పట్టాలు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న రైలు | Man dies in train accident in secundrabad | Sakshi
Sakshi News home page

పట్టాలు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న రైలు

Apr 5 2015 7:58 PM | Updated on Sep 2 2017 11:54 PM

రైలు పట్టాలు దాటుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

హైదరాబాద్: రైలు పట్టాలు దాటుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సికింద్రాబాద్ రైల్వేపోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొల్లారం, గుండ్ల పోచంపల్లి రైల్వేస్టేషన్ మధ్యలోని కోంపెల్లి వంతెన సమీపంలో ఓ వ్యక్తి (45) రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ రైలు ఢీ కొట్టడంతో అతడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు.

కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. కాగా, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement