breaking news
Kukkaladoddi
-
రూ.కోటి విలువైన ఎర్ర చందనం డంప్ స్వాదీనం
కడప : వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి అటవీ ప్రాంతంలో పోలీసుల తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలు బయటపడ్డాయి. సుమారు రూ.కోటి విలువ చేసే ఎర్రచందనం డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న స్మగ్లర్ల కోసం పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. మరోవైపు బ్రహ్మంగారి మఠం మండలం వట్టిమడుగు అటవీ ప్రాంతంలో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 48 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
కుక్కలదొడ్డి సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి
తిరుపతి: కుక్కలదొడ్డి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఒకటి బైకును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులలో ఇద్దరు మహిళలు ఉన్నారు.