breaking news
labour workers
-
నల్లగొండ డీఈఓ కార్యాలయం వద్ద పరిస్థితి ఉద్రిక్తం
సాక్షి, నల్లగొండ: నల్లగొండలోని డీఈఓ కార్యాయలయం వద్ద కూలీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కూలీల అడ్డా వద్ద లోకల్ కూలీలు, బీహార్ కూలీలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. కూలీ డబ్బుల విషయంలో చెలరేగిన చిన్న వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. ఈ ఘటనలో పలు వాహనాల అద్దాలు ధ్వంసం కాగా, పరిసర ప్రాంతాలు రణరంగంగా మారాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. చదవండి: (మన మైసూర్.. ఇల్లెందు) -
కూలీ బతుకులపై ‘పెద్ద’ దెబ్బ
రోడ్డున పడిన రెండు లక్షల మంది కుదేలైన శ్రామిక జీవనం వలసబాటలో పలు గ్రామాలు నల్లధనమంటే తెలియదు...నల్ల కుబేరులంటేఅంతకన్నా తెలియదు...పెద్ద నోటు ఎందుకు రద్దు చేశారో... కూలీ డబ్బులు ఎందుకివ్వడం లేదో... పనిలోకి రావొద్దని ఎందుకంటున్నారో... ఉన్న ఉపాధి కాస్తా దూరమవుతున్నదెందుకో... పెనం మీద నుంచి పొయ్యిలోకి పడిపోడానికి కారణాలేమిటో... ఆ బడుగు మనసుల్లో ఎన్నో ప్రశ్నలు... పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటంలా ఎన్నాళ్లిలా... ఎన్నేళ్లిలా...దిన‘ధన’గండం... ఇదీ.. ‘తూర్పు’ శ్రామిక శక్తి.. భవన నిర్మాణ కార్మికులు లక్షా 10 వేల మంది ఒక్క రవాణా రంగంపై ఆధారపడి 75 వేల మంది ఆక్వా రంగంపై 35 వేల మంది హమాలీలు 30 వేల మంది జీడిపిక్కల ఫ్యాక్టరీల్లో 15 వేల మంది కాకినాడ పోర్టులో బోటు వర్కర్లు 10 వేల మంది 62 రూరల్ మండలాల్లోని 1,075 పంచాయ తీల పరిధిలో ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులున్నవారు 7,82,847 మంది నమోదైన 44,538 కూలీల గ్రూపుల్లో ఉన్న కూలీలు 7,54,230 మంది ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఉపాధి హామీలో పని పొందుతున్నవారు 30 వేల మంది మాత్రమే సాక్షి ప్రతినిధి, కాకినాడ : రెక్కాడితే గాని డొక్కాడని కార్మికుల బతుకుల్లో పెద్ద నోటు రద్దు పెద్ద దెబ్బే వేసింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేసి 40 రోజులు దాటుతున్నా వీరి జీవన విధానం కుదుటపడడం లేదు. ప్రధానంగా అసంఘటిత రంగంపై ఆధారపడ్డ వేలాది మంది కార్మికులు పనుల్లేక నానా యాతనా పడుతున్నారు. తాపీ మేస్రీ్తలు, హమాలీలు, ఆక్వా, రవాణా, భవన నిర్మాణం, జీడి పిక్కలు, పోర్టు వర్కర్స్.. ఇలా జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న రెండు లక్షల మంది కార్మికులు పనులు లేక పొట్ట గడవని దీనావస్థలోకి వెళ్లిపోతున్నారు. జిల్లాలో నిర్మాణ రంగం దాదాపుగా చతికిలపడింది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు పొద్దస్తమానం కష్టపడితే ఉపాధికి ఢోకా ఉండేది కాదు. ఇప్పుడు కష్టపడదామంటే అసలు పనే ఉండటం లేదు. బ్యాంకుల్లో నగదు విత్‌డ్రా చేసుకునే అవకాశం లేకపోవడంతో యజమానులు నిర్మాణ రంగాన్ని దాదాపుగా నిలిపివేశారు. నిర్మాణ రంగంలో నిర్వాహకులకు బ్యాంకుల్లో నగదు నిల్వలు ఉన్నప్పటికీ కరెన్సీ మారకం లేకపోవడంతో కిరాణా, ఆరోగ్యం వంటి వాటికి మాత్రమే పరిమితమవుతున్నారు.మరీ అత్యవసరమైన ఇంటి పనులు మాత్రమే చేయించుకుని మిగిలిన నిర్మాణ పనులను వాయిదా వేసుకుంటున్నారు. నిర్మాణ రంగం కుదేలు... ఈ పరిణామం నిర్మాణ రంగంలో ప్రత్యక్షంగా ఆధారపడ్డ తాపీ మేస్రీ్తలు, స్లాబ్‌లు వేసే జట్టు కూలీలు పనులు లేక మరో పని చేయలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజంతా కష్టపడితే నాలుగైదు వందలు చేతికి వచ్చే పరిస్థితి ఇప్పుడు దూరమైపోయింది. అలవాటు లేకున్నా గత్యంతరం లేక వ్యవసాయ పనుల్లోకి వెళుతున్నా అక్కడ కూడా రైతులు కూలి డబ్బులు వారానికి ఒకసారి కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు లక్షా 10వేల మంది వరకు ఉన్నారు. ఒక్క రవాణా రంగంపై ఆధారపడి జిల్లాలో 75 వేల మంది కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. ఆక్వా రంగంపై 35 వేల మంది, హామాలీలు 30వేల మంది, జీడిపిక్కల ఫ్యాక్టరీలలో 15 వేల మంది, కాకినాడ పోర్టులో 10వేల మంది బోటు వర్క్‌ర్స్ పనిచేస్తున్నారు. దాదాపు వీరందరి పరిస్థితీ అగమ్యగోచరంగా మారింది. నిత్యం పని ఉండే ఈ రంగాల్లో ప్రస్తుతం కరెన్సీ కష్టాల నుంచి గట్టెక్కలేక పనులను కట్టేశారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పనులు చేపడదామన్నా సొమ్ము సర్థుబాటు చేయలేక వదిలేయాల్సి వచ్చిందని భవన నిర్మాణ యజమాని పి వెంకటనారాయణ చెప్పుకొచ్చారు. ఉపాధి కూలీల దీనావస్థ ఇలా... వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఈ రకంగా ఉంటే ఉపాధి హామీ పథకంలో పనిచేస్తోన్న కూలీల దీనావస్థ మరో రకంగా ఉంది. అసలే ఉపాధి పనులకు అ¯ŒS సీజ¯ŒS. ఇందుకు కరెన్సీ కష్టాలు కూడా తోడవడంతో మొత్తం ఉపాధి కూలీలకు వేతనాలు అందక లబోదిబోమంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం రోజుకు సుమారు 30 వేల మందికి మాత్రమే ఉపాధి హామీ పనులు దొరుకుతున్నాయి. వ్యవసాయ సీజ¯ŒS ప్రారంభం కావడంతో ఈ పనులు మరింత మందగించాయి. ఉపాధి హామీలో పనిచేసిన వారికి నగదు పోస్టాఫీస్‌లు, బ్యాంకుల్లో జమవుతున్నా చేతికి అందకపోవడంతో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జమ సరే... జిల్లాలోని 62 రూరల్ మండలాల్లో 1,075 పంచాయతీల పరిధిలో 7,82,847 మందికి జాబ్ కార్డులున్నాయి. నమోదైన 44,538 కూలీల గ్రూపుల్లో 7,54,230 మంది కూలీలున్నారు. కానీ ప్రస్తుతం జిల్లా అంతటా కలిపితే 30 వేల మందికి మాత్రమే ఉపాధి హామీలో పని లభిస్తోంది. చేసిన పనికి కూడా చేతికి సొమ్ము దక్కని పరిస్థితి. గత నవంబరు నెలనే తీసుకుంటే మైదాన ప్రాంతంలో బ్యాంకులు, ఏజెన్సీ ప్రాంతంలో పోస్టు ఆఫీస్‌లలో ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు సుమారు రూ.3 కోట్లు నగదు జమయింది.అదే డిసెంబరు నెలకు వచ్చేసరికి రెండు కోట్ల వరకు ఉంటుందని జాతీయ ఉపాధి హామీ పథక నిర్వాహకులు చెబుతున్నారు. బ్యాంకులు, పోస్టు ఆఫీస్‌లో సొమ్ములు జమయినా చేతికి మాత్రం సొమ్ములు రావడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఏజెన్సీలో ఉపాధి పనులు లేక పలు మండలాల్లో గిరిజనులు ఖాళీ చేసి వలసలు కూడా వెళ్లిపోతున్నారు. రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని 11 మండలాల్లో 3లక్షల 50 వేల మంది జనాభా ఉంటే 1లక్ష11 వేల285 మందికి జాబ్ కార్డులున్నాయి. ఈ కార్డులున్న వారిలో గిరిజనులు 78 వేల మంది వరకు ఉంటారు. పనులు చేసి సొమ్ముల కోసం వారాల తరబడి బ్రాంచి పోస్టు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు మాత్రం ఇవ్వడం లేదంటున్నారు. మరోపక్క ఉపాధి పనులు లేక రంపచోడవరం, దేవీపట్నం, మారేడుమిల్లి, చింతూరు, గంగవరం తదితర మండలాల నుంచి గిరిజనులు పనులు కోసం వలస పోతున్నారు. గంగవరం మండలం లక్కొండ, జడేరు, మర్రిపాలెం పంచాయతీలో 20 గ్రామాల నుంచి పనులు కోసం నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలో సరుగుడు, చెన్నైలో జామాయిల్ తోటలు నరికేందుకు వలస పోతున్నారు. కార్మికులు, కూలీలపై పెద్ద నోట్లు రద్దు గట్టి దెబ్బతీసింది. పనులు లేక పస్తులుంటున్నాం పెద్ద నోట్ల రద్దుతో భవన నిర్మాణ పనులు చేసుకునే మాలాంటి వారి ఉపాధికి ఇబ్బందిగా మారింది. డబ్బులు లేవని మేస్రీ్తలు పనులు చెప్పడం లేదు. ఒకవేళ పని ఉన్నా డబ్బులు ఇచ్చే స్థితిలో మేస్రీ్తలు లేరు. దీంతో గత నెల రోజులగా ఒక పూట పనికి వెళ్తే వారం రోజులు ఇంటి వద్ద ఉంటున్నాం. డబ్బులు లేక కనీసం బియ్యం, కూరలు వంటివి తెచ్చుకోలేక పస్తులుండే పరిస్థితితో బాధపడుతున్నాం. పల్లెల్లో ఉంటున్నాం. బ్యాంకు కార్డుల ద్వారా లావాదేవీలు అంటున్నారు. వీటి వల్ల గ్రామీణులు ఆర్ధిక మోసాలకు లోనయ్యే అవకాశాలున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకుల ద్వారా ఎక్కువ నగదు ఇస్తేనే తమకు పనులు దొరుకుతాయి. – నున్న భీమశంకరరావు, భవన నిర్మాణ కార్మికుడు, కరప కార్మికుల జీవితాలతో ఆటలు పెద్దనోట్లు రద్దు చేసి నల్ల కుబేరుల భరతం పడతామని చెప్పిన ప్రధాని నరేంద్రమోదీ అసంఘటిత రంగ కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. నోట్ల రద్దుతో కార్మికులు ఉపాధి దొరక్క రోడ్డున పడ్డ పరిస్థితి ఏర్పడింది. మరో పక్క నగదు రహితం పేరుతో చిరువ్యాపారుల జీవితాలను అథః పాతాళానికి తొక్కే చర్యలు చేపట్టారు. – ఎం.వేణుగోపాల్, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి నెల రోజులుగా పనులు లేవు పెద్దనోట్లు రద్దు చేసిన దగ్గర నుంచి గడిచిన నెల రోజులుగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. నోట్ల రద్దుతో ఏర్పడ్డ సమస్యల కారణంగా యజమానులు నిర్మాణాలను ఆపి వేయడంతో పనులు దొరకడం లేదు. మేస్రి్తలు, కూలీలకు పూటగడవక ఇక్కట్లకు గురవుతున్నారు. – యాతం వెంకటరమణ, తాపీ మేస్త్రి -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల్లో దుర్ఘటన ఆపరేటర్ నిర్లక్ష్యంతోనే అంటున్న కూలీలు కొడకండ్ల(వరంగల్ జిల్లా): విద్యుత్ లైన్ పనులు చేస్తున్న దినసరి కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా కొడకండ్ల మండల కేంద్రం శివారులో సోమవారం జరిగింది. నల్లగొండ జిల్లా జలాల్పురం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన విద్యుత్ లైన్ మండల కేంద్ర శివారులోని హక్యా తండ వ్యవసాయ బావులకు ఉంది. ఈ లైన్‌లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభం కొంతకాలం క్రితం విరిగిపోయింది. విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తూ ఈ స్తంభం మార్చేందుకు సోమవారం మధ్యాహ్నం ఉపక్రమించారు. కాంట్రాక్టర్ సోమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం కందగట్లతండ, కొమ్మాల శివారు వీరునాయక్ తండాకు చెందిన గిరిజన దినసరి కూలీలు జలాల్పురం సబ్‌స్టేషన్‌లో మధ్యాహ్నం 12.26 నిమిషాలకు 92953 నంబర్‌పై ఎల్సీ ఇవ్వడంతో పని ప్రారంభించారు. విద్యుత్ స్తంభం మార్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ వద్ద ఏబీ స్విచ్‌కు కనెక్షన్ ఇచ్చేందుకు కందగట్లకు చెందిన గుగులోత్ బాబు(25) స్తంభం ఎక్కగా, వీరానాయక్ తండాకు చెందిన శివ డిస్క్ పనిచేసేందుకు వేరే స్తంభం ఎక్కాడు. బాబు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుత్ ప్రసారమై షాక్‌కు గురై గుగులోత్ బాబు స్తంభంపైనే ప్రాణం విడిచాడు. మంటలు వ్యాపించడంతో గమనించిన శివ స్తంభం నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా, ఎల్సీ తీసుకొని పనులు చేపట్టగా.. దానిని వెనక్కి ఇవ్వకుండానే సబ్‌స్టేషన్ ఆపరేటర్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని తోటీ కూలీలు సుధాకర్, శివ, భద్రు, సోమ్లా లు తెలిపారు. కందగట్ల తండాకు చెందిన గుగులోత్ రాజ-రాజమ్మ దంపతుల పెద్ద కుమారుడైన బాబుకు ఇంకా వివాహం కాలేదని సహచర కూలీలు తెలిపారు. -
కూలీ బతుకులు ఛిద్రం
అమ్మా...అమ్మా.... గాదెనబోయిన సంతోష రోజువారికూలీ. భర్తేమో లారీ డ్రైవర్. వారి కుమారుడు జశ్వంత్(4), కూతురు శరణ్య(2). రోజు మాదిరిగానే సాయంత్రానికి ఇంటికి చేరే తల్లి ఎంతకీ రాకపోవడంతో ఆ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పాపం ఆ పిల్లలకు తెలియదు తమ తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందని. అయితే సంతోష రెండు రోజుల క్రితమే పౌల్ట్రీ ఫామ్‌లోకి పని కుదిరింది. జనవరి ఫస్ట్‌న పనికి వెళ్లలేదు. కూలికి వెళ్లిన రెండోరోజే లారీ సంతోషను పొట్టనపెట్టుకుంది. వారంతా కూలీలు.. రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలు. భర్తలు వివిధ పనులు చేస్తుండగా ఇంటి బండి లాగడానికి తమవంతు కష్టపడుతున్నారు. కానీ వారి జీవితాల్లో లారీ చీకటి నింపింది. పని ముగించుకుని ఇంటికి వస్తున్న వారిని చిదిమేసింది. వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు దుర్మరణం పాలయ్యారు. - న్యూస్‌లైన్, కట్టంగూర్ కట్టంగూర్, న్యూస్‌లైన్ : నార్కట్‌పల్లి మండల పరిధిలోని ఏపీలింగో టం వద్ద జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మం డలంలోని ముత్యాలమ్మగూడానికి చెందిన నలుగురు కూలీలు మృతి చెందారు. గ్రామానికి చెందిన చెరుకు వెంకమ్మ(50), కట్టెకుంట్ల ధనమ్మ(30), గాదెనబోయిన సంతోష(28), కట్టెకుంట్ల ముత్తమ్మ(50) మృతి చెందారనే వార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో అత్తాకోడళ్లు ప్రమాదంలో దుర్మరణం చెందారు. బంధువుల, గ్రామస్తుల రోదనలతో గ్రామం శోకసంద్రంగా మారింది. పొట్టకూటి కోసం వెళ్లిన తొలిరోజే మృత్యుఒడికి చేరిన అత్తాకోడళ్లు గ్రామానికి చెందిన కట్టెకుంట్ల ముత్తమ్మ, కట్టెకుంట్ల ధనమ్మలు అత్తాకోడళ్లు. డిసెంబర్ 31న నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫాంలో కూలి పనికి ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా జనవరి 1 నూతన సంవత్సరం కావడంతో పనికి వెళ్లలేదు. దీంతో గురువారం పనుల్లోకి వెళ్లిన తొలిరోజునే మృత్యువాత పడడంతో కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. మృతురాలు ముత్తమ్మకు ఒక్కడే కొడుకు. కాగా ధనమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అత్తాకోడళ్లు ఇద్దరు వృత్తిరీత్యా కూలీలు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామంలో పంటపొలాలు, పత్తి పూర్తిగా దెబ్బ తిన్నాయి. దీంతో కూలీ పనులు దొరకపోవటంతో పౌల్ట్రీ ఫాంలో పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేందుకు రహదారిపై ఉండగా లారీ రూపంలో మృత్యువు కబలించింది. రె క్కాడితే డొక్కాడని కుటుంబం వెంకమ్మది చెరుకు వెంకమ్మ వృత్తిరీత్యా కూలీ. గతంలోనే భర్త మృతి చెందాడు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. కూలినాలీ చేసుకుంటూ ఇద్దరు కుమార్తెల వివాహం చేసింది. కొడుకు కుమార్‌ను ఇంటర్ చదివిస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడింది.