breaking news
krishna karrakatta
-
కరకట్టపై పల్టీకొట్టిన ఆటో..
ఘంటసాల (అవనిగడ్డ): మండలంలోని శ్రీకాకుళం వద్ద కృష్ణా కరకట్టపై ఆటో అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. పెనమలూరు మండలం గంగూరు గ్రామానికి చెందిన ఆరుగురు అవనిగడ్డలో ఓ ఫంక్షన్ వెళ్లి వస్తుండగా సోమవారం సాయంత్రం తిరిగి వస్తుండగా శ్రీకాకుళం కృష్ణాకరకట్ట వద్ద వారు ప్రయాణిస్తున్న ఆటో అదుపు తప్పడంతో పల్టీ కొట్టి దిగువకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేశారు. ఘంటసాల 108 సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ చిలకూరి వెంకటనర్సయ్య, ఫైలెట్ గాలం దినేష్ కుమార్ ఘటనా స్థలంలోనే తీవ్రంగా గాయపడిన అయ్యంకి ద్వారక, సురభి నిర్మలకుమారితోపాటు అయ్యంకి జానకి, మెహర్రాజ్ మనీషా, మరో ఇద్దరికి ప్రథమ చికిత్స చేసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఫోన్ చేసిన 20 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు ప్రథమ చికిత్స చేసిన 108 సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని సమాచారం. చదవండి: Omicron Outbreak: కరోనాకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఘన స్వాగతం పలుకుతోన్న గోవా! -
కృష్ణా కరకట్ట వద్ద ఉద్రిక్తత
గుంటూరు: కృష్ణా కరకట్ట ఒడ్డున శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరకట్ట వద్ద ఉన్నమత్య్సకారుల ఇళ్లను తొలగించేందుకు అధికారుల ఏర్పాట్లు చేపట్టారు. అయితే మత్య్సకారులకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అధికారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. 50 ఏళ్లుగా నివాసముంటున్న వారి ఇళ్లను తొలగించడం అన్యాయమని ఆయన విమర్శించారు. ప్రత్యామ్నాయం చూపకుండా మత్య్సకారుల ఇళ్లను తొలగించడం సరికాదన్నారు. అక్రమ నిర్మాణంలో సీఎం చంద్రబాబు నాయుడు రెస్ట్ హౌజ్ ను ఏర్పాటు చేసుకున్నారన్నారు. రెస్ట్ హౌజ్ నిర్మాణం అక్రమమో, సక్రమమో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణంలో బస చేసే సీఎం కు పేదల ఇళ్లను తొలగించే హక్కు లేదన్నారు.