breaking news
kothapalem
-
పెద్దమ్మను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..
కర్లపాలెం(బాపట్ల): బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకున్న తన బంగారాన్ని తనకు ఇవ్వాలని అడిగిన సొంత పెద్దమ్మను.. ఓ యువకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన గుంటూరు జిల్లా కొత్తపాలెంలో శనివారం చోటు చేసుకుంది. చందోలు ఎస్ఐ మణికృష్ణ తెలిపిన మేరకు.. కొత్తపాలెంకు చెందిన డేగల శ్రీనివాసరెడ్డి భార్య సుబ్బమ్మ (50)కు చెందిన 16 సవర్ల బంగారాన్ని చెరుకుపల్లి మండలం మార్వాకపాలెంలో ఉంటున్న ఆమె చెల్లెలు పగడం శ్యామల, చెల్లెలి కుమారుడు రాజశేఖరరెడ్డి మూడేళ్ల క్రితం బాపట్ల, చెరుకుపల్లి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి నగదు తీసుకున్నారు. ఆ నగదును సుబ్బమ్మ, శ్యామల సొంత ఖర్చులకు వినియోగించుకున్నారు. కొంతకాలం తరువాత బ్యాంకుల్లో ఉన్న తన బంగారం విడిపించమని, తాను తీసుకున్న నగదును సుబ్బమ్మ రాజశేఖర్‌రెడ్డికి ఇచ్చింది. అయితే బంగారం తెచ్చి ఇవ్వకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగి గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌రెడ్డి మట్టితోలే పనుల నిమిత్తం ట్రాక్టర్ వేసుకుని కొత్తపాలెం గ్రామానికి వచ్చాడు. సుబ్బమ్మ ట్రాక్టర్ తీసుకుని తన ఇంటి వద్ద పెట్టి.. బంగారం ఇచ్చిన తర్వాత తీసుకెళ్లాలని చెప్పింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ‘నిన్ను ట్రాక్టర్‌తో తొక్కి చంపేస్తాను.’ అంటూ రాజశేఖర్‌రెడ్డి ట్రాక్టర్‌ను ముందుకు పోనివ్వడంతో.. బంపర్‌పై కూర్చున్న సుబ్బమ్మ ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయింది. స్థానికులు ఆమెను రాంబొట్లవారిపాలెంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలు సుబ్బమ్మ -
పోలీస్ పహారాలో కొత్తపాలెం
గుంటూరు: వాహనాల సైరన్, పోలీసుల రాకపోకలతో మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న కొత్తపాలెం హడావుడిగా మారింది. కొండ ప్రాంతంలో నిత్యం పండ్లు, పూల తోటల పనుల్లో నిమగ్నమయ్యే గ్రామస్తులు గత రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలపై ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళన నడుమ జీవిస్తున్నారు. మాకు ఇదేం ఖర్మరా బాబూ..అంటూ తలలు పట్టుకుంటున్నారు. పోలీస్ పహారాలో గ్రామం ఉండటంతో అసహనానికి గురవుతున్నారు. తెల్లవారు జాము నుంచేఖాకీల హడావుడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ బుధవారం కొత్తపాలెం గ్రామంలో పర్యటిస్తున్నట్లు తెలుసుకున్న పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాత్రికి రాత్రే రూరల్ జిల్లా పరిధిలోని పోలీసులను అప్రమత్తం చేసి తెల్లవారుజాముకు గ్రామానికి చేరుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతం, అటు వైపు వెళ్లే మార్గాల్లో పోలీసు బలగాలను మోహరించారు. ఉదయం మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా అక్కడ పర్యటించనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆ ప్రాంతంలో నిఘా పెట్టారు. రెండు రోజుల అనంతరం మళ్లీ గ్రామంలోకి, గ్రామ ప్రధాన రహదారి వద్దకు వరుసగా పోలీసుల వాహనాలు వచ్చి నిలవడంతో ఏం జరిగిందోనని ఆందోళనలో పడ్డారు. గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న ఖాకీలు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు. ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు అక్కడ జరిగే ప్రతి చిన్న విషయాన్ని సైతం సెల్ఫోన్లలో, పోలీసుల వద్ద ఉన్న బాడీవార్న్ కెమెరాలలో చిత్రీకరించారు. ఇంటెలిజెన్స్ సిబ్బంది అయితే మీడియా ప్రతినిధులను సైతం వీడియోలు తీసి ఉన్నతాధి కారులకు చేరవేశారంటే పరిస్థితిని అర్థ చేసుకోవచ్చు. ఫిరంగిపురం నుంచి కొండవీడు వెళ్లే ప్రధాన మార్గంలో ఫిరంగిపురం గ్రామ శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ రాకపోకలు కొనసాగించే ప్రతి ఒక్కరినీ నిలువరించి వారి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయడంతో పాటు వివరాలు అడిగి తెలుసుకొని మరీ అనుమతిస్తున్నారు.కొండవీడు గ్రామం వద్ద, కొత్తపాలెం వెళ్లే ప్రధాన రహదారి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు కొనసాగించారు. అదనపు ఎస్పీలు ఎస్.వరదరాజు, ప్రసాద్‌తో పాటు డీఎస్పీలు రవివర్మ, శ్రీహరిబాబు, పోలీసుల ఏర్పాటు చేసిన క్యాంపు నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు, సిబ్బందికి సూచనలు జారీ చేశారు. పోలీసుల హడావుడి పెరగడంతో వ్యవసాయ పనులకు, వ్యక్తి గత పనులపై వెళ్లేవారు ఎన్నడూ లేని విధంగా రోడ్లుపై తనిఖీలు ఏంటంటూ అసహనం వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణకు అడుగడుగునా ఆటంకాలు చిలకలూరిపేట/యడ్లపాడు: రైతు పిట్టల కోటేశ్వరరావు(కోటయ్య) మృతిపై ఏర్పాటైన వైఎస్సార్ సీపీ నిజ నిర్ధారణ కమిటీకి పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. గుంటూరు జిల్లాలోని కొండవీడు ఉత్సవాల సందర్భంగా ఈనెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబు సభ నిర్వహించారు. దీనికి ఏర్పాట్ల పేరుతో పోలీసులు ఓ బడుగు రైతు ప్రాణాలు బలి తీసుకున్న సంఘటన విదితమే. ఈ విషయమై శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి నేతృత్వంలోని కమిటీ బుధవారం కొత్తపాలెం గ్రామాన్ని సందర్శించి, మృతుడు కోటయ్య కుటుంబాన్ని కలసి వివరాలు సేకరించింది. కమిటీలోని సభ్యులైన ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మొహమ్మద్ ముస్తఫా, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి, నర్సరావుపేట, బాపట్ల, గుంటూరు అంబటి రాంబాబు, మోపిదేవి వెంకటరమణ, లేళ్ల అప్పిరెడ్డి, నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని పలువురు పార్టీ నాయకులతో కలసి వచ్చారు. జాతీయ రహదారి నుంచి బోయపాలెం మీదుగా కొత్తపాలేనికి వెళ్లేందుకు బయలుదేరిన నాయకులకు ఆదిలోనే పోలీసులు అడ్డుకున్నారు. తాము శాంతియుతంగా నిజ నిర్ధారణ చేసేందుకు వెళ్తుంటే ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించడంతో కొద్దిమందే ఉన్న పోలీసులు నాయకులను వెళ్లనిచ్చారు. తిరిగి కోట గ్రామం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా చేరుకున్న పోలీసులు పార్టీ నాయకుల వాహనాలను అడ్డుకున్నారు. ఈ దశలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కొలుసు పార్థసారథి తదితర నాయకులు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. విడదల రజని, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి శాంతియుతంగా వెళుతున్న క్రమంలో అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. పోలీసుల తీరు సరికాదంటూ..సమస్యను మీరే సృష్టిస్తున్నారని విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్ష వైఖరితో వాహనాలను అడ్డుకోవటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు వాహనాలను వదలి కాలినడకన ముందుకు సాగారు. కొండవీడు వరకు నడక కొనసాగించారు. దీంతో పోలీసులు అక్కడి నుంచి నుంచి కొత్తపాలెం జంక్షన్‌కు „చేరుకుని గ్రామం వైపు, బైపాస్‌లో వెళ్లకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. కొండవీడు వరకు కాలినడకన వచ్చిన నాయకులు పోలీసులు వెళ్లిపోయాక వచ్చిన తమ వాహనాల్లో ఎక్కిరాగా.. తిరిగి కొత్తపాలెం జంక్షన్ వద్ద అగ్ర నాయకుల వాహనాలను మాత్రం వదిలి పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. -
కొత్తపాలెంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
విశాఖపట్నం (గోపాలపట్నం) : విశాఖ జిల్లాలోని గోపాలపట్నం మండలం కొత్తపాలెంలో గుర్తు తెలియని వ్యకి మృతదేహం కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దాదాపు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని కుక్కలు పీక్కు తినడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. -
కీచక గురువుపై నిర్భయ కేసు
విశాఖపట్నం : గత రెండు నెలలుగా ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడున్న ఉపాధ్యాయుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్ చట్టాల కింద ఎయిర్ట్‌పోర్టు జోన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గోపలపట్నం సమీపంలోని కొత్తపాలెం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సింహాచలం... గత కొంతకాలంగా అయిదో తరగతి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో విద్యార్థినిని తన ఇంటికి తీసుకు వెళుతున్న సయయంలో మహిళ సంఘాల నేతలు, విద్యార్థిని బంధువులు కీచక టీచర్‌ను పట్టుకుని రోడ్డుపై చితకొట్టారు. ఉపాధ్యాయుడు సింహాచలం కొద్దిరోజులుగా విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించటంతో ఆ విద్యార్థిని స్కూల్‌కు వెళ్లేందుకు విముకత చూపిస్తోంది. దాంతో విద్యార్థిని బంధువులు విచారించగా అసలు విషయం బయటపడింది. దాంతో కామాంధుడిని వలవేసి పట్టుకుని బడితెపూజ చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.