breaking news
leela krishna
-
జనసేన నేత దాడి.. ఆత్మహత్యాయత్నం
సాక్షి, మండపేట: తూర్పుగోదావరి జిల్లా మండపేట జనసేన నియోజకవర్గ ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ తనపై చేయిచేసుకున్నాడన్న మనస్తాపంతో వైఎస్సార్సీపీ కార్యకర్త పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన రాచకొండ భీమరాజు మున్సిపల్ మార్కెట్ ఆశీలు పాటదారుని వద్ద గుమస్తాగా పనిచేస్తున్నాడు. వ్యాపారుల నుంచి అధికంగా ఆశీలు వసూలు చేస్తున్నట్టు ఆరోపిస్తూ శుక్రవారం మార్కెట్ వద్ద భీమరాజుపై లీలాకృష్ణ చేయిచేసుకున్నాడు. (టీడీపీ నేతలకు చుక్కెదురు) దీంతో మనస్తాపం చెందిన భీమరాజు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా కుటుంబసభ్యులు అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వైఎస్సార్సీపీకి చెందిన కాపు నేతలు జిన్నూరి సాయిబాబా, పిల్లా వీరబాబు బాధితుడిని పరామర్శించారు. లీలాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. (అసత్య ఆరోపణలతో అడ్డంగా దొరికిన టీడీపీ నేత) -
అక్రమ కేసులకు వెనుకంజ వేయం
వేగుళ్ల లీలాకృష్ణ మండపేట : అధికారపార్టీ నేతల అక్రమాలపై ప్రజల పక్షాన ఉద్యమిస్తున్న తమను అక్రమ కేసులతో అడ్డుకోలేరని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ పేర్కొన్నారు. కడప గురించి ఏం తెలుసునని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మండపేటను కడపను చేస్తున్నారని విమర్శిస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు తదితరులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, గతంలో కడపలో ఉండే ఫ్యాక్షనిజం అప్పట్లో మండపేటలో కూడా ఉండేదన్న విషయాన్ని అధికారపార్టీ నేతలు మర్చిపోకూడదన్నారు. పట్టణానికి ఏం అభివృద్ధి చేశారని తన తండ్రి పేరు ఓ కాలనీకి పెట్టుకుంటున్నారో వేగుళ్ల చెప్పాలని లీలాకృష్ణ డిమాండ్ చేశారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పట్టణంలో 127 ఎకరాలు సేకరిస్తే ఆ కాలనీకి ఎమ్మెల్యే వేగుళ్ల తన తండ్రి పేరు పెట్టుకున్నారని లీలాకృష్ణ విమర్శించారు. నియోజకవర్గంలోని కాపులు, ఎస్సీ, బీసీలను ఎమ్మెల్యే అణగద్రొక్కుతున్నారని, రైతుబజారులో ఎస్సీలకు షాపులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పాపారాయుడు మాట్లాడుతూ అధికారపార్టీ నేతలు బనాయించిన అక్రమ కేసులకు భయపడేది లేదన్నారు. రైతు బజారులో అక్రమాలపై ప్రశ్నించిన లీలాకృష్ణను అరెస్టు చేయించేందుకు పోలీసులను ఎక్కడెక్కడికో పంపిస్తున్నారన్నారు. త్వరలో వచ్చేది జగ¯ŒSమోహ¯ŒSరెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని, గొల్లపుంత కాలనీకి వైఎస్సార్ కాలనీగా నామకరణం చేస్తామని పాపారాయుడు పేర్కొన్నారు. సొసైటీ అధ్యక్షుడు వైట్ల రాంబాబు, ఎంపీటీసీ సభ్యులు మేడపాటి లక్షి్మప్రసాదరెడ్డి, అన్నందేవుల చంద్రరావు, తుపాకుల ప్రసన్నకుమార్, పార్టీ నాయకులు వల్లూరి రామకృష్ణ, గంగుమళ్ల రాంబాబు, మేడిశెట్టి సూర్యభాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.