విద్యార్థి పైనుంచి దూసుకెళ్లిన బస్సు
పాడేరు రూరల్: విశాఖ జిల్లా పాడేరు మండలం చింతలవీధి జంక్షన్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న కుర్రా కుసుబాబు ద్విచక్ర వాహనంపై అరకు నుంచి పాడేరుకు వస్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొన్నాడు. దీంతో వాహనంపై నుంచి రోడ్డుపైకి పడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సు కుసుబాబు పైనుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సూర్య ప్రకాశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లొంగిపోగా, ఆటో డ్రైవర్ పరారయ్యాడు.