breaking news
laundering
-
రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ అరెస్ట్
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో లక్షల ఫాలోవర్స్ కలిగిన కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఏదో ఒక ఆరోపణలతో వార్తల్లో టాప్‌లో నిలవడం పరిపాటిగా మారింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షల ఫాలోవర్స్ కలిగిన సందీపా విర్క్ రూ.40 కోట్ల లాండరింగ్ కేసులో అరెస్టయ్యారు.ఇన్స్టాగ్రామ్ అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్ కలిగిన సందీప విర్క్ ఎఫ్‌డీఏ ఆమోదించిన బ్యూటీ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెప్పుకుంటారు. అలాగే హైబూకేర్.కామ్ అనే వ్యాపార సంబంధిత వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. మరోవైపు ఆమెకు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్‌తో కూడా సంబంధాలున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విర్క్ తన బయోలో తాను వ్యాపారవేత్త, నటి అని చెప్పుకున్నారు.తాజాగా విర్క్‌ను రూ. 40 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆమెపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 406 (నేరపూరిత నమ్మక ద్రోహం, 420 (మోసం) కింద మొహాలీలోని ఒక పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మంగళవారం, బుధవారం ఢిల్లీ, ముంబైలోని పలు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది.సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ విర్క్ మోసపూరిత మార్గాల ద్వారా లెక్కకుమించిన స్థిరాస్తులను సంపాదించారనే ఆరోపణలున్నాయి. కాగా ఆమె సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, అవి ఉనికిలో లేవని తెలుస్తోంది. ఆమె వెబ్సైట్లో యూజర్ రిజిస్ట్రేషన్ ఫీచర్లు లేవనే ఆరోపణలున్నాయి. రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ మాజీ డైరెక్టర్ అంగరై నటరాజన్ సేతురామన్‌తో విర్క్‌కు ఉన్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీస్తోంది.2018లో రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (ఆర్సీఎఫ్ఎల్)నుండి సుమారు రూ. 18 కోట్ల విలువైన నిధులను సేతురామన్ దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఆయన తనకు విర్క్‌తో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాజాగా విర్క్‌ను పీఎంఎల్ఏ నిబంధనల కింద ఈడీ అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచింది. కోర్టు ఆమెను శుక్రవారం వరకు ఈడీ కస్టడీకి పంపింది. ఈ కేసులో ఇతరుల ప్రమేయంపై కూడా దర్యాప్తు జరుగుతోందని సమాచారం. -
మాజీ ప్రధాని కుమారుడికి జైలు శిక్ష!
ఢాకాః బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ అధినేత్రి, మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడికి జైలు శిక్ష పడింది. మనీ లాండరింగ్ కేసులో నిందితుడైన తరిక్ రెహెమాన్ కు ఏడు సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ హైకోర్డు ఆదేశాలు జారీ చేసింది. నగదు బదిలీ విషయంలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, నేషనల్ పార్టీ అధినేత్రి ఖలేదా జియా కుమారుడు.. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ లీడర్.. తరిక్ రెహెమాన్ కు హైకోర్డు ఏడేళ్ళ జైలు శిక్ష విధించింది. 20.14 కోట్ల టాకాల మనీ లాండరింగ్ కేసు విషయంలో ట్రయల్ కోర్టు విచారణను తోచిపుచ్చిన హైకోర్టు.. విచారణ చేపట్టి రెహమాన్ కు ఏడు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 200 మిలియన్ల టాకాల జరిమానా కూడా విధిస్తూ తీర్పునిచ్చింది. -
1 నుంచి నగదు బదిలీ పథకం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:జిల్లాలోని గ్యాస్ వినియోగదారులకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నగదు బదిలీ పథకం అమలులోకి వస్తున్నట్లు కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. వంద శాతం వినియోగదారులు నగదు బదిలీ పథకంలో చేరేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో బుధవారం సాయంత్రం బ్యాంకర్లు, ఎల్పీజీ గ్యాస్ డీలర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం దశలవారీగా నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో మొదటి దశలో ఏడు జిల్లాల్లో నగదు బదిలీ పథకం అమలు చేశారని, రెండవ దశలో ప్రకాశం జిల్లాను ఎంపిక చేసినట్లు వివరించారు. గ్యాస్ వినియోగదారులంతా నగదు బదిలీ పథకంలో చేరే విధంగా బ్యాంకర్లు, ఎల్పీజీ డీలర్లు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 5 లక్షల 63 వేల మంది గ్యాస్ వినియోగదారులున్నారన్నారు. వీరందరినీ నూరుశాతం నగదు బదిలీ పథకంలో అనుసంధానం చేయాలని ఆదేశించారు. జిల్లాలో 33 లక్షల 92 వేల మందిని ఆధార్ కార్డులో నమోదు చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 32 లక్షల 78 వేల మంది వివరాలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి మండల కేంద్రాల్లో ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. మూడునెలల్లోపు నగదు బదిలీ పథకం ప్రక్రియ పూర్తి కావాలన్నారు. వినియోగదారులకు ఏటా సబ్సిడీపై తొమ్మిది సిలిండర్లు అందిస్తుందని, ఆ తరువాత తీసుకునే వాటికి రూ. 950 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రతి గ్యాస్ వినియోగదారుడు నగదు బదిలీలో వచ్చేలా చూడాలని ఆదేశించారు. నగదు బదిలీ పథకం గురించి విస్తృతంగా అవగాహన కలిగించాలన్నారు. గ్రామాల్లో దండోరా ద్వారా ప్రచారంచేసి ప్రజలు వినియోగించుకునేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్, నెల్లూరు సిండికేట్ బ్యాంకు డీజీఎం కే శ్రీనివాసరావు, ప్రకాశం జిల్లా ఎల్డీఎం ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రంగాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఆధార్ సీడింగ్ కోసం మల్లగుల్లాలు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓ నెల ముందు నుంచే వంటగ్యాస్‌కు ‘నగదు బదిలీ’ పథకం అమలు చేయనుండటంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. లక్షల్లో గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ నమోదు చేయాల్సి ఉండటంతో కొండంత లక్ష్యంతో గ్యాస్ డీలర్లు, సివిల్ సప్లయ్స్ అధికారులు నానా హైరానా పడుతున్నారు. నగదు బదిలీ పథకాన్ని అక్టోబర్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించడంతో అధికారులు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నారు. తాజాగా కేంద్రపెట్రోలియం మంత్రిత్వశాఖ సెప్టెంబర్ నుంచే రాష్ట్రంలోని మరో ఏడు జిల్లాల్లో దీన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఇందులో మన జిల్లా కూడా ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఐదు జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉంది. గ్యాస్ సిలిండ ర్ల సబ్సిడీని నేరుగా ఆధార్ కార్డుతో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. ఇప్పుడు సమయం ముంచుకొస్తుండటంతో ఏ విధంగా గట్టెక్కాలనే దానిపైనే అధికారులు కసరత్తు చేస్తున్నారు. నెలాఖరులోగా ఇది పూర్తి చేయగలమా అని అధికారులు మదనపడుతున్నారు. జిల్లాలో మొత్తం 8.67లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 2.56 లక్షల కనెక్షన్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తి చేశారు. ఆరు లక్షల కనెక్షన్లకు నెలాఖరులోగా ఆధార్ సీడింగ్ పూర్తి చేయడం సాధ్యమయ్యేట్లు కనిపించటం లేదు. గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబర్, గ్యాస్ ధ్రువీకరణ పత్రాలను ఆయా ఏజెన్సీల్లో ఆధార్ సీడింగ్ నమోదుకు ఇవ్వాల్సి ఉంది. చాలా మంది వినియోగదారులకు ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో అర్హతా పత్రాలను సమర్పించలేదు.