breaking news
Langval Project
-
1,200 మీటర్ల లోతులో బొగ్గు కోసం అన్వేషణ
సింగరేణిలో అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టుతో ప్రారంభం గోదావరిఖని: సింగరేణి 125 సంవత్సరాల చరిత్రలో మరో మైలురాయిని చేరుకోబోతున్నది. ఇప్పటివరకు 600 మీటర్ల లోతులోనే బొగ్గును వెలికితీయగా... భవిష్యత్‌లో వెయ్యి నుంచి 1,200 మీటర్ల లోతులో ఉన్న బొగ్గును వెలికితీసేలా సింగరేణి అన్వేషణ విభాగం కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా సింగరేణిలోనే మొదటిసారిగా కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని అడ్రియాల లాంగ్వాల్ గనిలో అన్వేషణ విభాగం ఆధ్వర్యంలో డ్రిల్లింగ్ పనులు నిర్వహించారు. ఇప్పటివరకు 600 మీటర్ల లోతులో బొగ్గు ఉంటే ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులలో ఒక టన్ను బొగ్గుకు ఆరు క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించేవారు. ప్రస్తుతం వస్తున్న అధునాతన యంత్రాలతో ఒక టన్ను బొగ్గుకు 12 క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే భూగర్భంలో 600 నుంచి 1,200 మీటర్ల లోతులో ఉన్న బొగ్గు కోసం కూడా అన్వేషణ మొదలైంది. ఇందుకోసం జేకే-5 డిప్‌సైడ్ బ్లాక్, ఆర్కే న్యూటెక్ డిప్‌సైడ్ బ్లాక్, వెంకటాపూర్ డిప్‌సైడ్ బ్లాక్, శ్రావణ్‌పల్లి-1 డిప్‌సైడ్ బ్లాక్‌లో కూడా అన్వేషణ పనులు కొనసాగుతున్నాయి. -
ఏఎల్పీలో ఊపందుకున్న ఉత్పత్తి
వెయ్యి నుంచి 3వేల టన్నులకు.. మరో 15 రోజుల్లో 10వేల టన్నులు వెలికితీతకు నిర్ణయం యైటింక్లయిన్‌కాలనీ(కరీంనగర్) : అడ్య్రాల లాంగ్వాల్ ప్రాజెక్టు నుంచి బొగ్గు ఉత్పత్తి ఊపందుకుంది. ప్రారంభంలో రోజుకు వెయ్యి టన్నులు వెలికితీసిన అధికారులు ఆ తర్వాత రెండు వేల టన్నులకు.. శుక్రవారం నుంచి మూడువేల టన్నులకు పెంచగలిగారు. షేరర్ యంత్రం కటింగ్ చేసిన బొ గ్గును చైనా స్టీల్కార్డ్ బెల్ట్ ద్వారా ఎప్పటికప్పు డు ఓసీపీ-1 సీహెచ్‌పీకి తరలిస్తున్నారు. మెయింటనెన్స్ కోసం రోజూ ఉదయం5 నుంచి 11గంటల వరకు బొగ్గు రవాణాకు వి రామం ఇస్తున్నారు. కొద్ది రోజుల్లో సమస్యల న్నింటిని అధిగమించి రోజుకు 10వేల టన్ను ల బొగ్గు ఉత్పత్తి చేసే దిశగా యాజమాన్యం ముందుకు సాగుతోంది. అంతకుముందే పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేపడతామని ఆర్జీ-3 జీఎం వెంకట్రామయ్య, ఏఎల్పీ జీఎం భాస్కర్‌రావు, ప్రాజెక్టు ఏజీఎం వీరారెడ్డి పేర్కొన్నారు. నెలకు 18వేల టన్నుల ఉత్పత్తి విదేశీ యంత్రాల సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పూర్తి స్థాయి సామర్థ్యాన్ని పరిశీలించేందుకు ట్రయల్న్ ్రపూర్తయిన త ర్వాత మూడు నెలల పాటు రోజుకు 18వేల ట న్నుల చొప్పున ఉత్పత్తి తీయడానికి అధికారులు యోచిస్తున్నారు. ఇందుకోసం ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. -
భూగర్భ గనుల్లో పూర్తిస్థాయి మిషన్ మైనింగ్ ఏర్పాటు
=అడ్రియాల లాంగ్వాల్ కోసం దేశం ఎదురు చూస్తోంది =సింగరేణి సీఅండ్ఎండీ సుతీర్థ భట్టాచార్య గోదావరిఖని(కరీంనగర్), న్యూస్‌లైన్ : భూగర్భ గనుల్లో పూర్తి స్థాయి మిషన్ మైనింగ్ ఏర్పా టు చేయనున్నట్లు సింగరేణి సీఎండీ సుతీర్థ భట్టాచార్య పేర్కొన్నారు. గురువారం ఉదయం గోదావరిఖనికి చేరుకు న్న ఆయన రామగుండం రీజియన్‌లో పర్యటించారు. ఏపీఏ పరిధిలోని జీడీకే-10ఏ ఆవరణలో ఏర్పాటు చేసిన అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్ట్ మినీబిల్డ్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి చేసే సంస్థలలో సింగరేణికి మంచి పేరు ఉందని, అదే స్ఫూర్తితో దేశంలో నే మొదటి సారిగా ఏర్పాటు చేస్తున్న అడ్రియాల లాంగ్వా ల్ ప్రాజెక్ట్ పనులను చాలెంజ్‌గా తీసుకుని చేపడుతు న్నా మని తెలిపారు. బొగ్గు గనుల చరిత్రలోనే ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని, దీని కోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తోందని చెప్పారు. అందుకు తగినట్టుగా అధికారులు, కార్మికులు కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రాజెక్ట్టు పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం పెరిగిందని, అయినా లాంగ్వాల్ మెషినరీని ఒకేసారి కొనుగోలు చేయడం వలన సంస్థకు ఆర్థికంగా లబ్ధి చేకూరినట్లు వివరించారు. ఓసీపీ-2 విస్తరణ పరంగా అటవీశాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిందని, త్వరలో పనలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి ఆశించిన మేర రాలేదని, లక్ష్యాలను చేరుకోవడానికి తీవ్రం గా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఓసీపీ-1లో క్వారీ పరిశీలన ఆర్జీ-3 ఏరియా పరిధిలోని ఓసీపీ-1 ప్రాజెక్టును సీఎండీ సందర్శించారు. ప్రాజెక్టు వ్యూపాయింట్ నుంచి క్వారీని పరిశీలించిన అనంతరం అధికారులతో మాట్లాడారు. డం పర్లు, డోజర్ల పనితీరుపై ఆరాతీశారు. ముఖ్యంగా బీఈఎంఎల్ సంస్థకు చెందిన కొత్తడోజర్లు, డంపర్లలో సాంకేతిక సమస్య లు తలెత్తుతున్నాయని, వీటి స్థానంలో కోమస్తు సంస్థకు చెందిన యంత్రాలను కొనుగోలు చేస్తే బాగుం టుందని అధికారులు సూచించారు. రాబోయే రోజుల్లో రక్షణతో కూడిన ఉత్పత్తికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఎండీ కోరారు. ఆయన వెంట ఏరియా జీఎం నర్సిం హారావు, ఏజెంట్ రవిప్రసాద్, మేనేజర్ నాగేశ్వర్రావు తదితరులున్నారు. ఆర్జీ-1 సీఎస్సీ ఫ్రీవే బంకర్ తనిఖీ ఆర్జీ-1 సీఎస్పీ ఇంజిన్ ఆన్ లోడింగ్ సిస్టమ్(ఈఓఎల్)లో ఫ్రీవే బంకర్ ద్వారా రైల్వే వ్యాగన్లో బొగ్గు నింపే ప్రక్రియ ను సీఎండీ తనిఖీ చేశారు. ఇటీవల శ్రీరాంపూర్ సీఎస్పీ నుంచి వ్యాగన్లలో ఎక్కువ బొగ్గు నింపుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ విధానాన్ని నిశితంగా పరిశీలించారు. కంప్యూటర్ సిస్టమ్‌లో బొగ్గు బరువును తూచే విధానాన్ని సింగరేణి సర్వర్‌కు అనుసంధానం చేయాలని సూచించా రు. సీఎండీ వెంట డెరైక్టర్లతోపాటు ఏరియా సీజీఎం కె.సుగుణాకర్‌రెడ్డి, రవిశంకర్, కె.చంద్రశేఖర్, పి.రమేశ్‌బాబు, బి.నాగ్య, రవిసుధాకర్‌రావు తదితరులు ఉన్నారు.