breaking news
Lord Shiva Creations Banner
-
యువత ఆలోచనలేంటి?
‘పోటుగాడు’, ‘జేమ్స్ బాండ్’ చిత్రాల కథానాయిక సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో ‘ప్లేయర్’ ఫేం పర్వీన్ రాజ్, పూజిత జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా ఓ చిత్రం తెరకెక్కుతోంది. లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎంవీఎస్ సాయి కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘యువతరం ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాటి వల్ల జరిగే నష్టం ఏంటి? ఆ ఆలోచనల నుంచి తమ పిల్లల్ని తల్లిదండ్రులు ఎలా కాపాడుకోవాలనే కథాంశంతో తెరకెక్కిస్తున్నాం. ఈ నెలాఖరుకు రెండో షెడ్యూల్ పూర్తి చేస్తాం’’ అని తెలిపారు. ‘‘క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నాం. సాక్షీ చౌదరి పాత్ర ఇందులో ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కిస్తున్నాం’’ అని నిర్మాత పేర్కొన్నారు. పోసాని కృష్ణమురళి, సప్తగిరి, పూజిత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కిషన్ కవాడియా, కెమేరా: కె.శంకరరావు. -
ఆ ఆలోచనలు...
నేటి తరం యువత ఆలోచనలు ఎలా ఉన్నాయి? వాటి వల్ల జరిగే నష్టం ఏంటి? ఆ ఆలోచనల నుంచి తమ పిల్లల్ని తల్లితండ్రులు ఎలా కాపాడుకోవాలనే కథాంశంతో ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. సాక్షీ చౌదరి ప్రధాన పాత్రలో ‘ప్లేయర్’ ఫేం పర్వీన్ రాజు, పూజిత జంటగా లార్డ్ శివ క్రియేషన్స్ పతాకంపై శేష సాయి దర్శకత్వంలో ఎంవీఎస్ సాయి కృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్లో ప్రారంభ మైంది. ఈ చిత్రానికి కెమేరా: శంకర్ కంతేటి, సంగీతం: కృష్ణ, సమర్పణ: అరుణా చలమ్ మాణిక్వేల్