breaking news
Long Products
-
నష్టాల్లోకి టాటా స్టీల్ లాంగ్
న్యూఢిల్లీ: మెటల్ రంగ కంపెనీ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో రివర్స్ టర్న్అరౌండ్ ఫలితాలు ప్రకటించింది. ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 331 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా స్టీల్‌కు అనుబంధ సంస్థ అయిన కంపెనీ గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 332 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు రెట్టింపునకు పెరిగిన వ్యయాలు కారణమయ్యాయి. అయితే మొత్తం ఆదాయం మాత్రం రూ. 1,727 కోట్ల నుంచి రూ. 2,155 కోట్లకు జంప్ చేసింది. క్యూ1లో మొత్తం వ్యయాలు రూ. 1,283 కోట్ల నుంచి రూ. 2,490 కోట్లకు ఎగశాయి. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ లాంగ్ షేరు బీఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 603 వద్ద ముగిసింది. -
యూరప్ ‘లాంగ్ స్టీల్’కు ‘టాటా’
గ్రేబుల్ క్యాపిటల్ చేతికి వ్యాపారం లండన్: యూరప్‌లో తమకున్న ‘లాంగ్ ప్రొడక్ట్స్’ ఉక్కు వ్యాపారాన్ని విక్రయించినట్లు టాటా స్టీల్ (యూకే) ప్రకటించింది. దీన్ని గ్రేబుల్ క్యాపిటల్ ఎల్ఎల్పీకి విక్రయించినట్లు తెలియజేసింది. ఆస్తుల పోర్ట్‌ఫోలియో పునర్వ్యవస్థీకరణతో సహా... గడిచిన ఏడాది కాలంలో లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారానికి సంబంధించి సమూల మార్పిడి ప్రణాళికను పూర్తి రూపాంతర ప్రణాళిక ఈ విక్రయానికి కాఉక్కు వ్యాపారానికి సంబంధించి ‘లాంగ్ ప్రొడక్ట్స్’ బిజినెస్ విక్రయాన్ని పూర్తి చేసినట్లు టాటా స్టీల్ ప్రకటించింది. ఉద్యోగులు, ట్రేడ్ యూనియన్లు సహకరించటంతోనే ఇది సాధ్యమైందని కంపెనీ తెలిపింది. ‘‘స్కంథోర్ప్ స్టీల్‌వర్క్స్, టీసైడ్లోని రెండు మిల్లులు, వర్కింగ్టన్లోని ఇంజనీరింగ్ వర్క్‌షాప్, యార్క్‌లో డిజైన్ కన్సల్టెన్సీ, వీటిని అనుబంధంగా డిస్ట్రిబ్యూషన్ కార్యాలయాలు, నార్తర్న్ ఫ్రాన్స్‌లోని రైల్ మిల్... ఇవన్నీ మా యూరోప్ వ్యాపారంలో భాగంగా ఉన్నాయి. ఈ రోజు నుంచీ ఇవి బ్రిటిష్ స్టీల్ పేరిట కార్యకలాపాలు సాగిస్తాయి. మొత్తంగా ఈ వ్యాపారంలో యూకేలో 4,400 మంది, ఫ్రాన్స్‌లో 400 మంది ఉద్యోగులున్నారు’’ అని టాటా స్టీల్ యూకే ప్రకటించింది. -
టాటా స్టీల్ యూరప్ యూనిట్.. ఒక్క పౌండే
♦ లాంగ్ ప్రాడక్ట్స్ వ్యాపారాన్ని ♦ దక్కించుకుంటున్న గ్రేబుల్ క్యాపిటల్ ముంబై: యూరప్‌లో టాటా స్టీల్‌కున్న యూనిట్లలో ఒకదానిని ఇన్వెస్ట్మెంట్ సంస్థ గ్రేబుల్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. ఈ యూనిట్‌కు భారీగా ఉన్న అప్పులను టేకోవర్ చేసినందుకుగాను కేవలం ఒక్క పౌండ్ నామమాత్ర ధరనే గ్రేబుల్ చెల్లిస్తోంది. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ తయారుచేసే యూనిట్‌ను ఆస్తులు, అప్పులతో సహా 40 మిలియన్ పౌండ్ల ప్యాకేజీని గ్రేబుల్ టేకోవర్ చేస్తుంది. ఈ వ్యాపారానికి అవసరమైన భవిష్యత్తు వర్కింగ్ క్యాపిటల్, పెట్టుబడి నిధుల్ని గ్రేబుల్ బ్యాంకుల నుంచి, తన షేర్‌హోల్డర్ల నుంచి సమీకరిస్తుంది. ఉక్కు దిగ్గజ సంస్థ కోరస్‌ను దాదాపు దశాబ్దం కింద కొని, భారీ నష్టాల్లో చిక్కుకున్న టాటా స్టీల్ ఇటీవల యూరప్ వ్యాపార విక్రయానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఈ యూనిట్లో పనిచేస్తున్న 4,400 మంది ఉద్యోగుల్లో కోతలేవీ విధించరు. కాకపోతే 3 శాతం మేర వేతనాలు తగ్గిస్తారు. లాంగ్ ప్రొడక్ట్స్ వ్యాపారంలో భాగమైన టీస్సైడ్, ఉత్తరఫ్రాన్స్ల్లో వున్న స్కంథ్రోప్ స్టీల్‌వర్క్స్, వర్కింగ్టన్లో వున్న ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌ను, యార్క్‌లో వున్న డిజైన్ కన్సల్టెన్సీని, ఇతర అనుబంధ పంపిణీ సదుపాయాల్ని గ్రేబుల్ తీసుకుంటుంది. చైనా నుంచి ముంచెత్తుతున్న దిగుమతుల కారణంగా యూరప్ ఉక్కు పరిశ్రమలో క్లిష్టపరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో టాటా స్టీల్ యూకె, గ్రేబుల్ క్యాపిటల్ మధ్య ఒప్పందం కుదురుతున్నందుకు టాటాస్టీల్ యూరప్ సీఈఓ హాన్స్ ఫిషర్ సంతోషం వ్యక్తం చేశారు. నిధుల సమీకరణ, కీలక సరఫరాదారులతో ఒప్పందాలకు లోబడి ఈ డీల్ 8 వారాల్లో పూర్తవుతుందని గ్రేబుల్ క్యాపిటల్ ప్రకటించింది. ప్రస్తుత యాజమాన్యమే వ్యాపారాన్ని నడుపుతుందని, కంపెనీ తిరిగి లాభాలబాట పట్టేందుకు రూపొందించిన ప్రణాళికను అమలు జరుపుతుందని, ఒక శాశ్వత సీఈఓను నియమించే ప్రక్రియ మొదలుపెట్టామని గ్రేబుల్ వివరించింది. కంపెనీ యూరప్ వ్యాపారంలో లాంగ్, స్ట్రిప్ స్టీల్ యూనిట్లు యూకేలోనూ, ఫ్లాట్ ప్రొడక్టుల యూనిట్ నెదర్లాండ్స్‌లోనూ వున్నాయి. పోర్ట్ టాల్బెట్లో వున్న టాటా స్టీల్ స్ట్రిప్ యూనిట్‌ను కొనుగోలుచేయడానికి భారతీయ సంతతికి చెందిన లిబర్టీ హవుస్ వ్యవస్థాపకుడు సంజీవ్ గుప్తా ఆసక్తి చూపిస్తున్నారు. టాటా స్టీల్ యూకే వ్యాపారానికి సంబంధించి టాటా స్టీల్‌కు 4 బిలియన్ డాలర్ల రుణం వుంది. అయితే యూనిట్లవారీగా వున్న రుణాల్ని కంపెనీ వెల్లడించలేదు. కోరస్‌ను 2007లో 12.1 బిలియన్ డాలర్లకు టాటా స్టీల్ కొనుగోలు చేసింది. బలహీనమైన డిమాండ్, చౌక చైనా దిగుమతుల ఫలితంగా ఈ వ్యాపారం భారీ నష్టాల్ని చవిచూసింది.