breaking news
kochi metro rail
-
‘మెట్రో’ మా పెళ్లి చేసింది..!
తిరువనంతపురం : పెళ్లి మండపానికి కుటుంబ సభ్యులతో బయలుదేరాడు పెళ్లికొడుకు.. ఇంతలో భారీ ట్రాఫిక్ జామ్.. పెళ్లి సమయం సమీపిస్తోంది. ఎం చేయాలో అర్థం కావట్లేదు.. ఇంతలో ఒకరు మెట్రోలో ప్రయాణించండి అని సలహా ఇచ్చారు. అంతే కుటుంబమంతా మెట్రో ఎక్కేసింది.. సమయానికి మండపానికి చేరుకుంది. దీంతో ఆ జంట ఒక్కటైంది. గతవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొచ్చి మెట్రో తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఆ జంట మా పెళ్లిని మెట్రోనే చేసిందని తెలుపుతూ..తమ అనుభావాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన రంజీత్‌కుమార్, ధన్యల వివాహం డిసెంబర్ 23న జరిగింది. పెళ్లి రోజు రంజీత్ కుమార్ తన కుటుంబ సభ్యులతో ఉదయం 6 గంటలకు పాలక్కడ్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎర్నాకులంలోని పెళ్లి మండపానికి కారులో బయలుదేరారు. పెళ్లి ముహుర్తం 11 గంటలకు ఉంది. ఆ సమయం వరకు చేరుతాననే నమ్మకంతో ప్రయాణం ప్రారంభించారు. 100 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అలువాలో భారీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోంది. ఇక్కడి నుంచి ఎర్నాకులంకు మరో 30 కీలోమీటర్ల దూరం. ఇంతలో ఒకరు మెట్రో ఎక్కండని సలహా ఇచ్చారు. అలువా మెట్రో స్టేషన్‌కు వెళ్తే తీరా అక్కడ టీకెట్ల కోసం పెద్ద క్యూ.. దీంతో పెళ్లి కొడుకైన రంజీత్ పెళ్లి సమయం సమీపిస్తోంది.. పెళ్లి మండపానికి చేరుకోవాలి సహాయం చేయండి అని బతిమాలుకున్నాడు. చివరకు టిక్కెట్లు సాధించి అనుకున్న సమయానికి చేరి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా కొచ్చి మెట్రో రైలు ప్రారంభమైన విషయం తెలిసిందే. -
మెట్రో రైలులో మోదీ ప్రయాణం
కోచి: కేరళలో తొలి మెట్రో రైలు సర్వీస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. కోచిలో మెట్రో రైలు ప్రారంభించిన అనంతరం పలరివట్టం నుంచి పాత దిప్పలానికి మెట్రో రైలులో సామాన్య ప్రయాణికుడిగా మోదీ ప్రయాణం చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఓవరాల్‌గా 25 కిలోమీటర్ల దూరం కాగా.. తొలి దశలో 13.2 కిలోమీటర్లు పొడవున ఆలువా-పలరివట్టం మార్గంలో ఈ సేవలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రెండో దశలో 11.8 కి.మీ మార్గంలో సేవలు అందించనున్నట్లు అధికారులు చెప్పారు. బస్సులో ఈ మార్గంలో వెళ్లేందుకు 45 నిమిషాలు పట్టనుండగా, ఈ మెట్రో రైలులో కేవలం 23 నిమిషాల్లో గమ్యాన్ని చేరవచ్చు. 2013లో శంకుస్థాపన జరిగిన ఈ దశకు నేటితో మోక్షం కలిగింది. ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు కూడా ఉద్యోగం కల్పించేందుకు సిద్ధమని కోచి మెట్రో రైలు కార్పోరేషన్ ఇటీవల పేర్కొంది. కేరళ గవర్నర్ సదాశివం, సీఎం పినరయి విజయన్, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, 'మెట్రో మ్యాన్' ఈ శ్రీదరన్ సహా పలువురు మెట్రో రైలులో ప్రయాణం చేశారు. -
మెట్రో రైల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు
కోచి మెట్రో రైల్ లిమిటెడ్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. మెయిన్టైనర్స-68, ట్రైనీ ఆపరేటర్/స్టేషన్ కంట్రోలర్స-80, జూని యర్ ఇంజనీర్స-22, సెక్షన్ ఇంజనీర్స-18. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది అక్టోబర్ 21. వివరాలకు http://kochimetro.org/career/ చూడొచ్చు. ఈఎస్ఐసీ-న్యూఢిల్లీలో జూనియర్ ఇంజనీర్లు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స కార్పొరేషన్(ఈఎస్ఐసీ)-న్యూఢిల్లీ.. జూనియర్ ఇంజనీర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వివరాలు.. జూనియర్ ఇంజనీర్ (సివిల్-96, ఎలక్ట్రికల్-58). సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా/బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉన్నవారు అర్హులు. వయసు 30 ఏళ్లు మించరాదు. చివరి తేది నవంబర్ 10. వివరాలకు http://esic.nic.in/ సెంట్రల్ రైల్వేలో ట్రేడ్ అప్రెంటిస్‌లు సెంట్రల్ రైల్వే.. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డీజిల్ మెకానిక్-79, ఎలక్ట్రీషియన్-8, వెల్డర్(జీఅండ్ఈ)-5, మెషినిస్ట్-1, పెయింటర్(జనరల్)-1. పదో తరగతి, ఐటీఐలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. వయసు 24 ఏళ్లు మించరాదు. నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులను ‘సీనియర్ డివిజినల్ మెకానికల్ ఇంజనీర్(డీజిల్), డీజిల్ షెడ్, ఘోర్పురి, పుణె-411001’కు పంపాలి. చివరి తేది అక్టోబర్ 8. వివరాలకు www.cr.indianrailways.gov.in చూడొచ్చు. దీప్‌చంద్ బంధు హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్స్ ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ఉన్న దీప్‌చంద్ బంధు హాస్పిటల్ అడ్హాక్ విధానంలో సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టులు 7. సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లు మించరాదు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 5న ఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. మరిన్ని వివరాలకు www.delhi.gov.in చూడొచ్చు. సీజీసీఆర్ఐలో ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ సీఎస్ఐఆర్-సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ ఇన్స్టిట్యూట్(సీజీసీఆర్ఐ).. ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు 7. నిర్దేశిత సబ్జెక్టుల్లో బీఎస్సీ/బీఈ/బీటెక్/డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు. వయసు 28 ఏళ్లు మించకూడదు. అర్హులైనవారు అక్టోబర్ 8న కోల్‌కతాలో సీజీసీఆర్ఐ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. వివరాలకు www.cgcri.res.in/ నిట్ - కర్ణాటకలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు కర్ణాటకలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్).. వివిధ విభాగాల్లో ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(బ్యాక్లాగ్)ల నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఎస్సీ-03, ఎస్టీ-10, ఓబీసీ-16). దరఖాస్తును వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చివరి తేది అక్టోబర్ 30. వివరాలకు www.nitk.ac.in చూడొచ్చు. ఆర్జీఎన్ఐవైడీలో ప్రొఫెసర్లు శ్రీపెరంబదూర్లోని రాజీవ్‌గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్మెంట్ (ఆర్జీఎన్ఐవైడీ) ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 5. విభాగాలు.. ఎకనామిక్స్, జండర్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, ట్రైనింగ్. చివరి తేది అక్టోబర్ 21. మరిన్ని వివరాలకు http://www.rgniyd.gov.in/node/1004 చూడొచ్చు.