breaking news
Labour childrens
-
బండెడు చాకిరీలో బాల్యం
బాలకార్మికులుగా మగ్గుతున్న వారిలోనూ, పేదరికం కారణంగా చదువులకు దూరమవుతున్న వారిలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 6 లక్షల మంది ఇళ్లల్లో పని చేస్తుండగా, వారిలో కనీసం 2.5 లక్షల మంది బడి ఈడు అమ్మాయిలే కావడం గమనార్హం. చాలా కుటుంబాల్లో అబ్బాయిలను ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తుండగా, అమ్మాయిలను మాత్రం సర్కారీ బడులకు పంపుతున్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిల కంటే అమ్మాయిల సంఖ్యే ఎక్కువగా కనిపిస్తోంది. చదువుతో పాటు పని తప్పనిసరిగా మారుతుంది. కుటుంబ భారాన్ని మోసేందుకు ఇళ్లల్లో పనికి వెళ్తున్న మహిళలతో పాటు వారి కూతుళ్లు కూడా తప్పనిసరిగా పనిబాట పడుతున్నారు. అమ్మకు ఆసరా.. రామంతాపూర్‌నకు చెందిన మౌనిక ఓ స్వచ్ఛంద సంస్థ నడిపే స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. పేదరికం కారణంగా చదువు మానేసిన సోదరి, బేకరీలో పని చేసే అన్నయ్యతో పాటు తల్లిదండ్రులు ఉన్నారు. అందరూ ఏదో ఒక పని చేస్తున్న వాళ్లే. అయినా స్కూల్కెళ్లి చదువుకుంటున్న మౌనికకు సైతం తల్లితో పాటు ఇళ్లల్లో పని తప్ప లేదు. ఇద్దరూ కలిసి ఐదారు ఇళ్లల్లో పని చేస్తున్నారు. ‘చదువుకుంటుందని చెప్పి పనికి తీసుకెళ్లకుండా ఉంటే ఇల్లు గడుస్తుందా’ అని అంటోంది మౌనిక తల్లి యాకమ్మ.‘బాగా చదువుకోవాలని ఉంది. కానీ పనికెళ్లకుండా ఎలా సాధ్యం’ అంటోంది మౌనిక. పేదరికం కారణంగా అక్క చదువు ఆగిపోయినట్లు తన చదువు ఆగిపోకూడదని ఆ బాలిక కోరుకుంటోంది. చదువు సాగేదెట్లా.. పద్మకు ఒక్కగానొక్క కూతురు వేదిత. తొమ్మిది చదువుతోంది. పద్మ భర్త ఈశ్వర్ పక్షవాతంతో మంచాన పడ్డాడు. దీంతో భారమంతా పద్మపైనే పడింది. ఒకప్పుడు బాగానే బతికినా ఆకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఇళ్లల్లో పని చేస్తోంది. కానీ తనతో పాటు కూతురి శ్రమ కూడా తప్పనిసరైంది. ‘నా కూతురును బాగా చదివించాలనుకుంటున్నాను. కానీ పేదరికం వల్ల ఎక్కడ ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందోననే భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో పాటు పనికి రావద్దని కోరుకుంటా. అయినా తప్పడం లేదు.’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది పద్మ. -
వలస కార్మికుల పిల్లలు పనికే..
‘పెద్దలు పనికి.. పిల్లలు బడికి..’ అని ఆర్భాటంగా ప్రచారం చేసుకునే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మాటను మరిచింది. ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలకు విద్య అందని ద్రాక్షగా మారింది. విద్యాధికారుల నిర్లక్ష్యంతో పనివద్ద పాఠశాలలు ఇంకా తెరుచుకోలేదు. దీంతో చిన్నారులు ఆటాపాటకు పరిమితమయ్యూరు. హుస్నాబాద్, న్యూస్‌లైన్ : ఇటుక, గ్రానైట్, జిన్నింగ్, రహదారులపనులతోపాటు పలురకాల పరిశ్రమల్లో పనిచేసేందుకు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కార్మికులు జిల్లాకు వస్తున్నారు. కార్మికులు పనిచేసేచోట ప్రత్యేకంగా పాఠశాలలు లేకపోవడంతో సుమారు మూడువేల మంది పిల్లలు తల్లిదండ్రులతోపాటు ఆయా పరిశ్రమల్లోనే పనులు చేస్తున్నారు. ఏటా డిసెంబర్లో జిల్లాకు వచ్చి జూన్‌లో తిరిగి వెళ్లే వలస కుటుంబాలు వేలాదిగా ఉండడంతో వారిపిల్లలకు విద్యనందించేందుకు పనివద్ద పాఠశాలలను నిర్వహించేవారు. ఈ ఏడాది సైతం వాటిని ఏర్పాటుచేయాల్సి ఉండగా.. నేటికీ ఆ విషయంపై అధికారులు శ్రద ్ధ కనబరచకపోవడంతో పిల్లలు పనిలోనే మగ్గిపోతున్నారు. పనివద్దపాఠశాలలు ఏవీ.. విద్యాహక్కు చట్టం వచ్చిన త ర్వాత జిల్లాలో ఏటా ఆయా ప్రాంతాల్లోని విద్యార్థుల సంఖ్యననుసరించి పాఠశాలల నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించేవారు. హుస్నాబాద్, వేములవాడ, కమాన్‌పూర్, జగిత్యాల, మల్యాలతోపాటు పలు ప్రాంతాల్లోని ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల పిల్లలకోసం గతేడాది 40 వరకు పనివద్ద పాఠశాలలు ఏర్పాటుచేసి విద్యాబోధన చేశారు. ఈ ఏడాదిసైతం కార్మికులు జిల్లాకు వలసలు ప్రారంభమైనా వారిపిల్లలకు విద్యనందించే పాఠశాలలు మాత్రం ప్రారంభించలేదు. డిసెంబర్లో ప్రారంభించి మే వరకు ఈ పాఠశాలలను నిర్వహించాల్సి ఉండగా.. అధికారులు ఆ విషయూన్నే మరిచారు. పనిచేసేప్రాంతాలకు పాఠశాలలు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పిల్లలు ఆ పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో చిన్నారులు చదువుకు, మధ్యాహ్నభోజనానికి సైతం దూరమవుతున్నారు. ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తాం : శ్యాంప్రసాద్‌లాల్ , రాజీవ్‌విద్యామిషన్ పీడీ జిల్లాలో పనివద్ద పాఠశాలలను ఇంకా ఏర్పాటుచేయలేదు. కార్మికుల పిల్లలు ఇంకా జిల్లాకు చేరలేదు. ఎవరైనా కార్మికుల పిల్లలు ఉన్నారని సంబంధిత ఎంఈవోల ద్వారా ప్రతిపాదనలు వస్తే పరిశీలిస్తాం.