వైఎస్సార్ సీపీలో 150 మంది చేరిక
లింగపాలెం : మండలంలోని కొత్తపల్లి గ్రామంలో టీడీపీకి చెందిన సుమారు 150 మంది నాయకులు, కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్ సీపీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త దయాల నవీన్‌బాబు పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకూ ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్ సీపీలో చేరిన వారిలో గుర్రాల వెంకటేశ్వరరావు(గడ్డియ్య), కత్తి వెంకటేశ్వరరావు, కె.సోమయ్య, కె.సత్యనారాయణ, గుర్రాల ఏసోబు, జి. వీరబాబు, కె.శ్రీను, కె.మారేశ్వరరావు, కత్తి నాగేశ్వరరావు, కె.కాశియ్య, నక్కా సత్యనారాయణ, కత్తి దుర్గారావు, కాసగాని శ్రీనివాసరావు, ఎన్కృష్ణారావు, వీరి అనుచరులు ఉన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ముసునూరి వెంకటేశ్వరావు, సీనియర్ నాయకులు ఏపూరి సూరిబాబు, మందలపు సాయిబాబు, కోటగిరి పాపారావు, కాసగాని ఆంజనేయులు, వడ్లాని లలిత, పొనగంటి సత్యనారాయణ, కొల్లి వీరభద్రరావు, వడ్లాని హరినాథరాజు, వడ్లాని యేసోబు, తోకల సత్యనారాయణ పాల్గొన్నారు.