ప్రియుడిని కత్తితో పొడిచిన ప్రియురాలు
హైదరాబాద్ సిటీ: నగరంలోని చిలకలగూడలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడిపై ఓ ప్రియురాలు కత్తితో దాడిచేసి అతడిని గాయపరిచింది. ప్రియురాలు తన లవర్ని వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం సికింద్రాబాద్ ప్రాంతం చిలకలగూడలో జరిగింది. ప్రియురాలి దాడిలో గాయాలపాలైన ప్రియుడిని స్థానికులు చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.