breaking news
Liberation Front
-
ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడి
ఇస్లామాబాద్: ఇరాన్ బుధవారం జరిపిన దాడులకు గురువారం పాక్ ప్రతీకారం తీర్చుకుంది. సరిహద్దులకు సమీపంలోని ఇరాన్ సియెస్తాన్–బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో దాడులు జరిపింది. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా రాకెట్లు, డ్రోన్లతో చేపట్టిన ‘ప్రెసిషన్ మిలటరీ స్ట్రయిక్స్’లో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్లకు చెందిన 9 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు సమాచారం ఉందని పాక్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్‌కు తమ నిరసన తెలిపినట్లు ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. పాక్ దాడుల్లో ఇరానేతర జాతీయులైన ఇద్దరు పురుషులు, ముగ్గురు మహిళలు, నలుగురు చిన్నారులు చనిపోయినట్లు అధికార వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. పాక్ కేంద్రంగా పనిచేస్తూ తమ దేశంలో ఉగ్రదాడులకు తెగబడుతున్న జైష్ అల్–అదిల్ ఉగ్రసంస్థ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణి దాడులతో బుధవారం విరుచుకుపడింది. ఈ దాడులకు నిరసనగా పాక్ తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరించడంతోపాటు ఇరాన్‌లోని తమ రాయబారిని వెనక్కి పిలిపించుకున్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ భూభాగంపై ఇరాన్ దాడులను భారత్ సమర్థించింది. ఉగ్రవాదాన్ని అంతమొందించాలన్న తమ వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేసింది. ఇది ఆ రెండు దేశాలకు సంబంధించిన విషయమే అయినప్పటికీ, దేశాలు తమ ఆత్మరక్షణ కోసం తీసుకునే చర్యలను భారత్ అర్థం చేసుకుందని పేర్కొంది. -
పండిట్లకు టౌన్‌షిప్‌లపై ఆందోళనలు
* జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల నిరసన * అడ్డుకున్న భద్రతాదళాలు.. * యాసిన్ మాలిక్ అరెస్ట్ జమ్మూ/శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పండిట్లకు ప్రత్యేక ఆవాసాల ఏర్పాటు యత్నాలను నిరసిస్తూ.. జమ్మూకాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) ఆధ్వర్యంలో వేర్పాటువాదులు శుక్రవారం శ్రీనగర్‌లో ఆందోళన చేపట్టారు. ఆందోళనను భద్రతా దళాలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జేకేఎల్ఎఫ్ నేత యాసిన్‌మాలిక్ సహా పలువురిని అరెస్టు చేయడంతో పరిస్థితి అదుపుతప్పింది. వేర్పాటువాదులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు లాఠీచార్జి చేయడం, బాష్పవాయు గోళాలను ప్రయోగించడంతో 24 మంది గాయపడ్డారు. ఆందోళనలో పలువురు కశ్మీరీ పండిట్లు పాల్గొనడం గమనార్హం. తమకు ప్రత్యేక టౌన్‌షిప్‌లు అవసరం లేదని విషన్జీ అనే పండిట్ చెప్పారు. యాసిన్‌మాలిక్ ఆధ్వర్యంలో వేర్పాటువాదులు తొలుత శ్రీనగర్‌లోని మైసుమా నుంచి నగరం మధ్యలోని లాల్‌చౌక్‌కు ర్యాలీగా బయలుదేరారు. మధ్యలోనే అడ్డుకున్న భద్రతా దళాలు.. మాలిక్ సహా పలువురిని అదుపులోకి తీసుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది.