా అవమానించే విధంగా మాట్లాడిన మంత్రి కడియం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉపాద్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దౌల్తాబాద్ తెలంగాణతల్లి చౌరస్తా వద్ద 10వ తేదీ 10గంటలకు చేపట్టే నిరసన కార్యక్రమానికి మండలంలోని మహిళా ఉపాధ్యాయులు తరలిరావాలన్నారు.