breaking news
li kequiang
-
ఆ విషయంలో భారత్‌ను మెచ్చుకోవాల్సిందే.. చైనా
బీజింగ్: భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సు విజయవంతం కావడంపైనా ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాల ఆమోదం పొందడంపైనా పొరుగుదేశం చైనా ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో డిక్లరేషన్ సభ్యదేశాల ఏకాభిప్రాయం సాధించడం గొప్ప విజయమన్నారు. ఢిల్లీ వేదికగా రెండు రోజుల పాటు జరిగిన జీ20 సమావేశాలను అత్యంత సమర్ధవంతంగా నిర్వహించిన భారత్ దేశంపై ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. తాజాగా చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ సమావేశాల నిర్వహణలోనూ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధించడం విషయంలోనూ భారత్ పాత్ర అభినందనీయమని తెలిపారు. అన్నిటినీ మించి ఈ సమావేశాల ద్వారా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ కోసం సభ్యదేశాలు చూపిన చొరవ కూటమి యొక్క ఐక్యతకు సంబంధించి సానుకూల సంకేతాలను పంపుతుందని తెలిపింది చైనా. మావో నింగ్ మాట్లాడుతూ.. జీ20 సమావేశాల్లో సభ్య దేశాలు ఆమోదం తెలిపిన ఢిల్లీ డిక్లరేషన్‌పై చైనా వైఖరి స్పష్టంగా ప్రతిబింబించేలా ఉందన్నారు. ఈ డిక్లరేషన్ జీ20 సభ్య దేశాల మధ్య దృఢమైన భాగస్వామ్యాన్ని బహిర్గతం చేస్తూ ప్రాపంచికసావాళ్ళను ఎదుర్కొనేందుకు జీ20 బృందం సిద్ధపాటుపై ప్రపంచ దేశాలకు సానుకూల సంకేతాలను పంపుతుందన్నారు. ఈ సమావేశాలకు సిద్దపడే విషయమై చైనా నిర్ణయాత్మక పాత్ర పోషించిందని అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చే ఈ సదస్సుకు చైనా మొదటినుంచి మద్దతు తెలుపుతూనే ఉందని అన్నారు. న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందడం జీ20 సభ్యదేశాల ఉమ్మడి అవగాహనకు ప్రతీకగా నిలుస్తుందని అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి జీ20 ఒక ప్రధాన వేదిక అని అన్నారు. ఈ వేదిక ద్వారా భౌగోళిక రాజకీయ, భద్రతా సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని ఉక్రెయిన్ సంక్షోభానికి పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమవుతుందని తాము బలంగా విశ్వసిస్తున్నామన్నారు. దీనిపై అంతర్జాతీయ కమ్యూనిటీతో కలిసి పని చేసేందుకు చైనా కట్టుబడి ఉందన్నారు. సమావేశాలకు హాజరైన చైనా ప్రీమియర్ లీ కియాంగ్ ప్రపంచ ఆర్ధిక పురోగతి తోపాటు ప్రపంచ శాంతికి చైనా కట్టుబడి ఉందన్న విషయాన్ని తెలిపారన్నారు. ఇది కూడా చదవండి: 1,968 అడుగుల ఎత్తు నుంచి పడ్డా ఏమీ కాలేదు -
చైనా, కెనడా భాయి.. భాయి
మాంట్రియల్: చైనా, కెనడాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రుడేవ్ బీజింగ్‌లో పర్యటించిన నెల రోజుల అనంతరం చైనా ప్రధాని లీ కెకియాంగ్ కెనడాలో మూడురోజుల పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య విన్-విన్ సహకారం కొనసాగుతుందని లీ కెకియాంగ్ ప్రకటించారు. శుక్రవారం మాంట్రియల్లో జరిగిన కెనడియన్-చైనీస్ బిజినెస్ కౌన్సిల్లో పాల్గొన్న లీ.. ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఎలాంటి రాజీ లేదని వెల్లడించారు. అమెరికా తరువాత కెనడాకు రెండో అతిపెద్ద వ్యాపార భాగస్వామి చైనానే. 2025 నాటికి ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని రెండింతలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు లీ వెల్లడించారు. గత కెనడా ప్రభుత్వ హయాంలో ఇరుదేశాల మధ్య అంత ప్రభావవంతంగా లేనటువంటి సంబంధాలు ఇప్పుడు వేగంగా పుంజుకుంటున్నాయని.. ఇది ఇరుదేశాల మధ్య సంబంధాల్లో గోల్డెన్ డికేడ్ ప్రారంభం అని లీ కెకియాంగ్ ప్రకటించారు. అలాగే.. ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి స్వేచ్చా వాణిజ్యం దిశగా చర్చలు ముందుకు వెళ్తున్నాయని ఆయన వెల్లడించారు. గత ఏడాది చైనా, కెనడాల మధ్య 64.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది.