breaking news
leading
-
అరవింద్ కేజ్రీవాల్ ముందంజ
-
మిల్కిపూర్‌లో బీజేపీ ముందంజ
ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు (ఫిబ్రవరి 8) జరుగుతోంది. తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీకి చెందిన చంద్రభాన్ పాశ్వాన్ ముందంజలో ఉన్నారు. ఈ సీటును గెలుచుకునేందుకు అటు బీజేపీ, ఎస్పీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈ సీటు గెలుపు బాధ్యతను సీఎం యోగి ఆదిత్యనాథ్ తన భుజస్కందాలపై వేసుకున్నారు.ఎస్పీకి చెందిన అజిత్ ప్రసాద్, బీజేపీకి చెందిన చంద్రభాన్ పాస్వాన్ సహా 10 మంది అభ్యర్థులు మిల్కిపూర్ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఇద్దరు అభ్యర్థులు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్లలో బీజేపీ అభ్యర్థి చంద్రభాన్ పాశ్వాన్ ముందంజలో ఉన్నారు. ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ ఆధిక్యత కనబరుస్తోంది. ఎస్పీ అభ్యర్థి అజిత్ ప్రసాద్ కౌంటింగ్‌కు ముందు పార్టీ నేతలకు, ఏజెంట్లకు హల్వా అందించారు.ఇంతలో ఎస్పీ ఎంపీ అవధేష్ ప్రసాద్ విజయ నినాదం చేశారు. మిల్కీపూర్ చరిత్ర సృష్టించబోతోందని, ఎస్పీ అభ్యర్థి 35 వేల ఓట్ల తేడాతో గెలుస్తారన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు చంద్రభాన్ పాస్వాన్ తన ఇంట్లో పూజలు నిర్వహించారు. మిల్కిపూర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యింది. ఉదయం 10 గంటల నుండి ట్రెండ్స్ రావడం ప్రారంభంకానుంది. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు 30 రౌండ్లలో పూర్తవుతుంది. 76 మంది ఉద్యోగులతో కూడిన 19 పార్టీలు ఓట్ల లెక్కింపు కోసం పనిచేస్తున్నాయి.ఇది కూడా చదవండి: Delhi Election: కుటుంబ ప్రతిష్టకు అగ్నిపరీక్ష -
కాంగ్రెస్ బలపడింది అని అనుకోవడం లేదు..
-
జులనా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ ఫొగట్ ముందంజ
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యం
-
హిమాచల్ ప్రదేశ్ లో 4 చోట్ల బీజేపీ ఆధిక్యం
-
మునుగోడులో కాంగ్రెస్ 13 వేల ఓట్లు ఆధిక్యం..
-
కామారెడ్డిలో కేసీఆర్ ఆధిక్య..
-
బీఆర్ఎస్ ఆధిక్యం
-
చార్మినార్ లో బీజేపీ ముందంజ
-
కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి ముందంజ..
-
కొల్లాపూర్ లో బర్రెలక్క ముందంజ
-
చాంద్రాయణగుట్ట పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అక్బరుద్దీన్ ముందంజ
-
నల్గొండలో కాంగ్రెస్ ముందంజ
-
కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ముందంజ
-
పోస్టల్ బ్యాలెట్ లో బండి సంజయ్ ముందంజ..
-
ఏడో రౌండ్ లోనూ టీఆర్ఎస్ ఆధిక్యం
-
నాలుగో రౌండ్ లో టీఆర్ఎస్ ఆధిక్యం
-
మూడో రౌండ్ లో బీజేపీ ఆధిక్యం
-
రెండో రౌండ్ లో 1200 ఓట్లకు పైగా ఆధిక్యంలో బీజేపీ
-
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజ
-
హుజుర్నగర్లో టీఆర్ఎస్ ఆధిక్యం ఇలా...
సాక్షి, హుజుర్నగర్: సూర్యాపేట జిల్లా హుజుర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సనంపూడి సైదిరెడ్డి రికార్డు విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ స్పష్టమైన ఆధిక్యత చాటారు. 22 రౌండ్ల పాటు ఓట్ల లెక్కింపులో ఎక్కడా ఆయన వెనుక బడలేదు. ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. బీజేపీ, టీడీపీ అడ్రస్ లేకుండా పోయాయి. హుజూర్నగర్ నియోజకవర్గ చరిత్రలొనే అత్యధిక మెజార్టీతో విజయదుందుభి మోగించారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేతిలో సైదిరెడ్డి 7466 ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన ట్రక్ సింబల్.. కారు గుర్తును పోలివుండటంతో తాను ఓడిపోయానని సైదిరెడ్డి అప్పట్లో వాపోయారు. ఉప ఎన్నికల ఫలితంతో ఆయన వాదనలో వాస్తముందని తేలింది. -
కడపలో అవినాష్ రెడ్డి ఆధిక్యం
-
సీమాంధ్రలో ఫ్యాన్ గాలి
ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పోలింగ్ సాక్షి, హైదరాబాద్: కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన సీమాంధ్ర ఎన్నికల పోలింగ్ ముగిసింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎనిమిదవ విడతగా జరిగిన ఈ పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాం తంగా పూర్తి కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ సరళిని విశ్లేషించుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు సీమాంధ్ర అంతటా ఫ్యాన్ గాలి ప్రభంజనం సృష్టించబోతోందని పార్టీ నేత లు ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ తీరును విశ్లేషించుకున్న తెలుగుదేశం శిబిరంలో పూర్తి గా నిరుత్సాహం ఆవరించింది. బుధవారం సీమాంధ్రలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ జరిగిన తీరును బట్టి ఆయా పార్టీలు తమ గెలుపు అవకాశాలను విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. నియోజకవర్గాలవారీగా సేకరించిన నివేదికల మేరకు, వైఎస్సార్సీపీ కనీసం 140 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్‌సభ స్థానాలనూ కైవసం చేసుకుంటుందని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. జిల్లాల్లో ఉదయం పోలింగ్ మొదలైనప్పటినుంచే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తిందని, ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని వివరించారు. భారీ విజయాలతో వైఎస్సార్సీపీ చరిత్ర సృష్టించబోతోందనే వార్తలే న లువైపుల నుంచి వెల్లువెత్తుతుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. పరిస్థితి తమ పార్టీకి పూర్తి అనుకూలంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో తిరుగులేని ఆధిక్యతతో అధికారంలోకి రాబోతున్నామని పార్టీ ముఖ్య నేతలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ జగన్‌కు అనుకూలంగా ప్రభంజనం స్పష్టంగా కన్పించిందని అన్ని జిల్లాల నుంచీ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందింది. ఏ వర్గానికీ కొమ్ముకాయని జాతీయ, రాష్ట్ర మీడియా వర్గాలు కూడా వైఎస్సార్సీపీయే పూర్తి ఆధిక్యతలో ఉందని... టీడీపీ-బీజేపీ రెండూ కలిసి కూడా ఏ దశలోనూ జగన్ గాలిని కనీసం నిలువరించ లేకపోయాయని పోలింగ్ అనంతరం విశ్లేషించాయి. చిత్తూరు మొదలుకుని శ్రీకాకుళం దాకా సీమాంధ్ర అంతటా జగన్ హవా యే సాగిందని ఆ వర్గాలు అంచనా వేశాయి. ఉద యం నుంచి తీవ్ర ఎండలను సైతం లెక్కచేయకుం డా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరిన వైనం చూస్తే వారంతా మార్పును కోరుకుంటున్నట్టు స్పష్టంగా కన్పించింది. వృద్ధులు, మహిళలు, యువ తీ యువకులు... ఇలా అన్ని వర్గాల వారూ ఓటేయడానికి పోటెత్తారు. జగన్, విజయమ్మ, షర్మిల ఎన్నికల ప్రచారం సందర్భంగా వారిని చూసేందుకు, వారి మాటలు వినేందుకు ఎండకు, వానకు లెక్క చే యకుండా ఎలాగైతే గంటల తరబడి భారీ సంఖ్యలో ప్రజలు వేచి చూశారో పోలింగ్ రోజున ఓటేయడానికి కూడా ఓటర్లు అదే తరహాలో పోటెత్తారు. కుల, మత, ప్రాంత, వర్గాలతో నిమిత్తం లేకుండా అంతా ఏకాభిప్రాయంతో జగన్‌కు ఓటేసినట్లు పోలింగ్ అనంతరం పార్టీకి అందిన నివేదికల్లో తేలిందని నేత లు పేర్కొన్నారు. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని మొత్తం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని, మిగతా జిల్లాల్లో 90 శాతం స్థానాలు గెలుచుకుంటామని వారన్నారు. నిస్తేజంలో దేశం నేతలు సాధారణంగా ఏ ఎన్నికల సమయంలోనైనా వాతావరణం ఏ మాత్రం సానుకూలంగా కనిపించినా చెప్పలేనంత హడావుడి చేసే టీడీపీ నేతలు బుధవారం మాత్రం అసలు తెర మీదికేరాలేదు. కనీసం తమ స్పందనలు తెలియజేయడానికి కూడా వారెవరూ మీడియా ముందుకు రాలేదు. పలువురు టీడీపీ నేత లు అర్ధరాత్రి దాకా అంతర్గత విశ్లేషణల్లో తలమునకలయ్యారు. టీడీపీ అధ్యక్షుడు బాబు కూడా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఉదయం నుంచి జిల్లా నేతలతో పోలింగ్ సరళిని తెలుసుకుంటూ గడిపారు. అనేక నియోజకవర్గాల్లో వెనుకబడ్డామన్న సమాచారం టీడీపీ నేతలను బాగా కుంగదీసింది. వారం తా అందుకు కారణాలు విశ్లేషించే పనిలో పడ్డారు. సీమాంధ్ర మొత్తంమీద ఏ జిల్లాలోనూ తమకు కనీసం ఆశాజనకమైన పరిస్థితి కూడా కన్పించకపోవడంతో నేతలంతా నీరసించారు. జిల్లాల్లో ఉన్న నేతలు పరిస్థితి ఎలా ఉందంటూ వాకబు చేస్తూ కన్పించారు. హైదరాబాద్ నుంచి అందిన సమాచారంతో మరింతగా నిరుత్సాహపడ్డారు. చివరి క్షణాల్లో కాంగ్రెస్ నేతలను భారీగా పార్టీలో చేర్చుకోవడం, బీజేపీ మద్దతు తీసుకోవడం.. ఇలా తమను దెబ్బతీసిన అంశాలపై టీడీపీ నేతలు ఇప్పటినుంచే విశ్లేషణలో పడ్డారు. కాంగ్రెస్ నేతల్లోనైతే అసలు పోలింగ్ ను పట్టించుకున్న నాయకుడే కరువయ్యారు! పోలింగ్ సరళి సీమాంధ్రలో ఓటర్లు పోటెత్తారు. ఉదయం 7 గంటలకే పలు కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉదయం 11గంటల వరకే 13 జిల్లాల్లో సరాసరిన 33 శాతం పోలింగ్ నమోదయింది. ఆ సమయానికి కర్నూలు జిల్లాలో గరిష్టంగా 41 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు దాదాపు 52 శాతం, 3 గంటలకు 63 శాతం ఓట్లు పోలయ్యాయి. మిట్టమధ్యాహ్నం మండుటెండలోనూ ఓటర్లు ఓపిగ్గా లైన్లలో నిలబడి ఓట్లేశారు. -
మహా భంగపాటు