పట్టాలు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న రైలు
హైదరాబాద్: రైలు పట్టాలు దాటుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొల్లారం, గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషన్ మధ్యలోని కోంపెల్లి వంతెన సమీపంలో ఓ వ్యక్తి (45) రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ రైలు ఢీ కొట్టడంతో అతడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కాగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.