breaking news
Komatipalli
-
గబ్బిలాలకు కేరాఫ్.. కోమటిపల్లి
కేసముద్రం: ఏ గ్రామంలోనైనా ఒకట్రెండు గబ్బిలాలు కనిపిస్తేనే కీడు సోకుతుందని భయాందోళనకు గురవుతుంటారు. కానీ ఈ గ్రామంలో వందల సంఖ్యలో ఆవాసం ఏర్పాటు చేసుకున్న గబ్బిలాలను అక్కడి ప్రజలు పరిరక్షిస్తూ, వాటిపట్ల ప్రేమను చూపుతున్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం గబ్బిలాలకు ఆవాసంగా మారింది. గ్రామంలో మొదటి నుంచి శ్రీలక్ష్మీనారాయణస్వామి ఆలయం పక్కనున్న మర్రి, రావి వృక్షాలపై వందల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. క్రమక్రమంగా వాటి సంఖ్య పెరుగుతూ వచ్చాయి. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో గబ్బిలాలన్నీ శబ్దాలు చేస్తూ, ఊరంతా తిరుగుతూ వచ్చి వృక్షాలపై వాలుతాయి. అదే సమయంలో గ్రామస్తులు తెల్లవారిందనే సంకేతంతో నిద్రలేచేవారని స్థానికులు చెబుతుంటారు. వేసవికాలం వచి్చందంటే వడగాలులకు తట్టుకోలేక ఆలయంలో పక్కనున్న చెట్లపై నుంచి గ్రామసమీపంలోని చెరువువద్ద ఉన్న మర్రి, రావి వృక్షాలపైకి చేరుతాయి. ఎండ తీవ్రత, వడగాలులతో గబ్బిలాలు ఆకుల్లా రాలిపోతున్న దశలో దాత అందించిన స్ప్రింక్లర్ల సాయంతో చెట్లపైనున్న గబ్బిలాలకు నీళ్లను చల్లుతూ బతికించుకుంటారు. 3 వేలకు పైగా గబ్బిలాలుండటంతో కోమటిపల్లి గ్రామం గబ్బిలాలకు కేరాఫ్‌గా మారింది. నా చిన్నతనం నుంచి చూస్తున్నా మా ఊరిలోని శ్రీలక్ష్మీనారాయణస్వా మి ఆలయం పక్కనున్న చెట్లపై గబ్బిలాలు ఉండటం నా చిన్నతనం నుంచి చూస్తున్నా. గబ్బిలాలంటే అందరూ భయపడతారు. కానీ మా గ్రామంలో వందల సంఖ్యలో ఉన్న గబ్బిలాలను సంరక్షిస్తుంటాం. వేసవికాలం వచి్చందంటే అవి చనిపోకుండా స్ప్రింక్లర్లతో నీళ్లు చల్లిస్తూ బతికించుతాం. – జి.యాదగిరి, గ్రామస్తుడు మా గ్రామానికి ప్రత్యేకత మా గ్రామంలో కొన్నేళ్లుగా గబ్బిలాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమక్రమంగా వాటిసంఖ్య పెరుగుతూ వచ్చింది. గబ్బిలాలతో మాకు కీడు సోకుతుందనే భయంలేదు. పైగా వాటిని సంరక్షిస్తూ, మా గ్రామప్రజలు ప్రేమను చాటుతుంటారు. చుట్టుపక్కల ఏ గ్రామంలో గబ్బిలాలు కనిపించవు. మా ఊరిలోనే వందల సంఖ్యలో గబ్బిలాలు సంచరించడం, వృక్షాలపై ఆవాసం ఏర్పరుచుకున్నాయి. అందుకే మా గ్రామం గబ్బిలాలకు ప్రత్యేకతగా నిలుస్తుంది. – రావుల మల్లేశం, గ్రామస్తుడు -
కేజీబీవీలో నీటి ఎద్దడి
అవస్థలు పడుతున్న విద్యార్థినులు రామాయంపేట : రామాయంపేట పట్టణ శివారులోని కోమటిపల్లి గ్రామ సమీపంలోఉన్న కస్తుర్బాగాంధీ బాలికల విద్యాలయంలో తీవ్రస్థాయిలో నెలకొన్న నీటి ఎద్దడితో పాఠశాల విద్యార్థినులు ఇబ్బందులపాలవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రామాయంపేట కేజీబీవీలో రెండు వందల మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. గత ఏడాది కాలంగా నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులతో నీటి ఎద్దడి తీవ్రతరమైంది. స్కూలు సమీపంలోని చెరువులో బోరు వేసి మొదట్లో అక్కడినుంచి పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేశారు. అయితే ఆ బోరు కూడా ఎండిపోవడంతో నీటి ఎద్దడి తీవ్రమైంది. ప్రస్తుతం ఆ బోరునుంచి కొద్దిగా వస్తున్న నీటితో విద్యార్థినులు స్నానాలకు, మరుగుదొడ్లకు వినియోగించుకుంటున్నారు. ఇతర అవసరాల నిమిత్తం రోజూ ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా జరుగుతున్నా అవి ఎంతమాత్రం సరిపోవడంలేదు. ఇటీవల రెండుమూడు రోజలకోమారు ట్యాంకర్ వస్తుండటంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. దీంతో వారు నీటిని పొదుపుగా వినియోగించుకుంటున్నారు. ట్యాంకర్లో వస్తున్న నీటిని పాఠశాలముందు ఉన్న పెద్ద కుండీలో నిల్వ చేసుకుంటున్నారు. ఏడాది కాలంగా నీటి ఎద్దడితో అలమటిస్తున్నమని, ఈవిషయమై ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని విద్యార్థినులు వాపోయారు. దుస్తులు ఉతుక్కోవడానికిసైతం ఇబ్బందిగా ఉందని వారు వాపోయారు. ఆగస్టు ఒకటినుంచి ట్యాంకర్లు బంద్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో విద్యార్థినులు మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తుంటేనే ఇంత ఇబ్బందిగా ఉందని, ట్యాంకర్ రాకుండా తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి సమస్యను పరిష్కరించాలి అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థినుల అవస్థలు దృష్టిలో ఉంచుకొని యుద్ధ ప్రతిపాదికన స్కూలులో నీటివసతి కల్పించాలి. ఏడాది కాలంగా నీటి ఎద్దడితో ఇబ్బందులకు గురవుతున్నాం. బోరులో నీరు అడుగంటడంతో ఈసమస్య నెలకొంది. ట్యాంకర్‌ను యధావిధిగా కొనసాగించాలి.-నీటి సమస్యను పరిష్కరించాలి