breaking news
l.k.advani
-
బీజేపీ-పీడీపీ సంకీర్ణం ఫర్వాలేదు: అద్వానీ
అహ్మదాబాద్: ఇటీవల జమ్మూకశ్మీర్ లో ఏర్పడిన బీజేపీ-పీడీపీ సంకీర్ణం బాగానే పనిచేస్తోందని బీజేపీ కురువృద్ధుడు, సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ వ్యాఖ్యానించారు. అయితే బీజేపీని సంప్రదించకుండా పీడీపీ కొన్ని నిర్ణయాలు తీసుకోవటం సరిగాలేదన్నారు. కశ్మీర్ విషయంలో బీజేపీ వైఖరి స్పష్టంగా ఉందన్నారు. అద్వానీ సోమవారం ఆయన సొంతనియోజక వర్గం గాంధీనగర్ నియోజకవర్గంలో ఆయన దత్తత తీసుకున్న బక్రానా గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గాంధీనగర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలనూ అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
అద్వానీపై బాబ్లీ కేసును వేగవంతం చేయనున్న సీబీఐ
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసుకు సంబంధించి ఎల్.కె. అద్వానీపై నమోదైన కేసును సీబీఐ వేగవంతం చేయనుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో సీబీఐ వాదనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకారం తెలపడంతో కేసు గడువు సమయాన్ని డిసెంబర్ నుంచి అక్టోబర్ మొదటి వారానికి మార్చింది. జీఎస్ సంఘ్వీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును మంగళవారం విచారణకు స్వీకరించింది. అక్టోబర్ మొదటి వారంలో విచారణ పూర్తి చేస్తామన్న సీబీఐ వాదనలకు అద్వానీ తరుపు న్యాయవాదులు కూడా అంగీకారం తెలిపారు. ఈ కేసును గతంలో విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, అలహాబాద్ హైకోర్టులో సీబీఐ వాదనను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. సుప్రీంలో సీబీఐ తరుపున వాదించిన పీవీరావు.. బాబ్రీ మసీదు కేసు విచారణ కోర్టు ఇచ్చిన గడువు కంటే ముందుగా సెప్టెంబర్ లోనే పూర్తి చేయాలనుకున్నామని, కొన్ని కారణాల వల్ల జాప్యం జరిగిందన్నారు. డిసెంబర్ వరకూ సమయం ఉన్నా, అక్టోబర్ తొలి వారంలో విచారణ పూర్తి చేస్తామన్న సీబీఐ వాదనను అద్వానీ తరుపు న్యాయవాది కె.కె.వేణుగోపాలరావు కూడా అంగీకారం తెలిపారు.