breaking news
laknepalli
-
పీవీ సేవలు మరువలేనివి
నర్సంపేట రూరల్ : మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు భారతదేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా నర్సం పేట మండలంలోని లక్నెపల్లి గ్రామంలో గురువారం పీవీ.నర్సింహారావు జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. సురభి ఎ డ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు సుర భి వాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పీవీ.నర్సింహారావు కాంస్య విగ్రహాన్ని లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌బాబు, రాష్ట్ర సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధర్మపురి పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ దేశంలో ఆర్థిక సం స్కరణలు తీసుకొచ్చేందుకు పీవీ సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. ప్రపంచ దేశాలు పీవీ.నర్సింహారావు చేసిన సేవలను కొనియాడుతుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. పీవీ.నర్సింహారావు భౌతిక కాయాన్ని కనీసం పార్టీ కార్యాలయానికి కూడా తీసుకురానివ్వలేదని విమర్శించారు. పీవీ జయంతి వేడుకలను నిర్వహించాలని నర్సంపేట ఎమ్మెల్యేకు సమాచారం అందించినా రాకపోవడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. పీవీ నర్సింహారావుపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి ఏమిటో తెలుస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌లో 7 ఫీట్ల పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరు పీవీ.నర్సింహారావు జీవిత చరిత్రను తెలుసుకుని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. లక్నెపల్లి గ్రామంలోని పీవీ.నర్సింహారావు స్మారక మందిరంలో లైబ్రరీని ఏర్పాటుచేసేందుకు సురభి ఎడ్యుకేషన్ సొసైటీ ముందుకు రావడం చాలా సంతోషకరమన్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్‌కుమార్ మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ. నర్సింహారావు జన్మించిన లక్నెపల్లి గ్రామంలో కుటుంబ సభ్యులు స్మారక మందిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమన్నారు. లక్నెపల్లి గ్రామం నుంచి ఎంతో మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కావాలని ఈసందర్భంగా కోరుకుంటున్నన్నారు. రాష్ట సివిల్ సప్లయీస్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ లక్నెపల్లి గ్రామ అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ.20 లక్షలు కేటా యించామని, త్వరలో పనులను ప్రారంభిస్తామన్నారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొడారి కవిత, తహసీల్దార్ పూల్‌సింగ్‌చౌహాన్, మదన్మోహన్రావు, ఎన్ఆర్ఐ వేణుగోపాల్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, ఉపసర్పంచ్ భగ్గి నర్సింహారాములు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శి నర్సయ్య, గూళ్ల అశోక్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి, కౌన్సిలర్ నాయిని నర్సయ్య, బైరి మురళి పాల్గొన్నారు. -
రూ.పది ఇవ్వలేదని భార్య ప్రాణం తీశాడు...
నర్సంపేట: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి 10 రూపాయుల కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు. వరంగల్ జిల్లా నర్సంపేట వుండలం లక్నెపల్లి గ్రామానికి చెందిన తుప్పతుర్తి బుచ్చయ్య మద్యానికి బానిసయ్యాడు. అనారోగ్యంతో ఆస్పత్రి పాలై సోమవారమే ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం స్వరూప(40)ను మద్యానికి రూ.10 ఇవ్వాలని కోరాడు. లేవని చెప్పటంతో ఆగ్రహంతో గొడ్డలితో మెడపై నరకగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
అగ్నిప్రమాదంలో మహిళ సజీవ దహనం
వరంగల్ : వరంగల్ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ మహిళ సజీవ దహనం అయ్యింది. నర్సంపేట మండలం లక్నేపల్లిలో గతరాత్రి ఒంటరిగా గుడిసెలో నిద్రిస్తున్న కొమురమ్మ అనే వృద్ధురాలు పూర్తిగా కాలిపోయారు. మంటను చూసి.. చుట్టుపక్కల వారు ఆర్పడానికి ప్రయత్నించారు. అయినా ఫలితంలేకపోయింది. ఫైరింజన్ వచ్చే వరకు గుడిసె మొత్తం కాలిపోయింది.