breaking news
Mahesh Pithiya
-
BGT 2023: స్మిత్‌ను 6 సార్లు అవుట్ చేశా! అశ్విన్ పాదాలకు నమస్కరిస్తే.. వెంటనే
BGT 2023 Mahesh Pithiya- Ravichandran Ashwin: గుజరాత్ యువ క్రికెటర్ మహేశ్ పితియా తన ఆరాధ్య బౌలర్ రవిచంద్ర అశ్విన్‌ను కలిశాడు. టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశూతో కలిసి ఫొటోలు దిగాడు. తనకు ఆదర్శప్రాయుడైన అశ్విన్ నుంచి ఆశీసులు అందుకున్నాననంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో బరోడా బౌలర్ మహేశ్ పితియా ఒక్కసారిగా స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే. అశూ డూప్లికేట్ టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మహేశ్‌తో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లు నెట్స్‌లో ప్రాక్టీసు చేయడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాదిరి బౌలింగ్ చేయగల మహేశ్ ఆసీస్ మేనేజ్మెంట్ ఆశ్రయించడం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దీంతో.. అశ్విన్ డూప్లికేట్ అంటూ అతడి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. ఇక ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీసులో తలమునకలయ్యాయి. స్మిత్‌ను ఆరుసార్లు అవుట్ చేశా ఈ సందర్భంగా మంగళవారం మహేశ్ పితియా అశ్విన్‌ను కలిశాడు. అశ్విన్‌ను పట్ల తనకున్న అభిమానం, ఆసీస్ జట్టుతో ప్రయాణంలో తన అనుభవాలు పంచుకున్నాడు. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘నెట్స్‌లో మొదటిరోజు స్టీవ్ స్మిత్‌ను కనీసం ఆరుసార్లు అవుట్ చేసి ఉంటా. ఈ రోజు నేను నా రోల్‌మోడల్ అశ్విన్ నుంచి ఆశీర్వాదాలు పొందాను. తనలాగే బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. నెట్స్‌లోకి వెళ్లేటపుడు నేను ఆయను కలిశాను. పాదాలకు నమస్కరించి ఆశీసులు అందుకున్నా. కోహ్లి బెస్టాఫ్ లక్ చెప్పాడు వెంటనే ఆయన నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. నేను ఆస్ట్రేలియన్లకు ఎలా బౌలింగ్ చేశానో అడిగితెలుసుకున్నాడు. పక్కనే విరాట్ కోహ్లి కూడా చిరునవ్వుతోనే నన్ను పలకరించాడు. నాకు బెస్టాఫ్ లక్ చెప్పాడు’’ అని మహేశ్ పితియా హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా.. ‘‘ఆస్ట్రేలియా జట్టుతో ప్రయాణం అద్భుతంగా సాగింది. ప్రధానంగా స్టీవ్ స్మిత్‌కే నేను నెట్స్‌లో ఎక్కువగా బౌలింగ్ చేశాను. అయినా, స్మిత్ నాకిలానే కావాలని పట్టుబట్టలేదు. ఎలా బౌలింగ్ చేసినా ఎదుర్కొనేందుకు ట్రై చేసేవాడు. అయితే, ఆ జట్టు స్పిన్నర్ లియోన్ మాత్రం నా దగ్గరికి వచ్చి నా బౌలింగ్ స్టైల్‌ను గమనించేవాడు. బంతిని డెలివరీ చేసేటపుడు నా వేళ్లను ఎలా తిప్పుతున్నా, గ్రిప్ ఎలా సాధిస్తున్నా అని పరిశీలించేవాడు. అంతేగాకుండా నాకు కొన్ని విలువైన సూచనలు, సలహాలు కూడా ఇచ్చేవాడు’’ అని మహేశ్ పితియా చెప్పుకొచ్చాడు. చదవండి: Ajinkya Rahane: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో Asha Kiran: కడు పేదరికం.. రూ. 1000 పెన్షనే ఆధారం.. చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగు.. స్వర్ణ పతకాలతో.. -
ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్.. అశ్విన్ లాంటి బౌలర్!? ఇంతకీ ఎవరీ కుర్రాడు?
India Vs Australia Test Series- Who is Mahesh Pithiya: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23 సీజన్లో ఇప్పటికే ఫైనల్ చేరింది ఆస్ట్రేలియా. ప్రతిష్టాత్మక టైటిల్ గెలిచేందుకు అడుగు దూరంలో నిలిచిన కంగారూ జట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్ పోరు కంటే ముందు టీమిండియాతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్ అయితే, భారత గడ్డపై అదీ ఎక్కువగా స్పిన్ బౌలర్లకు అనుకూలించే పిచ్‌లపై టీమిండియాతో సిరీస్ అంటే ఆషామాషీ కాదు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. ముఖ్యంగా సొంతగడ్డపై అశూ ఎలా రెచ్చిపోతాడో ఆసీస్ బ్యాటర్లకు గతానుభవమే! అందుకే అచ్చం అశూ మాదిరే బౌలింగ్ చేయగల గుజరాత్ బౌలర్‌తో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రాక్టీసు చేస్తున్నారు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి సన్నద్ధమయ్యే క్రమంలో నెట్స్‌లో ‘అశూ డూప్లికేట్’ను ఎదుర్కొంటున్నారు. View this post on Instagram A post shared by Mahesh Pithiya (@themaheshpithiya99_) ఎవరీ మహేశ్ పితియా?! ఆ వ్యక్తి పేరు మహేశ్ పితియా. గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన మహేశ్ స్పిన్ బౌలర్. 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్ దేశవాళీ క్రికెట్లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజా సీజన్‌తో రంజీల్లో ఎంట్రీ(డిసెంబరులో) ఇచ్చిన అతడు ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. PC: Instagram ఉత్తరప్రదేశ్, హిమాచల్, బెంగాల్, నాగాలాండ్ జట్లతో మ్యాచ్‌లలో మహేశ్ మొత్తంగా 8 వికెట్లు పడగొట్టడంతో పాటు 116 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 52. ఇంచుమించు అశ్విన్‌లాగే సేమ్ హైట్‌లో బాల్ డెలివరీ చేసే మహేశ్.. బంతి విసరడానికి ముందు అతడిలాగే జంప్ చేస్తాడు కూడా! View this post on Instagram A post shared by Mahesh Pithiya (@themaheshpithiya99_) అశూనే రోల్ మోడల్ నిజానికి అశ్వినే తన రోల్ మోడల్ అట. సాధారణ కుటుంబానికి చెందిన మహేశ్, 11 ఏళ్ల వయసు వచ్చే వరకు వాళ్ల ఇంట్లో టీవీ లేని కారణంగా అశ్విన్ బౌలింగ్‌ను ఒక్కసారి కూడా చూడలేదట. అయితే, 2013లో వెస్టిండీస్‌తో అశూ ఆడిన మ్యాచ్ చూసినప్పటి నుంచి అతడు తన ఆరాధ్య క్రికెటర్‌గా మారిపోయాడట. అచ్చం అశూ మాదిరే ఇక టీమిండియాతో సిరీస్‌తో నేపథ్యంలో మహేశ్ గురించి తెలుసుకున్న ఆస్ట్రేలియా మేనేజ్మెంట్.. అతడిని సంప్రదించింది. క్రిక్‌బజ్ కథనంలో పేర్కొన్న ప్రకారం.. బెంగళూరులో ఆసీస్ క్రికెటర్లు బస చేస్తున్న హోటల్లోనే అతడు కూడా ఉన్నాడు. PC: Instagram అంతేకాదు.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్, వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వరల్డ్ నంబర్ 1 టెస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్‌లతో పాటు కలిసి ప్రస్తుతం ఒకే బస్సులో ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడు వారికి అందబాటులో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆలూర్లోని కేఎస్‌సీఏ గ్రౌండ్లో స్మిత్, మ్యాట్ రెన్షాలు మహేశ్ బౌలింగ్‌లో ప్రాక్టీసు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. ‘‘ఈ అబ్బాయి అచ్చం అశ్విన్ లాగే బౌలింగ్ చేస్తున్నాడు’’ అంటూ ప్రశంసించారు. ఇక స్మిత్‌కు మహేశ్ బౌలింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. Steve Smith practiced Mahesh Pithiya bowling who's a quite similar bowler like Ashwin. #BorderGavaskarTrophy#INDvsAUS #INDvAUSpic.twitter.com/BVVadbk6RV — Drink Cricket 🏏 (@Abdullah__Neaz) February 3, 2023 నాడు 21 వికెట్లతో చెలరేగిన అశ్విన్ 2017లో ఆస్ట్రేలియా చివరిగా సారిగా భారత్‌లో టెస్టు సిరీస్ ఆడింది. అప్పుడు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈసారి అశూతో పాటు రవీంద్ర జడేజాకు.. వీరిద్దరికి తోడు అద్భుత ఫామ్‌లో ఉన్న అక్షర్ పటేల్ రూపంలో ఆసీస్ బ్యాటర్లకు ముప్పు ఎదురుకానుంది. అప్పుడు టీమిండియాదే సిరీస్ ఇక నాటి సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 333 పరుగుల భారీ తేడాతో గెలుపొందగా.. బెంగళూరు మ్యాచ్‌లో భారత్ 75 పరుగులతో విజయం సాధించింది. ఇక రాంచి వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగియగా.. ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది. ధర్మశాల మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేయడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ -2023 నేపథ్యంలో.. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో కోచింగ్ బృందంలో ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ ఇప్పటికే డానియెల్ వెటోరీకి చోటు కల్పించింది. ఇలా పక్కా ప్రణాళికతో టీమిండియాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇక ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: Shubman Gill: శుబ్మన్తో జోడీ కలపండి ప్లీజ్! ఆ ఛాన్స్ లేదు.. మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది! Joginder Sharma: రిటైర్మెంట్ ప్రకటించిన 2007 టి20 ప్రపంచకప్ హీరో