breaking news
Lakshmibai
-
కేంద్ర మాజీమంత్రి పి.శివశంకర్ భార్య లక్ష్మీబాయి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కేరళ, సిక్కిం రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన పి.శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి (94) గురువారం కన్నుమూ శారు. లక్ష్మీబాయి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన వయోలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు మేనకోడలు. విశాఖ జిల్లా ఎలమంచిలికి చెందిన ఆమె తండ్రి వృత్తిరీత్యా ఒడిశాకు మారారు. ఒడిశాలో మొదటి గ్రాడ్యుయేట్...ఒడిశా రాష్ట్రానికి చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్ లక్ష్మీబాయి. ఆమె ఉత్కల్ యూనివర్సిటీలో బీఏ చేసి, బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పోస్టల్ కోర్సు ద్వారా ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. 1955లో పి.శివశంకర్‌ను వివాహం చేసుకున్నారు. ఆమె 80 నుంచి 90 సంవత్సరాల వయస్సు మధ్యలో రెండు పీహెచ్డీ డాక్టరేట్లు సాధించారు. ఆమె చేసిన పీహెచ్‌డీల్లో ఒక దానికి బంగారు పతకంతోపాటు జీవిత సాఫల్య పురస్కారం లభించింది.ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సమర్పించిన థీసిస్ ’’భగవద్గీత, ఆధునిక కాలపు మనిషికి దాని ఔచిత్యం’పై 5,000 పేజీల ప్రవచనం. ఇది ఆమె పూర్తిగా చేతితో రాసిన వ్రాత ప్రతిని యూనివర్సిటీకి సమర్పించారు. ఆమెకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ డాక్టర్ వినయ్. కాగా, డా.లక్ష్మీబాయి మృతిపట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. -
రెండు కిలోల నూనె తాగి..
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ఆదివాసీ గిరిజనులైన తోడసం వంశస్తుల ఆరాధ్యదైవమైన ఖాందేవ్ జాతరలో సోమవారం ఓ మహిళ రెండు కిలోల నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకుంది. ఈ జాతర ఆదివారం రాత్రి ప్రారంభం కాగా, తోడసం వంశానికి చెం దిన ఆడపడుచు నువ్వుల నూనె తాగి మొక్కు తీర్చుకోవడం ఖాందేవ్ జాతరలో ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసం వారు నెలరోజుల ముందే నువ్వుల నూనె ను ఇంటి వద్దే తయారు చేస్తారు. తోడసం వంశంలోని ప్రతి ఇంటి నుంచి పూజకు తీసుకొచ్చిన నువ్వుల నూనెను సేకరిస్తారు. అలా సేకరించిన నూనెను గంగాపూర్ గ్రామానికి చెందిన తోడసం వంశ ఆడపడుచు కుమ్ర లక్ష్మీబాయి తాగి మొక్కు తీర్చుకుంది. రెండేళ్లుగా నూనె తాగి మొక్కు తీర్చుకుంటున్నానని, ఈ ఏడాది మొక్కు తీరిపోతుందని ఆమె పేర్కొంది. ఇలా చేయడం వల్ల సంతాన యోగం, కుటుంబంలో అందరికీ మంచి జరుగుతుం దని వారి నమ్మకం. ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్, తోడసం సోనేరావ్ పాల్గొన్నారు. అయితే, ఈ ఆచారం 80 ఏళ్లుగా వస్తుందని, తోడసం వంశానికి చెందిన ఆడపడుచులు మూడేళ్లకు ఒకరు నూనె తాగాల్సి ఉంటుందని ఆలయ పూజారి తోడసం ఖమ్ము పటేల్, తోడసం సోనేరావు తెలిపారు.