breaking news
Malayalam actor Mohanlal
-
కొత్త ఏడాదిలో రెండు హిట్స్.. మరో సినిమా ప్రకటించిన మోహన్ లాల్
ఈ ఏడాది ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మలయాళ స్టార్ మోహన్ లాల్. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఆ తర్వాత తుడురుమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభన కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సైతం ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా ఇటీవలే విడుదలైన మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు.తాజాగా మరో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు. నా నెక్ట్స్ మూవీని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని.. ఈ ఆసక్తికర కొత్త అధ్యాయంలో భాగమైనందుకు గొప్పగా ఉందంటూ ట్వీట్ చేశారు. ఈ సినిమాకు ఎల్365 అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు.With immense joy, I announce my next film.Directed by Austin Dan Thomas,Written by Retheesh Ravi,And produced by Ashiq Usman under the banner of Ashiq Usman Productions.Grateful to be part of this exciting new chapter.#L365#AustinDanThomas#RetheeshRavi#AashiqUsman… pic.twitter.com/F3MGb1xeRG— Mohanlal (@Mohanlal) July 8, 2025 -
మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ రాజీనామా
హేమ కమిటీ రిపోర్ట్ మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటులు, డైరెక్టర్స్‌పై పెద్దఎత్తున ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ పెద్దలు చక్కదిద్దే పనిలో పడ్డారు. తాజాగా సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సైతం అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) మండిపడ్డారు. ఈ నివేదికపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్పై (AMMA) తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న మోహన్‌లాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కమిటీ సభ్యులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇప్పటికే ఈ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక విషయంలో సీఎం పినరయి విజయన్ పోలీసు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నివేదికపై దర్యాప్తు చేయడానికి ఏడుగురు సభ్యుల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా.. ఇప్పటికే దర్శకుడు రంజిత్ చలనచిత్ర అకాడమీకి రాజీనామా చేయగా.. నటుడు సిద్ధిక్ అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ పదవి నుంచి నుంచి వైదొలిగారు. -
నాలుగు కథలు.... ఒకటే ప్రపంచం
మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ‘మనమంతా’ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’, ‘సాహసం’ చిత్రాల ఫేమ్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. సాయిశివాని సమర్పణలో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి దీన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో సీనియర్ నటి గౌతమి కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘‘‘నాలుగు కథలు ఒకటే ప్రపంచం’ అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది. త్వరలోనే నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభిస్తాం’’ అని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: మహేశ్ శంకర్, సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్.