breaking news
Latest style
-
Saree Styles With Sweater: చలికాలంలో ఫ్యాషనబుల్‌గా వెచ్చని స్టైల్!
కాలానికి తగినట్టు చలిని తట్టుకోవాలంటే మన వేషధారణలోనూ ప్రస్తుతం కొన్ని మార్పులు చేసుకోవాలి. క్యాజువల్ అయినా.. పార్టీ అయినా.. పెళ్లి అయినా.. పండగ అయినా.. స్వెటర్‌తో ఒక స్టైల్, డెనిమ్ షర్ట్‌తో మరో స్టైల్.. పెప్లమ్ టాప్‌తో ఒక స్టైల్, లాంగ్ జాకెట్‌తో మరో స్టైల్... ఇలా ఒక చీరకట్టుకే భిన్నమైన స్టైల్స్‌ను జత చేయచ్చు. కాలానికి తగిన విధంగా లుక్‌లో మార్పులు తీసుకురావచ్చు. పెళ్లికి వెళ్లాలంటే ఎప్పుడూ ఒకేవిధంగా ఉండనక్కర్లేదు. బెనారస్ లాంగ్ జాకెట్‌ను పట్టు చీరకు జతగా ధరిస్తే చాలు చలికాలానికి తగినట్టుగా చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తుంది. క్యాజువల్ లుక్‌లో కొంచెం భిన్నంగా ఉండటంతోపాటు స్టైల్‌గా కనిపించాలంటే ఈ సీజన్‌కి తగినట్టుగా డెనిమ్ జాకెట్‌ను శారీకి జతగా ధరిస్తే చాలు. ఎక్కువ ఆభరణాలు అవసరం లేకుండా వర్క్వేర్గా అందంగా కనిపిస్తుంది. కాటన్ చీరలు ధరించేవారు ప్లెయిన్ లేదా శారీ కలర్ బ్లౌజ్ ధరించడం చూస్తుంటాం. దీంట్లోనే కొంత భిన్నమైన లుక్‌ను తీసుకురావచ్చు. టర్టిల్ నెక్, లాంగ్ స్లీవ్స్ ఉన్న ప్లెయిన్ కలర్ బ్లౌజ్‌లను ఈ శారీ స్టైల్‌కు వాడొచ్చు. ఈ కాటన్ శారీస్‌కు టర్టిల్ నెక్ ఉన్న స్వెట్ షర్ట్ కూడా ధరించవచ్చు. ప్రయాణాలు, సింపుల్ గెట్ టు గెదర్ వంటి వాటికి ఈ స్టైల్ బాగా నప్పుతుంది. కాంతిమంతమైన రంగులలో అంచు భాగాన్ని ఎంబ్రాయిడరీ చేసిన సాదా చీరను ఎంచుకోవాలి. ఆ ఎంబ్రాయిడరీకి సరిపోలే ఓపెన్ ఫ్రంట్ పెప్లమ్ జాకెట్‌ను తీసుకోవాలి. దీంతో పార్టీవేర్ లుక్ ఆకట్టుకుంటుంది. ఒక్క పెప్లమ్ ఓపెన్ టాప్‌తో మీదైన స్టైల్ స్టేట్మెంట్ను ఈ కాలానికి సరికొత్తగా పరిచయం చేయచ్చు. పెళ్లికి వెళ్లేవారు పట్టు చీర కట్టుకుంటారు. దీనికి బ్లాక్ కలర్ లంగా జాకెట్, సంప్రదాయ ఆభరణాలు ధరించి చూడండి. ఇండో వెస్ట్రన్ లుక్‌తో ప్రత్యేకంగా కనిపిస్తారు. పార్టీకి చిటికలో తయారై వెళ్లాలంటే లాంగ్ జాకెట్‌తో ఉన్న ద్రెసింగ్ రెడీమేడ్ శారీని ఎంచుకుంటే చాలు. ఫ్యాషనబుల్‌గా కనిపించడంతోపాటు కాలానుగుణంగా డ్రెస్ ధరించడంలోనూ మార్కులు కొట్టేస్తారు. పెళ్లికి స్వెటర్ ధరిస్తే బాగుండదు అనుకునేవారు ఇలా పట్టుచీరకు లాంగ్ స్లీవ్స్ ఉన్న వైట్ షర్ట్ ధరించి, నడుముకు వెడల్పాటి లెదర్ బెల్ట్‌తో తయారవ్వచ్చు. సంప్రదాయ ముత్యాల హారాలు ఈ స్టైల్‌కు మరింత వన్నె తెస్తాయి. చదవండి: పాదాలను బట్టి వారెలాంటివారో అంచనా వేయొచ్చట!!.. ఐతే.. -
ఆమె వేసుకున్న షూస్ ఖరీదు ఎంతో తెలుసా..?
బాలీవుడ్ స్టార్ కిడ్స్‌కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. శ్రీదేవి తనయ జాన్వీ కపూర్, సైఫ్ కూతురు సరా అలీఖాన్ ఎప్పుడు మీడియాకు కనిపించినా ఫ్యాషన్ ప్రపంచంలో అదొక సంచలనమే. అంతగా తమ ఫ్యాషన్‌తో, స్టైల్‌తో ఆకట్టుకోవడం ఈ టీనేజ్ గర్ల్స్ ప్రత్యేకత. ఇక ఈ లిస్ట్‌లోకే వస్తారు షారుఖ్ ఖాన్ కూతురు సుహానా.. లెటెస్ట్ స్టైల్ ఫాలో కావడంలో.. పాపులారిటీలో తను ఇతర సెలబ్రిటీ కిడ్స్‌కు ఏమాతం తీసిపోదు. తాజాగా ఈ టీనేజ్ బ్యూటీ దీపావళి సందర్భంగా ముంబైలో సందడి చేసింది. తన స్నేహితులు ఆహనా పాండే, షనాయ కపూర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుండగా కెమెరా కంటికి చిక్కింది. ప్లెయిన్ వైట్ స్లీవ్‌లెస్ టీ, రిపెడ్ జీన్స్ వేసుకున్న ఈ అమ్మడు చూపరుల దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా సుహానా వేసుకున్న స్నీకర్స్ (షూస్) అందరి దృష్టి ఆకర్షించాయి. గ్యిసెప్ జానొట్టి కంపెనీకి చెందిన 'జెన్నిఫర్' వెడ్జ్ స్నీకర్స్ ధర ఎంతో తెలుసా.. అక్షరాల 995 డాలర్లు. అంటే రూ. 64వేలు అన్నమాట. ఈ మొత్తం డబ్బుంటే ఒకసారి హాయిగా థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లిరావొచ్చు. -
మళ్లీ తొక్కుతున్నారు!
ఫ్యాషన్ ఏమైనా చేయిస్తుంది. పాత అలవాట్లకు కొత్తరూపు ఇస్తుంది. కొత్త అలవాట్లకు సెలవు ఇస్తుంది. బైక్ మీద రయ్యిమని దూసుకెళ్లడం, కారులో హాయిహాయిగా ప్రయాణించడమే స్టయిల్ అనే భావన నుంచి పురుషులు మెల్లిగా బయటికి వస్తున్నారు. సైకిల్ తొక్కుతూ వెళ్లడమే ఇప్పుడు పురుషుల లేటెస్ట్ స్టయిల్‌గా మారింది. సైకిల్‌కు మ్యాచ్ అయ్యేలా సరికొత్త దుస్తులు ధరిస్తున్నారు. సైకిల్ కోసం దుస్తులా? దుస్తుల కోసం సైకిలా? అనేది ప్రశ్నగా మారింది. ‘‘కండలు పెంచడం కంటే, కనిపించేలా ప్రయత్నించడమే ఎక్కువ ఆనందం. సైకిల్ తొక్కుతున్నప్పుడు మన కండలను హుందాగా ప్రదర్శించవచ్చు’’ అంటున్నాడు ఒక లండన్ వాసి.